కన్నూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కన్నూరు జిల్లా (కేరళ) వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కన్నూరు జిల్లా ఒకటి.

భౌగోళికం[మార్చు]

కున్నురు అనే పేరు వెనుక పలుపౌరాణక కథనాలు, రహస్యాలు దాగున్నాయి. భవంతుడైన కణ్ణన్, కృష్ణన్ పదాలకు ఊరు చేర్చితే కన్నూరు అయిందని (కృష్ణుడి ఊరు అని అర్ధం) అయిందని భావిస్తున్నారు. ఈ కథనాలకు బలంచేకూరుస్తూ ప్రస్తుత కన్నూరు పట్టణానికి ఈశాన్యంలో ఉన్న కడలాయ్ కోట్ట వద్ద ఉన్న ఆలయంలో ప్రధానదైవంగా శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించబడి ఉన్నాడు. బ్రిటిష్, పోర్చుగీసు పాలనాకాలంలో నగరం కన్నననోర్ అని పిలువబడింది. మరొక కథనం కన్నోర్ అరబిక్ పదం అని భావిస్తున్నారు. " క్వానన్ ఆల్ నూర్ " (ఖురాన్ వెలుగులో పాలించబడుతున్న ప్రాంతం) అనే అరబిక్ పదాలు దీనికి మూలం అని భావిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని ఒకేఒక సుల్తానేటుకు అయిన అరక్కల్ సుల్తానేటుకు ఇది రాజధాని అని భావిస్తున్నారు.

చరిత్ర[మార్చు]

జిల్లాప్రాంతంలో మొదటి మానవనివాసాలకు సాక్షిగా రాతితో మలచిన గుహలు, నియోలిథిక్ కాలానికి చెందిన మెగాలిథిక్ బ్యూరియల్ ప్రదేశాలు ఉన్నాయి. ది తాలిపరంబ - కన్నూర్ - తలస్సేరి ప్రాంతాలలో విస్తారంగా రాతితో మలచిన గుహలు, డోల్మెంస్, బ్యూరియల్ స్టోన్ సర్కిల్స్, మెంహిర్లు అన్నీ మెగాలిథిక్ బ్యూరియల్ స్థితిలో ఉన్నాయి. జిల్లా చేరరాజ్యంలో భాగంగా ఉంది. సా.శ. ఆరంభకాంలో కేరళను పలు శతాబ్ధాలకాలం పాలంచారు. తరువాత కన్నూరు కన్నూరు కొలత్తిరి రాజాలకు రాజధానిగా ఉంది. రాజ్యమంతా అరేనియా, పర్షియాతో 12- 13 శతాబ్ధాలలో వ్యాపారసంబంధాలు కలిగి ఉన్నాయి. మార్కోపోలో తన యాత్రా పుస్తకంలో 1290లో ఈ ప్రాంతం సందర్శించినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఇతర యాత్రీకులలో బుద్ధ యాత్రికుడు పాహియన్ తాంగుయర్ రచయిత, చరిత్రకారుడు, బటుటా ముఖ్యులు.

కన్నూరు సముద్రతీరం వెంట సోల్మన్ నౌకలు భగవంతుని ఆలయనిర్మాణానికి అవసరమైన కొయ్యను సేకరించడానికి లంగర్ వేసి నిలుపబడ్డాయని భావిస్తున్నారు. గ్రీక్ పుస్తకం " పెరిప్లస్ అఫ్ ది ఎరిత్రియన్ సీ "లో కన్నురును నౌరా అని పేర్కొన్నారు.

సాహసికయాత్రికుడు[మార్చు]

పోచుగీస్ సాహసయాత్రికుడు వాస్కోడిగామా 1498లో కాన్నురును సందర్శించాడు. తరువాత కొంతకాలానికి పోర్చుగీసు కాలనీ ఏర్పాటు చేసాడు. పోర్చుగీసు వారికి నాయకత్వం వహించిన ఫ్రాంసిస్కో డీ ఆల్మెడా (మొదటి భారతదేశ వైశ్రాయి) సెయింట్ ఆంగిలో కోటను నిర్మించాడు. 1663లో ఈ కోటను డచ్ ఆక్రమించింది. 1772లో వారీ కోటను అరక్కల్‌కు (కన్నూరు రాజు) విక్రయించారు. 1790లో ఈ కోటను బ్రిటిష్ ఆక్రమించింది. ప్రస్తుతం కోట పురాతత్వ పరిశోధనాశాఖ పర్యవేక్షణలో ఉంది. 18వ శతాబ్ధపు చివరి అర్ధభాగంలో మైసూరు పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో యుద్ధం చేసి జిల్లాలోని అధిక భాగాన్ని ఆక్రమించారు. 1792లో మూడవ ఆంగ్లో - మైసూర్ - యుద్ధం తరువాత జరిగిన ఒప్పందంలో కన్నూరు, పరిసరప్రాంతాల మీద ఆధిపత్యం సాధించింది. తరువాత దీనిని బ్రిటిష్ మద్రాసు ప్రెసిడెంసీలో మలబార్ జిల్లాగా రూపొందించారు.

2.2 బ్రిటిష్ వ్యతిరేకత భారతదేశంలో బ్రిటిష్ పాలనను దీర్ఘకాలంగా తీవ్రంగా ఎదుర్కొన్న వారిలో కన్నూరు జిల్లా వాసులు ఒకరు. ఈ తిరుగుబాటుకు 1792 - 1806లో పళసిరాజా నాయకత్వం వహించాడు. జిల్లాలోని అత్యధిక భాగం యుద్ధంలో పాల్గొన్నది.

Veera Kerala Varma Pazhassi Raja- Painting by Raja Ravi Varma

స్వతంత్ర సమరం[మార్చు]

కన్నూర్ జిల్లా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది. 1885 లో భారత జాతీయ కాంగ్రెస్స్థాపించబడింది. 1908 లో మలబార్ జిల్లా]] కమిటీ ఏర్పాటు చేయబడింది. డాక్టర్ అనిబిసెంట్ స్థాపించిన "ఆల్నిండియా హోం రూల్ లీగ్ " శాఖ క్రియాశీలక కార్యకర్తలతో మధ్య తలాసేరీ పనిచేసేది . ఇందులో వికె ఉంది కృష్ణ మీనన్ క్రియాశీలక పాత్ర వహించాడు. 1939 చివరి నాటికి పింరాయి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖ తలాసేరీ సమీపంలో ఒక గ్రామం వద్ద స్థాపించబడింది. అహింసా విధానంలో స్వాతంత్ర్యోద్యం సాగించాలని నాగ్పూర్ కాంగ్రెస్ నిర్ణయం చేసింది. దీనిని అనుసరించి సహాయనిరాకరణ, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యం కొనసాగింది. మహాత్మా గాంధీ, మలానా షౌకత్ అలి సహాయనిరాకరణ, ఖాలీఫత్ ఉద్యమ ప్రచారం కొరకు జిల్లాలో పర్యటించారు. 1921లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిములు ఖాలీఫత్ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిములు తలెత్తారనడానికి నిదర్శనంగా ఉంది.

సహాయనిరాకరణ ఉద్యమం[మార్చు]

