నీడ
Appearance
నీడ లేదా ఛాయ (Shadow) కోసం మనం గొడుగులు వాడతాము. రహదారికి ఇరువైపులా ఎక్కువగా నీడనిచ్చే పెద్ద వృక్షాలను పెంచుతాము. ఇవి వేసవికాలంలో మనల్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.
పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడల నుపయోగించి సమయాన్ని కనుగొనేవారు.
తోలుబొమ్మలాటలో బొమ్మల నీడలను ఉపయోగించి జనరంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో ఉంది.
ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఉదాహరణకు చంద్ర గ్రహణంలో భూమి నీడ చంద్రునిపై పడి చంద్రుడు మనకు కనిపించడు.
ఇవీ చూడండి
[మార్చు]ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |