పాక్ జలసంధి


భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రానికీ, ద్వీప దేశమైన శ్రీలంక ఉత్తర ప్ర్రాంతంలోని మన్నార్ జిల్లాకూ మధ్యనున్న జలసంధి, పాక్ జలసంధి. ఇది ఈశాన్యంలోని బంగాళాఖాతం లోని పాక్ అఖాతాన్నీ, లక్షద్వీప సముద్రం లోని మన్నార్ అఖాతాన్నీ కలుపుతుంది. ఈ జలసంధి 53 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పున ఉంటుంది. తమిళనాడులోని వైగై నది సహా అనేక నదులు దీని లోకి ప్రవహిస్తాయి. ఈ జలసంధికి రాబర్ట్ పాక్ పేరు పెట్టారు. ఇతను ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో (1755-1763) మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నరుగా ఉండేవాడు.
భౌగోళిక స్థితి
[మార్చు]ఈ జలసంధి, దక్షిణాన రామ సేతు నుండి ఉత్తరాన బంగాళాఖాతం లోని పాక్ అఖాతం వరకు 137 కి.మీ. ల పొడవున ఉంటుంది. రామసేతు అంది చిన్నచిన్న ద్వీపాలతో, వరసగా ఉన్న ఇసుకమేట దిబ్బలతో ఉంటుంది. దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ రామసేతు తమిళనాడులోని పంబన్ ద్వీపం ధనుష్కోడి (రామేశ్వరం ద్వీపం) నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు ఉంది. రామేశ్వరం ద్వీపం పంబన్ వంతెన ద్వారా భారత ప్రధాన భూభాగానికి అనుసంధానించబడి ఉంది.
చరిత్ర
[మార్చు]1914 నుండి, మద్రాసు నుండి ధనుష్కోడికి రెగ్యులర్ రైళ్లు, మన్నార్ ద్వీప తలైమన్నార్ కు ఒక ఫెర్రీ, అక్కడి నుండి కొలంబోకి ఒక రైలు ఉండేది. 1964 తుపాను తరువాత ఇది ఆగిపోయింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu : LAND'S END". web.archive.org. 2004-10-14. Archived from the original on 2004-10-14. Retrieved 2023-02-17.
బయటి లింకులు
[మార్చు]- Photo essay on the Palk Strait. Archived 2018-04-05 at the Wayback Machine
- Palk Bay Blogspot