గారె
గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి[1]. దీనిని కొబ్బరి పచ్చడితో గాని, వేరుశనగ పప్పు పచ్చడితో గాని, శనగ పప్పు పచ్చడితో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్ది రోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చేస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.
గారెలు అంటే..[మార్చు]
గారెలు అంటే..మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మినపగారెలే.
గారెలు - తయారు చేయడం చాలా సులభం[మార్చు]
నిజం చెప్పాలంటే గారెలు తయారు చెయ్యడం చాలా సులభం. అసలు వంటేమీ రాని వారు కూడా చాలా చక్కగా, రుచికరంగా గారెలు తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితులకీ, బంధుమిత్రులకీ రుచి చూపించి ‘ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..’ అనిపించవచ్చు.
రకాలు[మార్చు]
- మినప గారెలు
- పాకం గారెలు
- పెరుగు గారెలు - లేదా - ఆవడలు పెరుగు గారెలనే ఆవడలు అని కూడా అంటారు. గారెలు చేసి పెరుగు తాలింపులో వేయాలి.
- సగ్గుబియ్యం గారెలు
- అలచంద గారెలు
- పెసర గారెలు
- చెక్క గారెలు
- శనగ గారెలు
- అల్లం మిర్చి మినప పుణుకు
చిట్కాలు[మార్చు]
గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.
- మినుములతో పాటు కొద్దిగా బొబ్బర్లు, కొద్దిగా జీడిపప్పు, కొంత బంగాళాదుంప కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.
![]() |
Wikimedia Commons has media related to Vada (snack). |
![]() |
Look up గారె in Wiktionary, the free dictionary. |
మూలాలు[మార్చు]
- ↑ "ఉగాది స్పెషల్ మినప గారెలు". telugu.boldsky.com. Retrieved 2015-06-04.