పులుసు
(చారు నుండి దారిమార్పు చెందింది)
పుల్లని రుచి గల చింతపండు, పులుసు నిమ్మ వంటి వాటితో తయారైన ద్రవ రూప కూరలను పులుసు అంటారు. కొన్ని రకాల పులుసులను తియ్యగా కూడా చేసుకుంటారు.
రకాలు[మార్చు]
పచ్చిపులుసు[1][2][మార్చు]
పచ్చి మిరపకాయలు, చింతపండు ఉపయోగించి తయారు చేసిన పులుసును పచ్చిపులుసు అంటారు.
తోటకూర పులుసు[మార్చు]
తోటకూర, చింతపండు ఉపయోగించి తయారుచేసిన పులుసును తోటకూర పులుసు అంటారు.
పులిహోర పులుసు[మార్చు]
పులిహోర తయారు చేయడానికి తయారు చేసుకున్న చింతపండు పులుసును పులిహోర పులుసు అంటారు.
చేపల పులుసు[మార్చు]
మాంసాహారంగా చేపలనుపయోగించి చేసుకుంటే రుచికరమైన చేపల పులుసు అవుతుంది.