భారతస్వాతంత్ర్య సమరంలో ముఖ్య మలుపుగా మారిన ఉప్పు సత్యాగ్రహానికి (1930 ఏప్రిల్ 13) పయ్యనూర్ ప్రధాన కేంద్రంగా ఉంది. కె.కేలప్పన్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు కోళికోడు నుండి పాదయాత్రతో ఆరంభించి ఏప్రిల్ 21న పయనూరుకు చేరుకుని ఉప్పుచట్టాన్ని అధిగమిస్తూ ఉప్పుతతారీ చేపట్టారు. పయ్యానూరు సత్యాగ్రహ శిబిరం మీద బ్రిటిష్ ప్రభుత్వం దాడిచేసి సత్యాగ్రహుల మీద లాఠీచార్జి చేసారు. ఉలియత్ కాదవ్ పయ్యనూరు సంఘటన కేరళ స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రధాన మలుపు తిప్పింది. ప్రజలకు ఇది ప్రేరణ కలిగించి వేలాది ప్రజలను స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షించింది. జిల్లాలోని కన్నూరు, తలస్సేరి, ఇతర భాగాలలో పలు ఉపన్యాసాలు జరిగాయి. పలు కాంగ్రెస్ సభ్యులు ఖైదుచేయబడ్డారు. తరువాత స్వాతంత్ర్యోద్యమం పౌర అవిధేయత ఉద్యమం నుండి అతివాద కాంగ్రెస్ శఖ రూపుదాల్చడానికి దారి తీసింది. 1934లో కేరళ రాష్ట్రంలో అతివాద కాంగ్రెస్ ఆరంభమై ప్రత్యేక పార్టీగా పనిచేయడం మొదలైంది. అతివాద కాంగ్రెస్‌కు పి కృష్ణ పిళ్ళై, ఎ.కె. గోపాలన్, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్. కదచిరా (కన్నూర్), సోషలిస్టు నాయకుడు కె.వి.కుంహిక్కన్నన్ నాయర్ ప్రాధాన్యత వహించారు. మొహమ్మద్ అబ్దూర్ రహీమన్ కాంగ్రెస్‌లో ముస్లిం అతివాద బృందం జాతీయవాదం కూడా తలెత్తింది. కె.కేలప్పన్, సి.కె గోవిందన్ నాయర్, కె.ఎ. దామోదరన్ నాయకత్వంలో కాంగ్రెస్ సోషలిస్టులు నేషనలిస్ట్ ముస్లిములు రైట్‌వింగ్ పేరుతో గాంధీకి వ్యతిరేకంగా కామన్ కాజ్ రూపొందించారు.

ముస్లిం లీగ్[మార్చు]

1930లో మలబార్ రాజకీయాలలో గుర్తించతగిన విధంగా " ఆల్ ఇండియా ముస్లిం లీగ్ " రాజకీయ పార్టీగా అభివృద్ధి చెందింది. పార్టీ స్థాపనకొరకు తలస్సేరి, కన్నూరు ముస్లిం నాయకులు ప్రత్యేక కృషిచేసారు. 1930లో కేరళరాష్ట్రంలో వామపక్ష కాంగ్రెస్ క్రియాశీలకంగా పనిచేసింది. వారు తమ కార్యవర్గంలో రైతులు, శ్రామికులు, విద్యార్థులు, కన్నూరు ఉపాధ్యాయులను కలుపుకుని క్రియాశీలకంగా పనిచేసారు. 1938లో కేరళ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. తరువాత కన్నూరు జిల్లాలో రైటిస్టులు కొంత వెనుకంజ వేసారు. " అబ్దూర్ ర్హిమాన్ సాహెబ్ " [2] కె.పి.సి.సి అధ్యక్షునిగా ఎన్నుకొనబడ్డాడు.

నంబూద్రి జనరల్ సెక్రెటరీగా ఎన్నుకొనబడ్డాడు. అదే సంవత్సరం చివరికి మలబార్‌లో " ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ " స్థాపించబడింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలో విలీనం అయ్యారు.

పయ్యనూర్ సమావేశం[మార్చు]

కన్నూరు జిల్లా 1928 మే 4న కేరళ రాజకీయాలలో వెలుగులోకి వచ్చింది. 1928 మే 4న కేరళలోని ప్రొవినికల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పయ్యనూరులో సకల రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. పయ్యనూరు సమావేశం జాతీయ కాంగ్రెస్‌ను స్వరాజ్యం స్థానంలో పూర్తిస్వాతంత్ర్య సాధన వైపు దృష్టి మరల్చాలని కోరింది. తరువాత స్వతంత్రం లక్ష్యంగా కొలకత్తాలో వార్షిక సమావేశం నిర్వహించబడింది.

మొర్జా సంఘటన[మార్చు]

1940 సెప్టెంబరు 15 న కె.పి.సి.సి. ఉత్తర మలబార్ ప్రజలకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఇచ్చిన పిలుపును జాతీయ కాంగ్రెస్ నిరాకరించింది. అయినప్పటికీ ఈ విషయం మీద మలబార్ ప్రాంతం అంత వాదవివాదాలు చెలరేగాయి. ఈ ఉద్యమానికి కన్నురు జిల్లా కేంద్రబిందువుగా మారింది. జిల్లాలో పలుప్రాంతాలలో పోలీస్, ప్రజల మద్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. పోలీసు ప్రజలను అదుపులోకి తీసుకురావడానికి ప్రజల మీద లాఠీప్రయోగం, కొన్ని చోట్ల తుపాకి షూటింగ్ జరిపింది. మోరాఝా వద్ద ఉద్యమకారుల చేతిలో మద్య ఇద్దరు యువకులు (సబ్ ఇంస్పెక్టర్ కె.ఎం.కుట్టి కృష్ణా, కానిస్టేబులు రహమాన్) మరణించారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కె.పి.ఆర్ గోపాలన్‌కు హత్యానేరం కింద ఖైదు మరణశిక్ష విధించబడింది. మహాత్మాగాంధీ మొదలైన ప్రముఖ జాతీయనాయకుల జోక్యంతో మరణశిక్ష రద్దు చేయబడింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం కన్నూరులో తన ప్రభావం చూపింది. ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి చెందున సోషలిస్టు నాయకుడు కె.బి. మేనన్ నాయకత్వం వహించాడు.

ఉప్పు సత్యాగ్రహం[మార్చు]

మలబార్‌లో ఉప్పుసత్యాగ్రహానికి పయ్యనూర్ ప్రధానకేంద్రంగా మారింది. ఏప్రల్ 13 న కాంగ్రెస్ బృందాలు కె.కేలప్పన్ నాయకత్వంలో కోళికోడ్ నుండి పాదయాత్ర ప్రారంభించి 21 నాటికి పయ్యానూరు చేరుకుని ఉప్పా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉప్పుతయారీ చేపట్టారు. పయ్యనూరు సత్యాగ్రహ ఉద్యమకారుల మీద పోలీసులు దాడి చేసి ఉద్యమకారులమీద లాఠీప్రయోగించారు. కన్నూరు జిల్లా అంతటా ఉద్యమస్ఫూర్తి వ్యాపించింది. తలస్సేరి, ఇతర ప్రదేశాలలో కాగ్రెస్ కార్యకర్తలు ఉప్పు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పుతయారీ ఉద్యమం, విదేశీ వద్తు భహిష్కరణ, లిక్కర్ షాపులను మూయించడం వంటి చర్యలు చేపట్టారు.

అతివాదం[మార్చు]

సహాయనిరాకరణోద్యమం అనుసరించి కేరళ కాంగ్రెస్‌లో అతివాద కాంగ్రెస్ విభాగం ఏర్పడింది. 1934లో కేరళా ప్రొవింషియల్ కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ సోషలిస్ట్ విభాగం ఆరంభమై ప్రత్యేక పార్టీగా పనిచేయడం మొదలైంది. పార్టీ నాయకత్వం పి.కృష్ణ పిళ్ళై, ఎ,కె. గోపాలన్, ఇ.ఎం.ఎస్ నంబూద్రి నాయకత్వం వహించారు. ఈ సమయంలోనే మొహమ్మద్ అబ్దూర్ నాయకత్వంలో కాంగ్రెస్ నుండి సోషలిస్ట్, నేషనలిస్టు ముస్లిములు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. కె.కేలప్పన్, సి.కె. గోవిందన్ నాయర్, కె.ఎ. దామోదర మేనన్ నాయకత్వంలో కాంగ్రెస్ గాంధేయ కాంగ్రెస్ (మితవాద కాంగ్రెస్) కు వ్యతిరేకంగా కామన్ కాజ్ తీర్మానం చేసారు. 30లలో మలబార్ రాజకీయాలలో గుర్తించతగిన మార్పుగా రాష్ట్రీయ ముస్లిమ్లీగ్ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పాటుకు తలస్సేరి, కన్నూరు ముస్కిములు ప్రధానపాత్ర వహించారు.

వామపక్షాలు[మార్చు]

ముప్పై చివరిదశలో కేరళ ప్రొవింషియల్ కాంగ్రెస్ వామపక్ష బృందాలు మలబారు రాజకీయాలలో ప్రధాన పాత్రపోషించాయి. కన్నూరు జిల్లాలో రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యవర్గ సభ్యులుగా పనిచేసారు. 1939 జనవరిలో కేరళ ప్రొవింషియల్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. రైటిస్ట్ పక్షాలు కొంత వెనుకడుగు వేసారు. మొహమ్మద్ అబ్దూర్ రహిమన్ కె.పి.సి.సి. అధ్యక్షుడుగా నంబూద్రిపాద్ జంరల్ సెల్రటరీగ ఎన్నిక చేయబడ్డాడు. అదే సంవత్సరం మలబారులో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా స్థాపించబడింది. కాంగ్రెస్ షోషలిస్ట్ పార్టీ సభ్యులు కమ్యూనిస్ట్ పాటీలో విలీనం అయ్యారు.

