Coordinates: 9°16′57.25″N 79°12′5.91″E / 9.2825694°N 79.2016417°E / 9.2825694; 79.2016417

పంబన్ వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంబన్ బ్రిడ్జి

பாம்பன் பாலம்
పంబన్ రోడ్డు, రైలు వంతెన
Coordinates9°16′57.25″N 79°12′5.91″E / 9.2825694°N 79.2016417°E / 9.2825694; 79.2016417
OS grid reference[1]
Carries2 వరుసల రోడ్డు ట్రాఫిక్
Crossesపాక్ జలసంధి
Localeరామేశ్వరం, తమిళనాడు, భారతదేశం
Official nameఅన్నై ఇందిరా గాంధీ బ్రిడ్జి
Location
పటం

పాంబన్ వంతెన (తమిళం: பாம்பன் பாலம்) భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధి పై ఉంది. ఈ వంతెన పంబన్ ద్వీపం, రామేశ్వరం పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి రోడ్డు, రైలు వంతెన కలిగిఉంది. ఇది 1914 లో ప్రారంభించబడింది.ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్ళు పూర్తైంది.

చరిత్ర[మార్చు]

ఈ రైలు వంతెన 6,776 ft (2,065 m) పొడవు కలిగి ఉంది. దీనిని 1914 లో ప్రారంభించారు.[1] ఈ రైలు మార్గం వంతెన డబుల్-లీఫ్ బేస్కూల్ వంతెన. ఇది ఈ మార్గంలో బ్రిడ్జి కింద నుండి వచ్చే ఓడలకు దారినిచ్చేవిధంగా వెసులుబాటు ఉంది.

చారిత్రాత్మకంగా ఈ రైలు వంతెన మీటర్ గేజ్ రైళ్ళకు నిర్దెశింబడింది. కానీ భారతీయ రైల్వేలు బ్రాడ్ గేజ్ రైళ్ళను దానిపై పోయేవిధంగా 2007 ఆగస్టు 12 న రూపొందించారు. రెండు భాగాలుగా (టూ లీవ్స్) మనుషులు విడదీసే విధంగా రూపకల్పన చేశారు[1]. 10 ఓడలవరకు, కార్గో కేరియర్స్, కోస్ట్ గార్డు షిప్స్, ఫినిషింగ్ వెసల్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఈ బ్రిడ్జి క్రింది నుండి వెళ్ళే విధంగా రూపొందించిన బ్రిడ్జి ఇది. అదే విధంగా రెండు వరుసలు గల రోడ్డు వంతెన ఈ రైలు వంతెనకు సమాంతరంగా ఉంది.

Pamban Bridge
Inaugural Plaque

ఈ రైల్వే వంతెన మీటరు గేజ్ గా రూపొందిన తర్వాత పాంబన్ స్టేషను నుండి మండపం వరకు రైలు మార్గం ఉండి అచట రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక మార్గం సుమారు 6.25 miles (10.06 km)తో రామేశ్వరానికి కలుపబడి ఉంటే, రెండవ మార్గం 15 miles (24 km)తో ధనుష్కోటి వరకు విస్తరించబడి ఉంది. ఈ భాగం 1014 లో ప్రారంభమైంది.[2][3]

1915, 1964 లలో గుర్తించదగిన బోట్ మైల్ మద్రాసు-ఎగ్మూరు నుండి ధనుష్కోటి వరకు జరిగింది. దీనివల్ల సిలీన్ లోని తలైమన్నారు నుండి ప్రయాణీకులు రావటానికి అవకాశం కలిగింది. పాంబన్ జంక్షన్ నుండి ధనుష్కోటి వరకు వచ్చే మీటరు గేజ్ లైన్ "1964 ధనుష్కోటి తుఫాను" మూలంగా నాశనం అయింది..[4]ఈ వంతెన తిరిగి 46 రోజులలో ఇ.శ్రీధరన్ అధ్వర్యంలో పునః ప్రారంభించబడింది.[5]

Rail Bridge from India Mainland to Rameshwaram

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Raja Simhan T.E. (21 November 2013). "Pamban Bridge to be pulled down for gauge conversion". The Hindu. Archived from the original on 7 జూలై 2014. Retrieved 17 January 2014.
  2. Nanji Bapa ni Nondh-pothi published in Gujarati in year 1999 from Vadodara.It is a diary of Railway Contracts done by Mistris of Kutch noted by Nanji Govindji Tank of Jamshedpur, complied by Dharsibhai Jethalal Tank. (This book was given Aank Sidhhi award by Kutch Shakti at Mumbai in year 2000.) Pamban Bridge Contractors: Built by Manji Daya Vegad & Lakhu Devji Vegad of Anjar & Gangji Narayan of Khedoi started works in 1887 for South Indian Railway. Also built Neel-Mandir at Rameshwaram : Page :29
  3. Shree Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory of our fore-fathers :by Raja Pawan Jethwa. (2007). Section II: Mileage wise available Details of Railway lines laid.Pages:63 to 70
  4. "Their sentiment to metre gauge train is unfathomable". Archived from the original on 2007-10-27. Retrieved 2014-08-02.
  5. http://www.forbes.com/global/2009/0511/026-india-delhi-subway-builder.html

ఇతర లింకులు[మార్చు]