చోళ సామ్రాజ్యము

వికీపీడియా నుండి
(చోళ సామ్రాజ్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
சோழர் குலம்
చోళ సామ్రాజ్యం
300 క్రీ.పూ. – 1279 Blank.png [[పాండ్యులు|]]
 
Blank.png [[హోయసల|]]

Flag of చోళ సామ్రాజ్యం

Flag

Location of చోళ సామ్రాజ్యం
చోళ సామ్రాజ్యం క్రీ.శ. 1050 లో ఉత్థాన స్థితిలో.
రాజధాని మొదటి చోళులు: పూంపుహార్, ఉరయూర్,
మధ్యయుగ చోళులు: పుజైయారాయి, తంజావూరు
గంగైకొండ చోళపురం
భాష(లు) తమిళం
మతము హిందూ మతము
Government రాజరికం
రాజు
 - 848-871 విజయాలయ చోళుడు
 - 1246-1279 మూడవ రాజేంద్ర చోళుడు
Historical era మధ్య యుగం
 - ఆవిర్భావం 300 క్రీ.పూ.
 - మధ్యయుగ చోళుల ఆవిర్భావం. 848
 - పతనం 1279
జావా లోని ప్రంబానన్ వద్ద గల దేవాలయ సమూహం, ద్రవిడ సంస్కృతిని సూచిస్తుంది.
తంజావూరు - బృహదీశ్వరాలయం లోని రాజరాజ చోళుని విగ్రహం.

చోళ సామ్రాజ్యం (తమిళ భాష:சோழர் குலம்), 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాళ చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుత్తోంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. మొదటి రాజరాజ చోళుడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్|లోని గోదావరి పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళ భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశం మీద విజయ యాత్ర చేసి పాటలీపుత్రంని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్దంకి పాండ్య రాజులు, 13వ శతాబ్ధానికి హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.

రాజరాజ చోళుడు[మార్చు]

రాజరాజ చోళుడు ప్రముఖ చోళరాజులలో ఒకడు. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి అనేక సంస్కరణలు చేశాడు. తంజావూరులో గొప్ప శివాలయాన్ని నిర్మించినది ఇతడే.

ఇవీ చూడండి[మార్చు]

పాద పీఠికలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]

  • Chopra, P.N (2003) [2003]. History of South India ; Ancient, Medieval and Modern. New Delhi: S. Chand & Company Ltd. ISBN 81-219-0153-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • Das, Sisir Kumar (1995) [1995]. History of Indian Literature (1911–1956) : Struggle for Freedom - Triumph and Tragedy. New Delhi: Sahitya Akademi. ISBN 81-7201-798-7.
  • Gupta, A.N. Sarojini Naidu's Select Poems, with an Introduction, Notes, and Bibliography. Prakash Book Depot. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • Harle, J.C (1994). The art and architecture of the Indian Subcontinent. New Haven, Conn: Yale University Press. ISBN 0-300-06217-6.

బయటి లింకులు[మార్చు]

Chola dynasty గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

మూలాలు[మార్చు]