సరస్వతీ ఆకు
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సరస్వతీ ఆకు | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. asiatica
|
Binomial name | |
Centella asiatica |
సరస్వతీ ఆకు (Centella asiatica) అంబెల్లిఫెరె కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క. ఇవి చెమ్మ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, నీటివనరులకు దగ్గరలో పెరుగుతాయి. సరస్వతీ ఆకును 'మండూకపర్ణి' యని, సెంటెల్లా (Centella) యని వ్యవహరిస్తారు. 'సంబరేణు' అను వేరొక మొక్క ఇలాంటి కలిగియుంటాయి. దీనిని 'బ్రహ్మీ' యని, బకోపా (Bacopa) యని వ్యవహరిస్తారు.
లక్షణాలు[మార్చు]
- కణుపుల వద్ద అబ్బురపు వేళ్ళున్న సాగిలపడి పెరిగే బహువార్షిక గుల్మము.
- మూత్రపిండాకారంలో గాని, ఇంచుమించు గుండ్రంగా గాని ఉన్న దూరస్థ దంతపుటంచుతో ఉన్న సరళ పత్రాలు. ఇవి పొడవైన కాడలు కలిగివుంటాయి.
- గ్రీవస్థ గుచ్ఛాలలో ఏర్పడిన ఎరుపు రంగుతో కూడిన తెల్లని పుష్పాలు. ఇవి 4-5 ఒకే కాడపై ఉంటాయి.
- గట్లుగాడులు గల క్రీమోకార్ప్ ఫలం.
వైద్యంలో ఉపయోగాలు[మార్చు]
ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు, బ్రాహ్మీఘృతము, సరస్వతారిష్ఠము, బ్రాహ్మరసాయనము, బ్రాహ్మీతైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిన వ్యాధులలో ప్రయోజనకారి. జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. విషయ గ్రహణం, విషయ ధారణ శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది. ఒక కప్పు పాలతో చెంచా సరస్వతీ ఆకుల చూర్ణాన్ని కలిపి రోజూ రెండుపూటలా తాగాలి. సరస్వతీ ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి పొందుతుంది.నిత్యం కొద్దిగా వాముపొడిని, నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.నిత్యం కరివేపాకు ఆకులను లేదా పొడిని కొద్దిగా సేవిస్తూ వుంటే మధుమేహం కలవారికి ఉపయుక్తంగా వుంటుంది. మొక్క సమూలం నీడలో ఎండించి, పాలతో తీసుకుంటే, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. దేశీయ వైద్యంలో ఈ మొక్క పత్రాలను ఉపయోగిస్తారు. వీటిని మజ్జిగలో మూడు రోజులు నానబెట్టి (కొద్దిగా ఉప్పు వేసి) ఎండించి పొడిచేసి టానిక్ లాగా పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా బాలింతలకు ఇస్తే రక్తహీనత అరికట్టి, రక్తం వృద్ధి చెందుతుందని అంటారు. చర్మవ్యాధులకు, నరాల బలహీనతకు కూడా వాడుతారు. గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు, మొక్క పొడి చేసి, తేనెలో కలిపి ఇస్తుంటే, క్రమేపి స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వరం కలుగుతుందని అంటారు.
సరస్వతీ ఆకులను వాడే విధానం[మార్చు]
సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి. అయిదు బాదంపప్పులు, రెండు మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి, తగినంత తేనె కలిపి 40 రోజులపాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ఔషధ మొక్కల సాగు - సావకాశాలు: అటవీ శాఖ, శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మశీ, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2004.