Jump to content

అంబెల్లిఫెరె

వికీపీడియా నుండి

Carrot family
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Apiaceae (or అంబెల్లిఫెరె)

Type genus
Apium
ప్రజాతులు

including:

For complete list, see List of Apiaceae genera.

అంబెల్లిఫెరె కుటుంబంలో దాదాపు 300 ప్రజాతులు, 3000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉన్నప్పటికి, సమశీతోష్ణ ప్రాంతాలలో విస్తారముగా ఉన్నాయి. భారతదేశంలో 53 ప్రజాతులు, 200 జాతులను గుర్తించారు.

కుటుంబ లక్షణాలు

[మార్చు]
  • ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు.
  • కాండము బోలుగా ఉంటుంది.
  • మొక్క భాగాలలో షైజోజనస్ తైల గ్రంథులు ఉంటాయి.
  • ఏకాంతర, సంయుక్త పత్రాలు, పుచ్ఛ రహితము.
  • తొడుగు వంటి పత్రపీఠము.
  • పుష్ప విన్యాసము సరళ లేదా సంయుక్త గుచ్ఛము.
  • ద్విలింగ పుష్పాలు, పంచభాగయుతము, అండకోశోపరికము, సౌష్టవయుతము.
  • మకరందమును ఉత్పత్తిచేసే స్టైలోపోడియం.
  • ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుత నిమ్న అండాశయము.
  • లోలాకార అండాలు, స్తంభ అండాన్యాసము.
  • ఫలము క్రీమోకార్ప్.

ఆర్ధిక ప్రాముఖ్యత

[మార్చు]
  • కారట్ వేరు దుంపలను కూరగాయలుగా వాడతారు.
  • ధనియాలు, వాము, జీలకర్ర విత్తనాలను సుగంధ ద్రవ్యాలుగా వాడతారు.
  • కోరియాండ్రమ్ మొక్కలను కొత్తిమిరగా వాడతారు.
  • ఫెరులా ఎసఫీటిడ కాండం, వేరు నుండి లభించే రెసిన్ ను ఇంగువగా వాడతారు. దీనిని వంటలలోను, అజీర్తికి, దగ్గుకు మందుగా వాడతారు.
  • బ్రాహ్మి పత్రాలు జ్ఞాపకశక్తిని వృద్ధిపరచడానికి, చలువచేయడానికి ఉపయోగపడతాయి.
  • కొన్ని జాతులను అందం కొరకు తోటలలో పెంచుతారు.

ముఖ్యమైన ప్రజాతులు, మొక్కలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.