అంబాజీ
అంబాజీ અરાસુરી અમ્બા ભવાની అరసూర్ | |
---|---|
నగరం | |
దేశం | భారత దేశము |
రాష్ట్రము | గుజరాత్ |
జిల్లా | బనాస్ కాంతా |
జనాభా (2001) | |
• మొత్తం | 13,702 |
భాషలు | |
• అధికార | గూజరాతీ భాష, హిందీ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | |
టెలిపోన్ కోడు | 91-02749 |
వాహనాల నమోదు కోడ్ | GJ-8 |
జాలస్థలి | Ambaji,[1] Gujarat |
Ambaji temple of amba Mata | |
---|---|
![]() image of temple at night | |
పేరు | |
స్థానిక పేరు: | Ambaji |
దేవనాగరి: | अम्बाजी, अरासुरी अम्बा भवानी मंदिर |
తమిళము: | அம்பாஜீ |
బెంగాలీ: | অম্বাজী |
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | Gujarat |
జిల్లా: | Banaskantha |
ప్రదేశం: | Arasur, Banaskantha district |
ఎత్తు: | 61 మీ. (200 అ.) |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | Ambaji Mata (Shakti) |
నిర్మాణ శైలి: | Hindu |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | unknown |
నిర్మాత: | unknown |
దేవాలయ బోర్డు: | Shri Arasuri Ambaji Mata Devasthan Trust (SAAMDT), 1963 |
వెబ్‌సైటు: | http://www.ambajitemple.in/ |
అంబాజీ గుజరాత్ రాష్ట్రంలోని బన స్కంద జిల్లాలో ఉన్న సెన్సస్ టౌన్. అంబాజీ కొన్ని మిలియన్ల భక్తులు వచ్చిపోయే ఆలయప్రాముఖ్యత కలిగిన ఊరు. 51 శక్తిపీఠాలలో అంబాజీ ఒకటి.
ఆలయం ప్రదేశం[మార్చు]
అంబాజీమఠ ఆలయం భారతదేశంలోని శక్తి పీఠాలలో ఒకటి. ఇది పాలాన్‌పూరుకు 65 కిలోమీటర్లదూరంలో ఉంది. మౌంట్అబుకు 45 కిలోమీటర్లదూరంలో ఉంది. అబు రోడ్‌కు 20 కిలోమీటర్లదూరంలో ఉంది. అమీర్‌గఢ్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులలో ఉన్న కడియాద్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన ఆలయమైన అరసూరి అంబాజీ ఆలయంలో విగ్రహం ఉండదు. శ్రీ విస యంత్ర మాత్రమే ఉంటుంది. ఈ యంత్రాన్ని మాత్రమే ప్రధానదేవతగా ఆరాధిస్తారు. ఎవరూ ఈ యంత్రాన్ని నేరుగా చూడలేరు. ఇక్కడ ఛాయా చిత్రాలు తీయడం నిషేధించబడింది. అంబాజీమఠం అసలు పీఠం గబ్బర్ కొండ శిఖరం మీద ఉంది. ప్రతిసంవత్సరం పౌర్ణమి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు దర్శనార్ధం వస్తారు. భదర్వి పూర్ణిమ రోజు పెద్ద మేళా చేస్తారు. ప్రతి సంవత్సరం దేశం నలుమూల నుండి జూలై మాసంలో అనేక మంది భక్తులు తమ స్వంత ప్రదేశాల నుండి ఇక్కడకు పాదయాత్ర చేసి మా అంబీ దర్శనం చేసుకుంటారు. దీపావళి రోజు ఈ ఆలయంలో అధికంగా దీపాలు వెలిగిస్తారు. అంబాజీ ఆలయం నుండి గబ్బర్ కొండ అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధ గబ్బర్ కొండ గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులలో సరస్వతీనదీ తీరంలో ఉంది. అరసూర్ కొండ మీద అడవీ ప్రాంతంలో పురాతనమైన ఆరావళీ పర్వతశ్రేణికి నైరుతిలో 480 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రాముఖ్యత కలిగి పురాణ ప్రాశస్త్యత కలిగిన ఈ శక్తి పీఠం 8.11 చదరపు కిలో మీటర్లు విస్తరించి ఉంది. సతీదేవి దేహంలోని హృదయం ఈ గబ్బర్ కొండ మీద ఇక్కడ పడినది అని విశ్వసీస్తున్నారు.
చరిత్ర[మార్చు]
అంబాజీ భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. వీటిలో 12 ప్రాధాన శక్తి పీఠాలు శక్తి ఆరాధన కొరకు భక్తులు క్షేత్రాట చేస్తుంటారు. అవి వరుసగా ఉజ్జయినీలో ఉన్న మా భగవతీ మహాకాళీ మహాశక్తి , కాంచీపురంలోని మాతా కామాక్షీ, శ్రీశైలంలో ఉన్న మాతా భ్రమరాంబ, కన్యాకుమారిలో ఉన్న శ్రీ కన్యాకుమారి, గుజరాత్లో ఉన్న మాతా అంబాజీ, కోల్హాపురిలో ఉన్న మాతా మహా లక్ష్మీ , ప్రయాగలో ఉన్న దేవీ లలిత , వింద్యపర్వతాలలో ఉన్న వింద్యవాసిని, వారణాసిలో ఉన్న విశాలాక్షి, గయలో ఉన్న మంగళావతి, బెంగాలులో ఉన్న సుందరి, నేపాలులో ఉన్న గుహ్యేశ్వరి. ఈ ఆలయంలోని అద్భుతం ఆలయంలో దేవీ విగ్రహం లేక పోవడమే కాని చిన్న గుహ కుడ్యం మీద ఒక స్వర్ణ పత్రం మీద బీజాక్షరాలతో లిఖించిన పవిత్ర దేవీ విస శ్రీ యంత్రం కూర్మరూపంలో ఉంటుంది. ఉజ్జయినిలోని పీఠం, నేపాల లోని పీఠాన్ని పోలి ఉన్నా అక్కడ పీఠం కంటితో చూడవచ్చు కాని ఇప్పటి వరకు ఛాయా చిత్రం తీయబడ లేదు భవిష్యత్తులో కూడా తీయడానికి అనుమతి ఉండక పోవచ్చు. విస శ్రీ యంత్ర ఆరాధన కళ్ళ్కు గుడ్డ కట్టుకున్న తరువాత మాత్రమే చేయబడుతుంది. గబ్బర్ కొండ శిఖరం మీద ఉన్న ఆలయానికి 999 మెట్లు ఎక్కి చేరుకోవాలి. ఈ ఆలయంలోవిస శ్రీ యంత్రం ముందు ఒక దీపశిఖ మాత్రమే నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా చూడతగిన ప్రదేశాలు సూర్యాస్థమయం, గుహలు, మాతాజీ ఉయ్యాల. పర్యాటకులు రోప్ వేలో కూడా కొండకు చేరుకో వచ్చు.
జనసంఖ్య[మార్చు]
2001 దేశీయ జనాభాగణనను అనుసరించి అంబాజీ జనసంఖ్య 13,702. వీరిలో పురుషుల సంఖ్య 53%, స్త్రీల సంఖ్య 47%. అక్షరాస్యత 66%, స్త్రీల అక్షరాస్యత ఇది దేశీయ అక్షరాస్యత 59.5% కంటే అధికం. పురుషుల అక్షరాస్యత 60%, స్త్రీల అక్షరాస్యత 40%. 6 సంవత్సరాలకు లోపున్న పిల్లల సంఖ్య 14%. అంబాజీ ఉత్తమమైన మార్బుల్, గ్రానైట్ రాళ్ళ ఉత్పత్తి జరుగుతుంది.
సమీపంలోని ప్రదేశాలు[మార్చు]
కామాక్షీ ఆలయం[మార్చు]
అంబాజీ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఖేద్‌బ్రహ్మ రహదారి పక్కన ప్రఖ్యాత కుంభారియా జైన ఆలయం ఉంది. అక్కడ అధునాతన కామాక్షీ అమ్మవారి ఆలయ సమాహారం ఉంది. ఇక్కడ 51 శక్తి పీఠాల నమూనాలు ఉన్నాయి. పర్యాటకులము శక్తిపీఠాల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ లభ్యం ఔతాయి. శక్తి సంప్రదాయము ఆదిశక్తి మహిమను ఈ ఆలయ సమాహారం తెలుపుతుంది.
కైలాష్ కొండ సూర్యాస్థమయం[మార్చు]
విహార, పుణ్య క్షేత్రం. ఇది అంబాజీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కైలాష్ కొండ మీద సుందరమైన శివాలయం ఉంది. అక్కడకు కాలినడకన మెట్లదారిలో వెళ్ళి చేరుకోవాలి. కైలాష్ కొండ యాత్ర పర్యాటకులకు అహ్లాదాన్ని కలిగిస్తుంది. కైలాష్ టెకారిలో సూర్యాస్తమయ్ దృశ్యంతో పాటు ఆలయ నిర్వాహకులచేత నిర్మించబడిన మహాదేవ్ ఆలయ ముందరి భాగాన ఉన్న బృహత్తర రాతి ద్వారం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం అరసూరి అంబాజీ దేవస్థాన ట్రస్ట్ చేత నిర్వహించబడుతుంది.
మాన్ సరోవర్[మార్చు]
ప్రధాన ఆలయానికి వెనుక భాగాన మానసరోవర్ ఉంది. ఇది అహ్మదాబాద్ వాసి అయిన నాగర్ భక్తుడైన తపిశంకర్ అంబాజీ మాత కొరకు 1584 -1594ల మధ్య నిర్మించాడు. ఈ పవిత్ర సరస్సుకు ఇరువైపులా రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకటి మహాదేవ్ ఆలయం మరియొకటి అజయ్‌దేవీ ఆలయం. అజయ్ దేవిని మాతా అంబాజీ యొక్క సహోదరిగా భావిస్తారు. భక్తులు ఈ సరోవరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ సరస్సు ప్రాకార కుడ్యాల మీద రాజా మాల్‌దేవ్ యొక్క శిలాక్షరాలు లిఖించిన శలాశాసనం ఉంది. ఈ శిలాశాసనం అంబాజీ మాత చరిత్రను గురించిన వివరాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. అజయ్ దేవీ ఆలయ కుడ్యాల మీద ఉన్న శిలాశాసనంలో హిందూ క్యాలండర్‌ను అనుసరించిన సమవత్ సంవత్సరం 1445 అని వ్రాయబడి ఉంది. ఆలయ నిద్వాహక మండలి పవిత్ర మానసరోవర్ అక్కడి ఆలయాలు దాని పరిసరాల పునరుద్ధరణ ప్రణాళికను చేపట్టింది.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- హిందూ పవిత్రమైన నగరాలు
- శక్తి పీఠాలు
- దేవాలయాలు