వ్యవసాయదారుల సమస్య[మార్చు]

1943 - 1945 మద్య జిల్లా కరువురక్కసి కోరలలో చిక్కుకుంది. కరువు, కలరా జిల్లాలోని బడుగువర్గానికి చెందిన వేలాది ప్రజలను బలితీసుకుంది. కిసాన్ సభ నాయకత్వంలో కరువుబారి నుండి ప్రజలను రక్షించడానికి స్వయంసేవకులు గుర్తించతగినంత సేవలు అందించారు. గ్రోమోర్ ఫుడ్ కార్పొరేషన్ మంగత్తుపరంబా వద్ద నిర్వహించిన కిసాన్ సభ ప్రజాఉద్యమంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రభుత్వ భూములలో 50 ఎకరాలకంటే అధికంగా వ్యవసాయయోగ్యం చేయబడ్డాయి. ప్రభుత్వం మాత్రం తోటలను ధ్వంసం చేసి ఉద్యమన్ని అణిచివేసింది.

క్షామం[మార్చు]

1945 నాటికి యుద్ధం ముగింపుకు వచ్చింది. అయినప్పటికీ కరువు మాత్రం ప్రజలను బాధించడం కొనసాగించింది. కరివెల్లోర్, పూమరం (తిల్లెనకేరి) గ్రామాలు పేదరికం, కరువుతో పోరాటానికి అడుగులు ముందుకు వేసాయి. కరివెల్లోర్ నుండి చిరక్కల్‌కు తరలించబశుతున్న వడ్లను అడ్డగించి గ్రామంలోని ప్రజలకు పంచిపెట్టారు. ఈ ఉద్యమానికి రౌతునాయకులు ఎ.వి.కుంహంబు, కృష్ణన్ మాస్టర్ నాయకత్వం వహించారు. కన్నన్, కుంహంబు పోలీసుల కాల్పులలో అసువులు కోల్పోయారు.1946 డిసెంబరు మాసంలో కవుంబయి పునం (ప్రజలు పైరు చేయడం ) ఉద్యమించారు. ఉద్యమాన్ని అణిచువేయడానికి పెద్ద ఎత్తున పోలీస్ పంపబడింది. ప్రజలు పోలీసు బలగాలను ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలలో 5 గురు ప్రాణాలను కోల్పోయారు.

శ్రామికులు[మార్చు]

పారిశ్రామిక రంగంలో శ్రామిక వర్గాలు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేవారిలో ప్రాధాన్యత వహించారు. అరన్ మిల్ శ్రామికులు 1946లో నిర్వగించిన ఉద్యమమం ఇదుకు నిదర్శనం. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా రాష్ట్రంలో రైతులు సాగించిన ఉద్యమాలు రాజకీయంగా పెనుమార్పులకు కారణం అయ్యాయి.రైతుకూలీలు భూస్వాములకు వ్యతిరేకంగా సాగించిన యుద్ధ్హలలో తిల్లంకేరి, మనయంకున్ను, కొరం, పడ్డికున్ను స్వాతంత్ర్యం తరువాత రైతులు సాగించిన ఉద్యమాలలో ప్రధానంగా గుర్తించబడ్డాయి. కన్నూరు వద్ద 1953లో " ఆల్ ఇండియా కాంఫరెంస్ ఆఫ్ కిసాన్ సభ " రాష్ట్రంలో సరికొత్త అసెంబ్లీ రూపకల్పనకు దారితీసింది. రాష్ట్రంలోని సకలవర్గాల ప్రజలను ఆకర్షించిన " ఐఖ్య కేరళ " ఉద్యమం కూడా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించింది.

పాలనావిధానాలు[మార్చు]

ఒకప్పుడు కన్నూరు కమ్యూనిస్టు ఉద్యమం కేరళ రాష్ట్రానికే ఆలోచనాఖజానాగా ఉండేది. కన్నూరు ప్రముఖ కమ్యూనిస్టు లీడర్ ఎ.కె.గోపాలన్, అళికొడన్ రాఘవన్, ఎ.కె.నాయగన్, గత ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ కన్నూరు జిల్లా నుండి వచ్చినవారే.

జిల్లా కమ్యూనిస్ట్ పార్టీలకు గట్టిపునాదిగా నిలిచింది. భారతీయ మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ - లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ - 5-6 పురపాలకాల పాలన నిర్వహిస్తుంది. అలాగే 70% పంచాయితీల పలన ఎల్.డి.ఎఫ్ చేతిలో ఉంది. అయినప్పటికీ అసెంబ్లీ స్థానం, పార్లమెంటు స్థానం మాత్రం ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ గెలుచుకుంది.జిల్లాలోని తలస్సేరి తాలూకాలోని పనూరు, కత్తుపరంబ, మట్టనూరు ప్రాంతాలు భారతీయ మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ బి.జె.పికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్య తీవ్రఘర్షణలు చెలరేగుతుంటాయి.2008లో ఘర్షణలు 7 మంది ప్రజల మరణాలకు దారితీసాయి. హైకోర్ట్ ఈ ప్రాంతంలో శాశ్వతంగా కేంద్ర రిజర్వ్ బలగాలను నియమించాలని ఆదేశించింది.[1]

భౌగోళికం, వాతావరణం[మార్చు]

భౌగోళికం[మార్చు]

జిల్లా 11° 40' నుండి 12° 48' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74° 52' నుండి 76° 07' డిగ్రీల తూర్పు రేఖాంశం మద్య ఉంది. జిల్లా వైశాల్యం 2,996 చ.కి.మీ. కన్నురు జిల్లా భౌగోళికంగా ఎగువభూమి, మద్యభూమి, దిగువభూమిగా విభజించబడి పశ్చిమకనుమలలో భగంగా ఉంది. ఎగువభూమి, దిగువభూమి మద్యలో మద్యభూమి అసమానంగా కొండలు, లోయలతో ఉంది. పశ్చిమకనుమలలోని ఎగువభూమి వర్షారణ్యాలు, కాఫీ టీ తోటలు, యాలుకలు మొదలైన వివిధ సుగంధద్రవ్యాలు ఉన్నాయి. సన్నని సముద్రతీర దిగువభూములలో నదులు, నదీ మైదానాలు ఉన్నాయి. కన్నురులో 6 నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో 110 కి.మీ పొడవైన వల్లపట్టణం నది జిల్లాలోని అతి పొడవైనదిగా భావిస్తున్నారు. జిల్లాలో ప్రవహిస్తున్న ఇతర నదులలో కుప్పం, మాహే, అంజరకండి, తలస్సేరి, రామాపురం, పెరింబా నదులు ఉన్నాయి. జిల్లాలోని పెరవూరు సమీపంలోని ఎలప్పీడిక ఎత్తైన ప్రాంతం (2500-3200)గా గుర్తించబడుతుంది.

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం
వేసవి మార్చి- మే
వర్షాకాలం జూన్- సెప్టెంబరు (నైఋతీ ఋతుపవనాలు)
కాలాంతర వర్షాలు అక్టోబరు - నవంబరు (ఈశాన్య ఋతుపవనాలు)
శీతాకాలం
గరిష్ఠ ఉష్ణోగ్రత 35 ° సెల్షియస్ (ఏప్రిల్ - మే)
కనిష్ఠ ఉష్ణోగ్రత 20 ° సెల్షియస్ డిసెంబరు- జనవరి రాత్రి (16 డిగ్రీలు)
వర్షపాతం 3438 మి.మీ (వర్షపాతం 80% (నైౠతీ ౠతుపవనాలు))
అత్యధిక వర్షపాతం జూలై (68%)

సముద్రతీరాలు[మార్చు]

కన్నూరులో పలు సముద్రతీరాలు ఉన్నాయి.

