ధనియాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Coriander
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Coriandrum
Species:
C. sativum
Binomial name
Coriandrum sativum
Dried coriander fruits
More dried coriander fruits

ధనియాలు ఒక విధమైన వంటలో ఉపయోగించే గింజలు. వీటిని కొరియాడ్రం సటైవం; దీనిని మరో రకంగా సీలెంట్రో అని కూడా అంటారు ముఖ్యంగా అమెరికా దేశంలో పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా మధ్యధరా దేశాల్లో కనిపించే వార్షిక మొక్క.ఉష్ణోగ్రత తగినంత వేడి ఉన్న ప్రదేశాలలో పెరగడం ఇష్టపడతాయి. ఈ మొక్కలు మంచి సువాసన కలిగి ఉంటాయి.ఇవి పెరిగె ప్రదేశాల నుండి కొన్ని మీటర్ల దూరం వరకు సువాసన వెదజల్లుతుంది. కాండం 3 అడుగుల పొడవ వరకు ఉండవచ్చు.కాండం సన్నగా వుండి ఆకులతో వుంటుంది.కొమ్మల దగ్గర పువ్వులు గుంపుగా ఉండి ఊదా రంగులో ఉంటాయి.

ధనియాలు[మార్చు]

ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ, ల్యాటిన్‌లో కొరియాండ్రమ్ సెటైవం అనీ పిలుస్తారు. సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితీ.

  • అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు.
  • ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది.
  • ధనియాల నుంచి తీసిన తైలం బ్యాక్టీరియాను, వివిధ సూక్ష్మక్రిముల లార్వాలను అంతమొందించినట్లు పరిశోధనల్లో తేలింది.
  • ఇండియన్ హెర్బల్ ఫార్మకోపియా, జర్మన్ కమిషన్, బ్రిటీష్ హెర్బల్ ఫార్మకోపియా వంటివి ధనియాలను ఆకలి తగ్గిన సందర్భాల్లోనూ, డిస్పెస్పియా (ఆమ్లపిత్తం/ స్టమక్ అప్‌సెట్) లోనూ వాడవచ్చని సూచించాయి.
  • యూనానీ వైద్య విధానంలో ధనియాలను రక్తంతో కూడిన మూల వ్యాధిలోనూ, కాళ్లుచేతుల్లో మంటల్లోనూ, తలనొప్పి, స్వప్నస్కలనాల్లోనూ వాడతారు. * ధనియాలను చైనా వైద్య విధానంలో మీజిల్స్, మధుమేహం, గ్యాస్ట్రోఎంటిరైటిస్ (విశూచిక), త్రేన్పులు వంటి సమస్యల్లో వాడుతారు.
  • వివిధ రకాలైన రోగాలను తగ్గిస్తుంది కాబట్టి ఆయుర్వేదంలో ధనియాలను ‘కుస్తుంబురు’అనే పర్యాయపదంతో పిలుస్తారు. అలాగే ‘వితున్నక’అని మరో పర్యాయపదం కూడా దీనికి ఉంది. శరీరంలో మంటలను తగ్గించేది అని ఈ పదానికి అర్థం.
  • ధనియాలతో రకరకాల ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. ఉదాహరణకు ధాన్యకాది హిమం (అతి దప్పికను తగ్గించడానికి వాడతారు), గుడుచ్యాది క్వాథం (జ్వరంలో తాపాన్ని తగ్గించడానికి వాడతారు), అభయారిష్టం (మలబద్ధకం, అర్శమొలల వ్యాధిలో వాడతారు), లవణ భాస్కర చూర్ణం (కడుపునొప్పిలో అజీర్ణాన్ని తగ్గించడానికి వాడతారు)... ఈ ఔషధాల తయారీలో ధనియాలు ఒక ప్రధాన ద్రవ్యం.
  • ధనియాల చూర్ణాన్ని 3-5గ్రాములు మోతాదులోనూ, ధనియాల హిమం (కోల్డ్ ఇన్‌ఫ్యూజన్) 20-30 మి.లీ. మోతాదులోనూ, ధనియాల కషాయాన్ని 50-100 మి.లీ. మోతాదులోనూ వాడాలి.

ధనియాలు ఔషథోపయోగాలు[మార్చు]

ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. .ధనియాలను సంస్కృతంలో ధన్యాకమని, హిందీలో ధనియ అని అంటారు. దీని మొక్క 30 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుంది. ఆకులు చిన్నగా ఉండి, సువాన కలిగి ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏర్పడుతాయి. దీని కాయ రెండు దళాలుగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ రెండు బీజాలు ఉంటాయి. ధనియాలు మొక్క దశలో ఉన్నప్పుడు దానిని మనం కొత్తిమీర అని వ్యవహరిస్తాము. దీనిని కూడా వంటలలో తరచుగా ఉపయోగిస్తాము. ధనియాలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఎక్కిళ్లు, జ్వరా లను తగ్గిస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. రుచిని పెంపొంది స్థాయి. ఆకలిని పెంచుతాయి. సుఖ నిద్ర కలుగజేస్తాయి. ఔషధోపయోగాలు - ధనియాలను వేయించి పొడి చేసి పూటకు సగం చెంచా చొప్పున క్రమం తప్ప కుండా తింటే శరీర దౌర్బల్యం తగ్గుతుంది. - ధనియాలను కషాయంగా కాచుకుని అందులో పంచదార కలిపి తాగితే అతి దాహం తగ్గుతుంది. - ధనియాలు చూర్ణం, పంచదార కలిపి బియ్యపు కడుగు నీటితో తీసుకుంటే శ్వాస, కాసలు తగ్గుతాయి. - ధనియాలు, శొంఠి కలిపి కషాయం తీసుకుని సేవిస్తే అజీర్ణం తగ్గుతుంది. - ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. - ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులను నేతిలో వేయించి, ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజూ అన్నంతో తింటే రుచి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. - ధనియాల కషాయానికి సమంగా తేనె కలిపి ఒక కప్పు మోతాదుగా సేవిస్తే మూత్రం ద్వారా జరిగే ఇంద్రియ నష్టం తగ్గుతుంది. - ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తలమీద పట్టు వేసుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతాయి. -ధనియాలు, బార్లి గింజలు సమంగా నూరి వాపు ఉన్నచోట లేపనంగా వేస్తే వాపు తగ్గుతుంది. ఆయుర్వేదిక్ వినియోగము గృహ చికిత్సలు/- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి జ్వరం * ధనియాలను బరకగా నూరి, దాని తూకానికి ఆరు రెట్లు చన్నీళ్లుపోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం పంచదార కలుపుకొని తాగితే శరీరంలో మంట, వేడి తగ్గుతాయి. * ధనియాలును, చెదుపొట్ల ఆకులను కషాయం తయారుచేసుకొని తాగితే జ్వరంలో ఆకలి పెరుగుతుంది. సుఖ విరేచనమై జ్వరం దిగుతుంది.

  • జ్వరంలో ఆకలిని పెంచడానికి, ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించడానికి 2 భాగాలు ధనియాలను, 1 భాగం శొంఠిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి. * శిశిరంలో వచ్చే జ్వరాలను తగ్గించుకోవడానికి ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని, నిమ్మరసాన్ని, పంచదారనూ కలిపి తీసుకోవాలి. నీళ్ల విరేచనాలు (అతిసారం) * ధనియాలు, శొంఠి, మారేడుపండు గుజ్జు వీటితో కషాయం తయారుచేసుకొని తాగితే ఆమం పచనం చెందుతుంది. కడుపునొప్పి, మలబద్ధకం తగ్గి ఆకలి పెరుగుతుంది. జ్వరం దిగుతుంది. * ధనియాలు, నెయ్యి, నీళ్లు- వీటిని 1:4:16 నిష్పత్తిలో తీసుకొని ధృతపాకం (నీరంతా ఆవిరయ్యేలా మరిగించటం) చేసుకొని వాడుకోవాలి. దీనిని ధాన్యక ఘృతం అంటారు. దీనిని వాడితే విరేచనాల్లో కనిపించే పైత్యపు నొప్పి తగ్గి ఆకలి పెరుగుతుంది. అరుగుదల కూడా మెరుగవుతుంది. అజీర్ణం ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని తాగితే అరుగుదల పెరుగుతుంది. ఇది మూత్రాన్ని కూడా జారీచేస్తుంది. అర్శమొలలు ధనియాలకు నేలవాకుడు (ములక/కంటకారి) మొక్కను సమూలంగా గాని లేదా శొంఠిని గాని కలిపి కషాయం కాచి తీసుకుంటే అరుగుదల పెరిగి వాయువునుంచి ఉపశమనం లభిస్తుంది. గుల్మం (శరీరంలో పెరుగుదలలు) ధనియాలను కషాయం రూపంలో తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా తయారైన పెరుగుదలలు శుష్కించిపోతాయి. వాంతులు ధనియాల కషాయానికి నిమ్మరసం, ఉప్పుకలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. ధనియాల పొడి, వెలగ పండు గుజ్జు, త్రికటు చూర్ణం వీటిని కలిపి బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి. విపరీతమైన దప్పిక ధనియాలను నలగ్గొట్టి చన్నీళ్లకు కలిపి హిమం రూపంలో పంచదార, తేనె చేర్చి తీసుకుంటే దప్పిక తీరుతుంది. ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) ధనియాలు, శొంఠి, ఆముదం వేరు- వీటి మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే ఆమవాతంలో కనిపించే జాయింట్ల నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది. వాత రక్తం (గౌట్) 10గ్రాముల ధనియాలు, 20గ్రాముల జీలకర్ర, తగినంత బెల్లం... వీటిని కలిపి ఉడికించి లేహ్యం మాదిరిగా తయారుచేసుకొని తీసుకుంటే వాత రక్తంలో ఉపశమనం లభిస్తుంది. ధనియాల పొడిని, శొంఠి పొడిని పాలకు కలిపి తీసుకుంటే వాత రక్తంలో హితకరంగా ఉంటుంది. పిల్లల్లో దగ్గు, ఆయాసం ధనియాల పొడి (చిటికెడు), మిశ్రీ (చిటికెడు) వీటి మిశ్రమాన్ని బియ్యం కడుగు నీళ్లతో ఇస్తే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, ఆయాసం వంటివి ఉపశమిస్తాయి. కడుపునొప్పి అజీర్ణంవల్ల కడుపునొప్పి వస్తున్నప్పుడు ధనియాలు, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము, అల్లం, గింజలు తొలగించిన నల్లద్రాక్షతో పచ్చడి చేసుకొని తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. ఉదరంలో గ్యాస్ తయారవటం జీర్ణక్రియ జరిగే సమయంలో నొప్పి రావటం, ఉదరంలో గ్యాస్ తయారవటం, అజీర్ణం వంటి సమస్యల్లో తేనె కలిపిన ధనియాల కషాయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. మూత్రంలో మంట ధనియాల కషాయానికి చిటికెడు రేవలచిన్ని పొడిని కలిపి తీసుకుంటే మూత్రంలో చురుకు తగ్గుతుంది.
  • శరీరంలో స్థానికంగా వాపు తయారవటం ధనియాల కషాయం తీసుకుంటే మూత్రం జారీ అవటం మూలాన వాపు తగ్గుతుంది. దీంతోపాటు 2 భాగాల పసుపును, 1 భాగం సైంధవ లవణాన్ని కలిపి మెత్తగా నూరి నీళ్లుకలిపి జారుడుగా చేసి స్థానికంగా- వాపుమీద పట్టువేసుకోవాలి. తల తిరగటం ధనియాలు, చందనం, ఉసిరి పెచ్చులు వీటిని సమాన భాగాలు తీసుకొని చన్నీళ్లలో నానబెట్టి హిమం తయారుచేసుకొని వాడితే తల తిరగటం, కళ్లు బైర్లుకమ్మటం వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి సమస్యలు, కళ్ల మంటలు 20గ్రాముల ధనియాలను ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించి, పరిశుభ్రమైన నూలుగుడ్డతో వడపోసి, ఒక్కో కంట్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. కళ్ల కలక, కళ్లమంటలు, కళ్ల దురదలు, కళ్లనుంచి నీళ్లుకారటం వంటి కంటికి సంబంధించిన సమస్యల్లో ఇది చాలా లాభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజూ ధనియాలతో తయారుచేసిన తాజా కషాయంతో కళ్లను శుభ్రపరచుకుంటుంటే కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. కంటి వాపు ధనియాలు, బార్లీ గింజలను సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి కళ్లపైన పట్టుగా వేసుకుంటే కంటివాపు తగ్గుతుంది. గొంతు నొప్పి ప్రతిరోజూ ఉదయం సాయంకాలాలు 5-10 ధనియాల గింజలను నమిలి రసం మింగుతుంటే గొంతు నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. వేడివల్ల తలనొప్పి రావటం ధనియాలు, ఉసిరికాయలను సమాన భాగాలు తీసుకొని రాత్రంతా చల్లని నీళ్లలో నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బి, రసం పిండి పంచదార కలుపుకొని తాగితే వేడివల్ల వచ్చిన తల నొప్పి తగ్గుతుంది. అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మిశ్రీని (పటిక బెల్లం) చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యత తగ్గుతుంది. దద్దుర్లు ధనియాల కషాయాన్ని తాజాగా తయారుచేసి తీసుకుంటూ బాహ్యంగా కొత్తిమీర రసాన్ని ప్రయోగిస్తే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలు పక్క తడపటం ధనియాలు, దానిమ్మ పూవులు (ఎండినవి), నువ్వులు, తుమ్మబంక (ఎండినది), కలకండ.. వీటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణంచేసి చెంచాడు మోతాదుగా రాత్రిపూట ఇస్తే చిన్నారుల్లో పక్కతడిపే అలవాటు తగ్గుతుంది. కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది కిడ్నీలను ఉత్తేజపరిచి మూత్రాన్ని జారిఅయ్యేలా చేస్తుంది కూడా.

ఉపయోగాలు[మార్చు]

  1. వీటి తాజా ఆకులు చైనీస్ వంటలలో, పలు దక్షిణ ఆసియా ఆహారాలలో ( ముఖ్యంగా చట్నీలు ), మెక్సికన్ వంటలలో ఒక దినుసుగా ఉంటాయి.
  2. మాంసం వంటలలో, సలాడ్లులలో ఈ ఆకులను ఉపయోగిస్తారు
  3. తరిగిన కొత్తిమీర ఆకులు పప్పు కూరలు వంటి వండిన వంటకాల్లో ఒక అలంకరింపుగా ఉపయోగపడతాయి.
  4. భారతీయ, మధ్య ఆసియా వంటకాల్లో, కొత్తిమీర ఆకులను పులుసులలో, ఆకుపచ్చ కూర పేస్ట్ వంటి పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు.
  5. కొత్తిమీర జీర్ణ వ్యవస్థకు ఒక చికిత్సగా పరిగణించబడుతుంది. ఇది గాస్ట్రిక్ స్రావాలకు ఆకలి ఉద్దీపన ఉపయోగపడుతుంది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ధనియాలు&oldid=3566965" నుండి వెలికితీశారు