Payyambalam Beach

పయ్యంబలం సముద్రతీరం[మార్చు]

కన్నూరు పట్టణంలో ఉన్న సముద్రతీరాన్ని పయ్యనూర్ సముద్రతీరం అంటారు. ఇక్కడ కొన్ని కిలోమీటర్ల దూరం అంతరాయరహిత సముద్రతీరం ఉంది. సముద్రతీరం నుండి మలబార్ తీరంలో కోళికోడు నుండి మంగుళూరు, గోవా, ముంబయి ప్రయాణిస్తున్న నౌకలు కనిపిస్తుంటాయి. ప్రకృతిసహజమైన సౌందర్యం, చక్కగా తీర్చిదిద్దబడిన పూదోటలు సముద్రతీరాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ప్రముఖ శిల్పకారుడు కనాయి కుంహీరాం తల్లీబిడ్డల శిల్పం దృశ్యాన్ని మరింత మనోహరంగా చేస్తుంది.

బేబీ బీచ్[మార్చు]

పయ్యంబలం సముద్రతీరం, సెయింట్ ఆంగ్లో ఫోర్ట్ మద్య ఉన్న చిన్న సముద్రతీరం కనుక దీనిని బేబీ బీచ్ అంటారు.

మీన్‌కున్ను సముద్రతీరం[మార్చు]

మీన్‌కున్ను సముద్రతీరం అళికోడే వద్ద ఉంది. ఇది పట్టణం నుండి కొంతదూరంలో ఉంది.

మాపిల సముద్రతీరం[మార్చు]

మాపిల సముద్రతీరం సెయింట్ ఫోర్ట్‌కు సమీపంలో ఉంది. మాపిల సముద్రతీరానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇది కొలాథిరి రాజులకు రాజధానిగా ఉంది. ఇక్కడ ఉన్న కడలాయి కోట, శ్రీక్రుష్ణాలయం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కోట శిథిలాలు, ఆలయం మాపిల సముద్రతీరం నుండి ఇప్పటికీ కనిపిస్తుంటాయి. మాపిల సముద్రతీరం వద్ద ఇండో నార్వేజియన్ కొలాబరేధన్‌తో ఫిషింగ్ హార్బర్ నిర్మించబడి ఉంది.

కీళున్న ఎళరా సముద్రతీరం[మార్చు]

కేరళ రాష్ట్రంలోని ఏకాంత సముద్రతీరాలలో కీళున్న ఎళరా సముద్రతీరం ఒకటి. ఇది కన్నూరు నుండి 11 కి.మీ దూరంలో ఉంది.

ముళప్పిలంగాడ్ డైవ్- ఇన్ - బీచ్[మార్చు]

కేరళరాష్ట్రంలోని ఒకేఒక డ్రైవ్ ఇన్ బీచ్‌గా ముళప్పిలంగాడ్ డైవ్- ఇన్ - బీచ్ గుర్తింపు ఉంది. ఇది తలస్సేరికి 5కి.మీ దూరం, కన్నూరు నుండి 15 కి.మీ దూరంలో వెడల్పైన వంపు తిరిగి సౌందర్యవంతంగా ఉంది. సముద్రతీరంలో సహజసిద్ధంగా పెరిగిన కొబ్బరి చెట్ల మద్య పాదచార మార్గరహిత రహదారి మార్గం ఉంది. ఇక్కడ నుండి 200 మీ దూరంలో ఉన్న గ్రీన్ ఐలాండ్ దృశ్యం సముద్రతీరానికి మరింద అందం చేకూరుస్తుంది.

ధర్మాడం ద్వీపం[మార్చు]

ధర్మాడం ద్వీపం ధర్మాడం నుండి 100 మీ దూరంలో ఉంది. దీవి వైశాల్యం 20,000 ఎకరాలు. ద్వీపం అంతటా కొబ్బరి చెట్లు, దట్టమైన పొదలతో ముళప్పిలాండ్ బీచ్ నుండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆటు పోటుల మద్య మనుషులు నడకద్వారా ద్వీపాన్ని చేరుకోవచ్చు. ఇందులో నదీప్రవాహాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న ఈ ద్వీపంలో ప్రవేశించడానికి అనుమతి అవసరం. ధర్మాడం మునుపు ధర్మపట్టణం అనిపిలువబడేది. ఇది ఒకప్పుడు బౌద్ధమత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం.

కన్నౌర్ పట్టణం, కన్నౌర్ నగరం[మార్చు]

కున్నూరు పట్టణం మునుపు కన్నీర్ అని పిలివబడేది. ఇది కన్నురు జిల్లాకు నిర్వాహక కేంద్రంగా ఉంది. కన్నురు సిటీ కన్నురు పట్టణంలో భాగంగా ఉంది. పురాతన కాలంలో ఇది నకర కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఇది నివాసిత ప్రాంతంగా ఉంది.

ఆర్ధికం[మార్చు]

జిల్లాలో ప్రజలు జీవనోపాధికి అధికంగా ఆర్థికంగా వ్యవసాయం, తత్సంబంధిత వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, కొబ్బరి, మిరియాలు, కర్రపెండెలం, పోక, రబ్బర్ వంటి తోటల సాగుచేయబడుతున్నాయి. ఆసియాలోని అతి పెద్ద దాల్చిన చెక్క ఎస్టేట్ నుండి దాల్చినచెక్క ఉత్పత్తి చేస్తుంది. 1767 లో కున్నూరు లోని అంజరకండీ వద్ద బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి చెందిన లార్డ్ బ్రౌన్ ఈ ఎస్టేటును స్థాపించాడు.

వరి[మార్చు]

జిల్లాలో వార్షిక పంటలలో వరి ఆధిక్యత సాధించింది. పంట ఉత్పత్తిని అధికంచేసే ప్రణాళిక కింద వరి పంట సాగులో అధిక ఉత్పత్తుని సాధించింది. వరిపొలాలలో ఇతర పంటలు అధికంగా పండిస్తున్న కారణంగా వరిపంట పండిస్తున్న వ్యవసాయ భూముల వైశాల్యం తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ జిల్లాలో సరాసరి వరి ఉత్పత్తి హెక్టారుకు 2146 కి.లో. జిల్లా అంతటా కొబ్బరి పుస్కలంగా పండించబడుతుంది. ముంతమామిడి పంటకు జిల్లాకు ప్రత్యేకత ఉంది. తక్కుసారవంతంమైన భూములు విస్తారమైన బీడు భూములు ముంతమామిడి పంటను, దానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాయి.

సుగంధద్రవ్యాలు[మార్చు]

జిల్లాలో పండించబడుతున్న సుగంధద్రవ్యాలలో మిరియాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. మిరియాలు కొబ్బరి, పోక, ఇతర పండ్ల తోటలలో అంతరపంటగా పండించబడుతుంది. జిల్లాలోని కొండప్రాంతంలో రబ్బరు, జీడితోటలు పెంచబడుతున్నాయి. ప్లాంటేషన్ పంటలలో రబ్బర్ పారిశ్రామికంగా అధిక అదాయం ఇచ్చే పంటగా ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలోని 55% పంట తలిపరంబ తాలూకాలో పండించబడుతుంది. వారు హెక్టారుకు 2000 - 4000 కి.గ్రా రబ్బర్ ఉతపత్తి చేస్తున్నారు.

పరిశ్రమలు[మార్చు]

కన్నూరు జిల్లా ఆరంభకాలం నుండి పారిశ్రామికంగా ప్రధాన్యత కలిగి ఉంది. జిల్లాలో మంచి మట్టి, ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చని అడవులు, విస్తారమైన చేపల నిలువలు, ఖనిజాలు అలాగే రహదారి, రైలు, జలవనరులు మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్నందువలన జిల్లా పరిశ్రమల అభివృద్ధికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. అయినప్పటికీ కన్నూరు జిల్లా పారిశ్రామికంగా తగినంత అభివృద్ధి చెందలేదు. జిల్లాలో ఒక ప్రధాన, 5 చిన్నరహా పారిశ్రామిక వాడలు (ఇండస్ట్రియల్ ఎస్టేట్) ఉన్నాయి. దేశంలోని వల్లపట్నంలో కెల్ట్రాన్ కాంప్లెక్స్, మంగత్తుపరంబ, వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ ప్లైవుడ్ ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద వుడ్ ఆధారిత ప్లేవుడ్ పరిశ్రమల సమూహంగ వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ గుర్తించబడితుంది. జిల్లాలో కాటన్, వస్త్రతయారీ, ప్లైవుడ్ తయారీ సంబంధిత 12 మద్యతరహా సంస్థలు ఉన్నాయి.

చేనేత[మార్చు]

జిల్లాలో ప్రధానంగా చేనేత పరిశ్రమలు, బీడి తయారీ, కాయిర్ మొదలైన సంప్రదాయ పరిశ్రమలుగా ఉన్నాయి. వస్త్రతయారీ పరిశ్రమ మీద ఆధారపడి ఒక లక్ష మంది ప్రజలు జీవిస్తున్నారు. జిల్లాలో వస్త్రతయారీ పరిశ్రమకు 40% చిన్నతరహా యూనిట్లు ఉన్నాయి. వస్త్రతయారీ పరిశ్రమను జిల్లాలో జర్మన్ బసెల్ మిషన్ ప్రారంభించింది. 19వ శతాబ్దంలో కన్నూరులో మొదటి రెడీమేడ్ - గార్మెంటు యూనిట్ స్థాపించబడింది. ఇది జిల్లాలో 50,000 మందికి ఉపాధి సౌకర్యం కల్పిస్తుంది. జిల్లాలో దినేష్ బీడి ప్రముఖ కోపరేటివ్ బీడీ సంస్థగా గుర్తించబడుతుంది. ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న సాధుబీడి కంపెనీ ఉంది. సంప్రదాయ సాంకేతికతను ఉపయోగిస్తున్న కాయిర్ సంస్థలు 11,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.

చిన్నతరహా పరిశ్రమలు[మార్చు]

జిల్లాలో 6934 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 202 సిక్ యీనిట్లు (9.3%) ఉన్నాయి. 4828 యూనిట్లు ఇప్పుడు శక్తివంతంగా పనిచేస్తున్నాయి. పాతిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఉన్న కన్నూరు, తలస్సేరి, పయ్యనూరు, తలిపరంబా, ఎరక్కాడు పారిశ్రామికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తించబడుతున్నాయి.

విభాగాలు[మార్చు]

విషయాలు వివరణలు
రూపకల్పన 1957 జనవరి 1
తాలూకాలు 3 తలస్సేరి, కన్నూరు, తాలపరంబ
పంచాయితీలు 82
మండలాలు 9 కన్నూర్, ఎడాక్కాడ్, రిక్కూర్, ఇరిట్టి, కూతుపరంబ, పయ్యానూరు, పెరవూరు, తలిపరంబా, తలసేరి.
పురపాలకాలు తలిపరంబా, కన్నూర్, తలాసేరీ, కూతుపరంబ, పయ్యనూరు, మట్టనూరు.
అసెంబ్లీ నియోజక వర్గం ఇరిక్కూర్, పయ్యనూరు, తలిపరంబా, కల్లియస్సేరి, అళికోడ్ (కన్నూర్), కన్నూర్, ధర్మదం, తలాసేరీ, మట్టనూరు, కూతుపరంబ, పెరవూరు.

1957 జనవరి 1 న మద్రాసు రాష్ట్రంలోని మలబార్ జిల్లా, కాసరగోడ్ తాలూకాలను మూడు జిల్లాలుగా (కన్నూరు, కాసరగోడు, పాలక్కాడు) కన్నూరు జిల్లా రూపొందించారు. జిల్లా రూపొందించినప్పుడు జిల్లాలో కాసరగోడ్ తాలూకా, హోస్‌దుర్గ్, తలిపరంబా, కన్నూర్, తలాసేరీ, ఉత్తర వయనాడ్, దక్షిణ వయనాడ్ తాలూకాలు ఉన్నాయి. 1957 మార్చి 15 న దక్షిణ వయనాడు తాలూకా కోళికోడ్ జిల్లాలో విలీనం చేయబడ్డాయి. 1980లో వయనాడు జిల్లాను దక్షిణ వయనాడు, ఉత్తర వయనాడు తాలూకాలుగా విభజించబడ్డాయి. 1984 మే 24 కన్నురు జిల్లాలోని ఉత్తరంలో ఉన్న కాసర్గోడ్, హోసదుర్గ్ తాలూకాలను వేరుచేసి కాసరగోడ్ జిల్లాను రూపొందించారు.

వయ్యనూరు[మార్చు]

కొలయారు, పెరవూరు మద్య ఉన్న వయ్యనూరు కొట్టియూరు వడక్కేశ్వరాలయానికి ద్వారంగా ఉంది. ముక్కువయ్యనూరు వద్ద శివాలయం, పాలకీళిల్ ఆలయం, భగవతి అమ్మన్ ఆలయం ఉన్నాయి. వెక్కలం గ్రామం వద్ద ఉన్న వయ్యనూరు నుండి పెరవూరు 5కి.మీ, కొలయాడు 4 కి.మీ దూరంలో ఉంది. .

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

A view of Valapattanam river from the bridge built across it
Kannur Railway Station

రహదారి మార్గం[మార్చు]

మాహే- తలపాడీ పశ్చిమ సముద్రతీరం జిల్లాలోని రహదారి మార్గానికి వెన్నెముక వంటిది. ఇక్కడ జాతీయరహదారి - 17 కన్నురు- మట్టనూరు - ఇరిట్టి రోడ్డు,పప్పినిస్సేరి- పిలథారా రోడ్డు, తలిపరంబ-శ్రీకండపురం రోడ్డు, పయ్యనూరు- మంగుళూరు (కర్నాటక), కోళికోడ్ కన్నురు నుండి 125 కి.మీ దూరంలో ఉన్నాయి. మట్టనూరు వద్ద కన్నూరు వమానాశ్రయం రానున్నది.

తలసేరి[మార్చు]

తలస్సేరి, కన్నురు, కోళికోడ్ జిల్లాలోని చిన్నతరహా నౌకాశ్రయాలుగా ఉన్నాయి. కన్నూరు పురాతన నౌకాశ్రయాలలో ఒకటి. సమీపంలో ఉన్న ఆల్- వెదర్ సీ పోర్ట్ మంగుళూరులో ఉంది. భూ అంతర్గత జలమార్గాలు పెరుంబ, తలిపరంబాలను అనుసంధానిస్తున్నాయి. దీనిని 1766లో కన్నూరు రాజా ఆరంభించాడు. 3 కి.మీ పొడవైన కాలువచు " సుల్తాన్ కాలువ " అంటారు. పశ్చిమంగా ప్రవహిస్తున్న నదులు జలమార్గ రవాణాకు ఉపకరిస్తున్నాయి. కుప్పం నది జలమార్గం పొడవు 244 కి.మీ, వలపట్టణం జలమార్గం పొడవు 55 కి.మీ, అంజరకండి జలమార్గం పొడవు 23 కి.మీ.

వాయుమార్గం[మార్చు]

2009లో " కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ " మట్టనూరు వద్ద నిర్మించాలని ప్రతిపాదించబడింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,525,637,[2]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 170 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 852 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 4.84%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1013:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 95.41%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 2,412,365
నగరపుర నివాసితులు 1,212,898 (50.35%) (రాష్ట్రంలో 2వ స్థానం మొదటి స్థానం ఎర్నాకుళం).
నగరీకరణ 4 వ స్థానంలో ఉంది. ( ఎర్నాకుళం, త్రుస్సూరు, కోళికోడ్) [5]

మతం[మార్చు]

విషయాలు వివరణలు
హిందువులు 61.47%
క్రైస్తవులు 10.84%
ముస్లిములు 27.63%.

జిల్లాలోని 45 పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు 1,212,898 (50.35%). 2001 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో ఇది రెండవ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి త్రిసూరులో 135 పట్టణాలు, కన్నూరు జిల్లాలో 67 పట్టణాలు ఉన్నాయి..[6] కన్నూరు 7 ప్రధాన పట్టణాలు ఉన్నాయి. కన్నూర్, కన్నూర్ కంటోన్మెంట్, తలాసేరీ, పయ్యన్నుర్,తలిపరంబ,కుథుపరంబ, మత్తన్నుర్. అంచరకంది సహా అదనంగా అళికోడ్ ఉత్తర, అళికోడ్ దక్షిణం, ఛాలా కన్నూర్, చెలోర,చెరుకున్ను,చెరుథళం,చిరక్కల్ (కన్నూర్), చిరక్కల్,చొచ్క్లి,ధర్మదొం,ఎలయవూర్,ఎరణొలి,ఈరివెరి,కదచిర,కదిరుర్,కల్లీస్సెరి, కణిరొదె,కన్నదిపరంబ,కన్నపురం,కొట్టాయం-మలబార్,మవిలయి,ముందెరి (కన్నూర్), ముళప్పిలంగద్,నరథ్, న్యూ మాహె,పదువిలయి,పల్లిక్కున్ను,పన్నియన్నుర్,పనూర్, పప్పినిస్సెరి,పథిరియద్,పత్తిఒం,పెరలస్సెరి, పెరింగథుర్,పినరయి,పుళథి,తొత్తద, వలపత్తనం,వరం ఉన్నాయి.[5] కన్నూరు జిల్లాలో మలయాళం ప్రధానభాషగా ఉంది. కన్నడ, తులు, తమిళ భాషను మాట్లాడే వారుకూడా స్వల్పంగా ఉన్నారు.

వృక్షజాలం, జంతుజాలం[మార్చు]

Mangroves on the banks on Valapattanam River

కన్నూరు జిల్లాలో సుసంపన్నమైన వృక్షసంపద ఉంది. కొన్ని సముద్రతీరప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రంతాలలో వైవిధ్యమఒన అరణ్యప్రాంతాలు ఉన్నాయి. వతావరణం అనుకూలంగా ఉన్నందున వివిధ జాతులకు చెందిన చెట్లు కనిపిస్తుంటాయి. అనుమతి నిషేధించబడిన ప్రదేశాలలో కొన్ని ప్రత్యేకమైన చెట్లు కనిపిస్తుంటాయి. ప్సామొఫైట్, మాంగ్రోవ్స్ నుండి సతతహరితారణ్యాల వరకు వైవిధ్యమైన అడవులు కనిపిస్తుంటాయి.

సముద్రతీర ప్రాంతం[మార్చు]

సముద్రతీరం సాధారణంగా సన్న భూభాగంగా ఉంటుంది. ఇక్కడ మట్టి వదులుగా ఇసుక ప్రాంతంగా ఉంటుంది. స్టెరిల్ శాండీ ప్రాంతంలో ప్సామోఫైట్ వంటి చెట్లు మాత్రమే కనిపిస్తుంటాయి. చెట్ల జాతులు చిన్నవిగా తక్కువ ఎత్తులో ఉంటాయి. తక్కువ నీటిని నిలువజేసుకునే భూమిలో పెరిగే ఈ చెట్లు క్సెరోఫైటిక్ లక్షణాలు అధికంగా కనిపిస్తుంది. అలాగే ఇవి సముద్రతీరాల వెంట సముద్రపు అంచులవరకు విస్తరించి ఉన్నాయి. సముద్రతీర వృక్షజాతి రూపురేఖలు మానవ ఆక్రమణ ద్వారా మార్పులు సంభవిస్తున్నాయి.

పర్వతప్రాంతం[మార్చు]

జిల్లాలోని ప్రధాన భాగం మధ్యతరహా భూభాగంలో అనేక కొండలు, మిట్టలతో ఎత్తుపల్లాలుగా ఉండి క్రమంగా పశ్చిమ కనుమలతో కలిసి ఉంటుంది. మట్టి మద్యతరహా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా వర్ధాధార అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ వర్షాధార, సతతహరితారణ్యాలు ఉంటాయి. ఇక్కడ వార్షిక, పెరెన్నియల్ చెట్లు ఉంటాయి. కొండలు వరుసగా ఉంటాయి. పశ్చిమ కొండప్రాంతపు మట్టి ఎర్రగానూ, ఇసుక కలిసిన భూమిగాను ఉంటుంది. ఇక్కడ అటవీప్రాంతంలో ఉండే చెట్లు ఉంటాయి. ఇక్కడ అధిమైన వెదురు పొదల మధ్య చెదురుమదురుగా టేకు చెట్ల ఉంటాయి. ఇక్కడ పసరిక భూములు కూడా ఉంటాయి.

అరలం అభయారణ్యం[మార్చు]

A cluster of mangroves on the banks of Vellikeel river in Taliparamba

పశ్చిమకనుమల అసమానమైన కొండప్రాంతంలో 55 చ.కి.మీ విస్తీర్ణంలో 1984లో " అరలం అభయారణ్యం " స్థాపించబడింది. అభయారణ్యం ప్రధానకార్యాలయం కున్నూరుకు 55 కి.మీ దూరంలో ఉన్న చిన్న పట్టణం అయిన ఇరిట్టి వద్ద ఉంది. అరలం వద్ద అభయారణ్యం సెంట్రల్ స్టేట్ ఫాంతో కలుస్తుంది. అరలం అభూయారణ్యం ముళకున్ను, అరలం పంచాయితీలలో ఉంది. ముళకున్ను కూడా ఒక పర్యాటకప్రాంతమే. ఇది 50-1145 మీ ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న కట్టిబెట్టా శిఖరం ఎత్తైనదిగా గుర్తించబడుతుంది. ఇది సముద్రమట్టానికి 1145 మీ ఎత్తులో ఉంది. ఇది ఉష్ణమండల, అర్దహరిత అరణ్యాలతో కప్పబడి ఉంది. పశ్చిమకనుమలలోని విస్తారమైన వృక్షసంపదకు, జంతుసంపదకు అరలం ఆశ్రయం కల్పిస్తుంది. ఇక్కడ జింకల గుంపులు, ఏనుగులు, అడవిపందులు, దున్నపోతులు ఉంటాయి. చిరుత, అడవి పిల్లులు, వైవిధ్యమైన ఉడుతలు కూడా ఉంటాయి. ప్రతిపాదించబడిన రాణిపురం అభయారణ్యంలో కూడా అరలం అభయారణ్యంలో కనిపించే వృక్షజాలం, జంతుజాలం ఉంటుంది.

విద్య[మార్చు]

Sir Syed College, Taliparamba

14-15 శతాబ్ధాలలో కొలాతిరీ రాజుల కాలంలో తలిపరంబా కేరళ రాష్ట్రానికి విద్యా, విఙాన, సాంస్కృతిక కేంద్రంగాఉండేది. ఎళుత్తచ్చన లేక గ్రామ ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఎషుతు పళ్ళి విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడంలో సహకారం అందించేవి. ఈ సంస్థలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు జిమ్నాస్టిక్స్ శిక్షణ కూడా ఇవ్వబడేది. వారికి ఆయిధప్రయోగంలో కూడా శిక్షణ ఇచ్చిన తరువాత వారిని చక్కగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండే వేదపాఠశాలలో సంస్కృతం అభ్యసించడానికి పంపేవారు. ఈ జిల్లాలో పూర్వం ఇటివంటి కలరి పాఠశాలలు ఉండేవి. కలరిపయట్టు కళ ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించి ఉండేది.

19వ శతాబ్దం ఆరంభకాలం కన్నురు జిల్లాలో పశ్చిమ దేశాల విద్య ప్రవేశించింది. 1856 మార్చి‌లో జిల్లాలోని తలస్సేరిలో మొదటగా " బాసెల్ జర్మన్ మిషన్ ఇంగ్లీష్ స్కూల్ " స్థాపించబడింది. బ్రెన్నెన్ స్కూల్ (తలస్సేరి), ప్రస్తుత ప్రభుత్వ బ్రెన్నెన్ కాలేజ్ 1862లో స్థాపించబడింది.

కన్నుర్ విశ్వవిద్యాలయం[మార్చు]

కన్నురు విశ్వవిద్యాలయం 1996లో స్థాపించబడింది. అంతకంటే ముందుగా 1995 నవంబరు 9న మలబార్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దీనిని 1996 మార్చి 2 న కేరళ ముఖ్యమంత్రి ఆరంభించారు. 1996లో కన్నురు విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దీనిని కాసరగాడ్, కన్నూరు జిల్లాలు, వయనాడు జిల్లాలోని మనతవాడి తాలూకాలో విద్యార్థుల పోస్ట్‌గ్రాజ్యుయేషన్ చదువు కొరకు స్థాపించారు. 1999లో పయ్యనూరు వద్ద 500 పడకల వసతితో సూపర్ స్పెషాలిటీ వసతులతో పరియారం మెడికల్ కాలేజ్ స్థాపించబడింది. 2006లో అంజనకరడి వద్ద స్థాపించబడిన మెడికల్ కాలేజీ కలిసి కన్నురు జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.

డిగ్రీ కళాశాలలు[మార్చు]

ఆర్ట్స్, సైంస్[మార్చు]

గవర్నమెంటు బ్రెన్నన్ కాలేజ్ :- తలస్సేరి ఎస్.ఎన్ కాలేజ్ (కన్నురు), పయ్యనూరు కాలేజ్, సర్ సయ్యద్ కాలేజ్ (తలిపరంబ)

ఇంజనీరింగ్ కాలేజ్[మార్చు]

గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (కన్నూరు).

ఇతర విద్యా సంస్థలు[మార్చు]

  • కన్నురులో 13వ శతాబ్ధానికి చెందిన " నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ " (తలిపరంబ).
  • ప్రముఖ " కలడి శంకరాచార్య విశ్వవిద్యాలయం " రీజనల్ సెంటర్ పయ్యనూరు వద్ద ఉంది. .

క్రీడలు[మార్చు]

కన్నూరు నుండి క్రీడలలో గుర్తింపు పొందిన పలువురు ప్రముఖులు వెలుగులోకి వచ్చారు. స్వాతంత్ర్యానికి ముందు మిలటరీ సెంటరుకు చెందిన ఆంగ్లేయులు జిల్లాలో కాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ మొదలైన క్రీడలను ప్రవేశపెట్టారు. మైదాన్ గ్రౌండ్, పోలీస్ మైదాన్ యువతకు విస్తారమైన సౌకర్యాలను అందిస్తూ ప్రోత్సాహం అందిస్తుంది. ది సి.డి.ఆర్.ఇ ఫుట్‌బాల్ టీం, హాకీ టీం ఆరోజులలో ఆరంభించబడ్డాయి. అదేసమయం కలరి పయట్టు మొదలైన సంప్రదాయక మార్షల్ ఆర్ట్స్ కూడా జిల్లాలో సుసంపన్నంగా అభివృద్ధి చెందుతూ ఉంది.

స్వతంత్రం తరువాత[మార్చు]

స్వతంత్రం వచ్చిన తరువాత ఫుట్‌బాల్ క్లబ్బులు కన్నూరులో ఫుట్‌బాల్ ఆసక్తిని పెంపొందించాయి. స్పిరిటెడ్ యూత్స్, కక్కీ స్టార్, బ్రదర్స్ క్లబ్, గ్య్ంఖాన క్లబ్ ప్రబలమయ్యాయి. ఇవి ప్రఖ్యాత క్రీడాకారులైన డీక్రజ్, సోమన్, దాసన్ మొదలైన ఫుట్‌బాల్ క్రీడాకారులను అందించాయి. తొట్టాడలో ఉన్న శ్రీ నారాయణాకాలేజ్ క్రీడాకారుల నర్సరీగా గుర్తించబడుతుంది. వీరిలో బి.దేవానంద్ కాలేజీ కాప్టన్ షిప్ నుండి కాలికట్ యూనివర్శిటీ కాప్టన్ షిప్ వరకూ ఎదిగాడు. తరువాత దేవానంద్ బాంకాక్‌లో, టాటా ఫుట్‌బాల్ టీం నిర్వహించిన పలు ఇతర టోర్నమెంటులకు ఇండియన్ యూత్ టీంకు నాయకత్వం వహించాడు. 1973లో సంతోష్ ట్రోఫీ సాధంచడంలో దేవానంద్ ప్రధానపాత్ర వహించాడు. విజయం సాధించిన సంతోష్ ట్రోఫీ కెప్టన్ మణి గుర్తించతగిన ఫుట్‌బాల్ క్రీడాకారులలో ఒకరు. జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన క్రీడాకారులలో డెంసన్ దేవదాస్ ఒకరు. ఇటాలియన్ క్లబ్ తరఫున ఆడిన వాలీబల్ క్రీడాకారుడు అంతర్జాతీయంగా 10 టాప్ స్ట్రైకర్లలో ఒకడుగా గుర్తించబడిన జిమ్మీ జార్జ్ కన్నురు పుట్టింది అన్నది గమనార్హం.

హాకీ[మార్చు]

తలస్సేరి, కన్నూరు మిలటరీ నుండి హాకీ బృందం క్రీడలలో ప్రధానమైనదిగా గుర్తించబడ్జుతుంది. క్రికెట్, బ్యాడ్మింటెన్, పవర్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, రెస్ట్లింగ్, వాలీబాల్ మొదలైన క్రీడలు నరప్రాంతం, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆదరణ కలిగి ఉన్నాయి. మునుపటి హాకీ గోల్‌కీపర్ మాన్యుయల్ ఫ్రెడరిక్ స్వస్థలం కన్నూరు. కన్నురుకు చెందిన ఇవాన్ డీ,క్రజ్ క్రికెట్, హాకీ క్రీడలలో పాల్గొనడం విశేషం.

స్కూల్స్[మార్చు]

1976లో క్రీడా విభాగం ఆరంభించగానే జిల్లాలో ఉత్తమశ్రేణి క్రీడాకారులు తయారు కావడం మొదలైంది. క్రీడా విభాగంలో గవర్నమెంటు హైయ్యర్బ్సెకండరీబ్స్కూల్ (కన్నూరు) నుండి అంతర్జాయ అథ్లెటిక్స్‌గా గుర్తింపు పొందిన పి.టి ఉష, ఎం.డి వలసమ్మ వచ్చారు. బాస్కెట్ బాల్ క్రీడాకారులు లీలమ్మా థోమస్, బెనెడిక్ట్ వచ్చారు. వాలీబాల్ క్రీడాకారులు అనితారత్నం, ఆనందవల్లి వచ్చారు. పోలీస్ మైదానం ఎం.డి. వలసమ్మ, మెర్సీ మాథ్యూలకు శిక్షణావేదిక అయింది. పి.కె బాలచంద్రన్, వి.పి సత్యన్, డీ' క్రజ్ రాజన్, రమణన్, సుగుణన్, సి.ఎం.చిదానందన్, బి.దేవనాదన్, జార్జ్ (ఫుట్‌బాక్), ఫోర్డ్, ఒలింపిక్ క్రీడాకారుడు మాన్యుయల్ ఫ్రెడ్రిక్ (హాకీ) శిక్షణావేదిక అయింది. ఫోర్ట్ మైదానం వెస్ట్‌లైన్, లెస్లీలకు క్రికెట్ శిక్షణా వేదిక అయింది. బ్యాడ్‌మింటన్ క్రీడలో టికె.రామకృష్ణన్, కుమరన్ కన్నూరుకు గుర్తింపు తీసుకువస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో ఎ.ఎం.భరతన్ చరిత్ర సృష్టించాడు. 1951లో ఆసియన్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన సమయంలో వెయిట్ లిఫ్టింగ్ తరఫున పాల్గొన్న క్రీడాకారుడుగా నెల్లియరి కృష్ణన్ కన్నూరుకు గుర్తింపు తీసుకువచ్చాడు. బ్రిటిష్ ఇండియా భారతదేశంలో మొదటిసారిగా క్రికెట్ క్రీడను కన్నూరులో ఆరంభించారు. ఈ విధంగా కన్నూరు భారతదేశంలో క్రికెట్ క్రీడకు జన్మస్థానంగా గుర్తించబడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ 200 ల వార్షిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు వెంగ్సర్కర్ పాల్గొన్నాడు.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

స్నేక్ పార్క్[మార్చు]

పరస్సిని కడవు వద్ద ఉన్న స్నేక్ పార్క్ జిల్లాకు ఒక ప్రత్యేకత తీసుకు వస్తుంది. ఇది కన్నురు - తలిపరంబా మార్గంలో జాతీయరహదారి-17 కు 2 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పలు జాతుల పాములు, చిన్న జంతువులను చూడవచ్చు. ఇక్కడ లై షోలు కూడా నిర్వహించబడుతుంటాయి. ఇది శిక్షణ, వివిధ పాములను సామీప్యం కలింగించే సరదా కలించే ప్రదర్శనగా ఉంటుంది. ఇక్కడ త్రాచు, వ్సిపరిడీల్వైపర్ ఉంటాయి. ఇది పౌరాణిక విశ్వాసాలు, పాములగురించిన మర్మాలు పోగొట్టేలా ఉంటుంది. పప్పినిస్సేరి వద్ద ఏర్పాటు చేయబడిన స్నేక్ పార్క్ దేశ విదేశ పర్యాటకులను సమానంగా ఆకర్షిస్తుంది. పాము కాటుకు ఆలోపతీ, ఆయుర్వేద మార్గాలలో ఒకే ప్రదేశంలో చికిత్స అందిస్తున్న కేంద్రంగా కూడా దీనికి ప్రత్యేకత ఉంది. ఈ స్నేక్ పార్కులో త్రాచు, రాజనాగం, డబోరియా (రుస్సెల్ వైపర్), క్రైట్, వివిధ విషపాములు 150 జాతులు ఉన్నాయి. ఇక్కడ విషరహితమైన పాములు కూడా పలు జాతులు సేకరించబడి ఉన్నాయి. పాముల నుండి విషం సేకరించడానికి ఇక్కడ ఒక పరిశోధనా కేంద్రం కూడా ఉంది. పార్క్ అంతరించి పోతున్న పలు జాతుల పాములను సేకరించి సంరక్షించడానికి కృషిచేస్తుంది. కన్నురుకు 16 కి.మీ దూరంలో ఉన్న పరస్సునికడవులో ప్రముఖ ముత్తప్పన్ ఆలయం ఉంది. ప్రతిరోజు తెయ్యం విధానంలో దైవారాధన నిర్వహించబడుతున్న ఒకేఒక ఆలయంగా దీనికి కేరళ రాష్ట్రంలో గుర్తింపు ఉంది.

ఎస్.టి ఆంగ్లో కోట[మార్చు]

St. Angelo Fort

సెయింట్ ఆంగ్లో ఫోర్ట్‌ను 1505లో మొదటి భారతదేశ మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ సర్ ఫ్రాంసిస్కో డీ ఆల్మిడా నిర్మించాడు. ఇది సముద్రతీరంలో కన్నూరుకు 2కి.మీ దూరంలో ఉంది. ఈ కోటకు పౌరాణిక నేపథ్యం ఉంది. ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి పలుయుద్ధాలకు సాక్ష్యంగా ఉంది. చివరికి 1790లో బ్రిట్జిష్ ఈ కోట మీద జయకేతనం ఎగురవేసింది. ఈ కోట ఇప్పటికీ సంరక్షించబడుతూ మంచి స్థితిలో ఉంది. ఆర్కిటెక్చర్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణాలో స్మారకచిహ్నం ఉంది. కోట నమూనా పెయింటింగ్, కోట వెనుక ఫిష్షింగ్ ఫెర్రీ ఉంది. కోటలో రిజిక్స్‌మ్యూజియం ఉంది. సెయింట్ ఆంగ్లో కోట ప్రధాన చారిత్రక స్మారకచిహ్నం, పర్యాటక కేంద్రంగా ఉంది. కోటలో రక్షణ, మార్గదర్శకం కొరకు కేరళ పోలీస్ 6 గురు పర్యాటక పోలీస్ అధికారులను నియమించింది. వీరిలో సత్యన్‌కు ఎడక్కాడు కోట, పరిసర ప్రాంతాలగురించిన గురించిన సంపూర్ణ ఙానం ఉంది. ఆయన వ్రాసి ప్రచురించబడిన " వాస్కోడిగామా చరిత్రదిలే కానాపురంగలం " (వాస్కోడిగామా, అభిఙాన చారిత్రక పుటలు) పుస్తకంలో కోటగురించిన గతకాల, ప్రస్తుత చరిత్ర తెలుసుకోవచ్చు. ఈ కోటకాసరగోడ్ వద్ద ఉన్న బెలల్ కోట అంత విశాలమైనది కానప్పటికీ పచ్చదనంతో చక్కగా సంరక్షించబడుతున్న కనువిందు చేస్తున్న అందమైన కోటగా గుర్తించబడుతుంది. కోట సమీపంలోని పయ్యంబలం, ప్రభుత్వ అతిథిగృహాలు మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది.

వైతల్‌మల[మార్చు]

వైతల్‌మల కేరళ- కర్నాటక సరిహద్దులో ఉన్న ఒక హిల్ స్టేషన్. ఇది కన్నురు నుండి 65కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 1371.6 మీ ఎత్తున ఉన్న ఇది పర్వతారోహణకు అనుకూలమైనదిగా భావించవచ్చు. కొండ చివర పర్వతారోహకులు, పర్యాటకుల కొరకు బేస్ రిసెప్షన్ సెంటర్, వాచ్ టవర్ పనిచేస్తుంది. ఇది కుడియన్మల సమీపంలో ఉంది.

ఎళిమల[మార్చు]

ఎళీమల పురాతన మూషికరాజులకు రాజధానిధానిగా ఉండేది. ఇది పురాతన ప్రదేశాలలో ఒకటిగా ఉండేది. ఇది ఒక కొండలు కేంద్రీకృతమైన ప్రాంతంగా ఉంటుంది. ఇది కన్నురు పట్టణం నుండి 38కి.మీ దూరంలో ఉండేది. ఇది పురాతన కేరళ రాష్ట్రంలో వాణిజ్యకేంద్రంగా, సుసంపన్నమైన సముద్రతీరం ఉంది. 11 వ శతాబ్దంలో చోళ- చేర సామ్రాజ్యాల మద్య యుద్ధానికి ఇది ప్రధానంగా ఉంది. ఏళిమలను బుద్ధుడు సందర్శించాడాని విశ్వసిస్తున్నారు. ముస్లిం సంఘసంస్కర్త " షేక్ అబ్దుల్ లతీఫ్ " సమాధి ఉందని విశ్వసిస్తున్న పురాతన మసీదు ఉంది. ఈ కొండ ఔషధ మొక్కలకు నిలయమని భావిస్తున్నారు. ఇక్కడ పురాతనమౌన " మౌంట్ ఢిల్లీ లైట్ హౌస్ " ఉంది. ఇది ఇండియన్ నేవీ నిర్వహిస్తున్న నిషేధిత ప్రాంతం. సముద్రతీరబ్ ఇసుక కొంత వ్యత్యాదంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకంటే ఇక్కడ సముద్ర అలలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఎట్టికుళం సముద్రతీరంలో డాల్ఫిన్లు కనిపిస్తాయి. మూడువైపుల సముద్రతీరంతో ఏళుమల ఆకర్షణీయమైన ప్రాంతంగా భావించబడుతుంది. భారతీయ నావికాదళ చరిత్రలో ఏళుమలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఇండియన్ నేవీ అకాడమీ స్థాపించాలన్న ప్రతిపాదన ఉంది.

మదయిపర[మార్చు]

Madayi Para in August

.మదయీపరా పర్యావరణ వైవిధ్యం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా గుర్తించబడుతుంది. ఎళిమల రాజులకు ఇది రాజధానిగా ఉండేది. మదయిపరా లోపల, వెలుపలా గత చరిత్ర గుర్తులు అనేకం ఉన్నాయి. కొండకు దక్షిణ ప్రాంతంలో పళికోట శిథిలాలు ఉన్నాయి. కోట నలుమూల గడియారపు గోపురాలు ఉన్నాయి.14-18 శతాబ్ధాలలో కొలతునాడు సంస్థానాధీశులకు పట్టాభిషేక ప్రదేశంగా ఉంది. మదయిపర కొండ చారిత్రక, మతపరమైన ప్రాఫ్హాన్యత కలిగి ఉంది. ఇక్కడ యూదు వలసప్రజలు నిర్మించిన చేతి అద్దం ఆకారపు సరోవరం ఒకటి ఉంది. ఇక్కడ వడుకుండ శివాలయం, ఒక కోనేరు ఉన్నాయి. మండు వేసవిలో సైతం సరోవర జలం ఎడకపోవడం ఒక విశేషం. మదయిపరాలో మదయికవు (దట్టమైన వృక్షాలమద్య ఉన్న కవు - కుటుంబ ఆలయాలు) పూరం ఉత్సవం జిల్లలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. పర్యావరణ వైవిధ్యం ఉన్న మదయిపరాలో 300 జాతుల పూలమొకాలు, 30 జాతుల గడ్డి జాతులు, పలు కీటకభక్షిణి మొక్కలు ఉన్నాయి. మదయిపరాలో అధిక సంఖ్యలో ఔషధీయ మొక్కలు ఉన్నాయి. 100 జాతుల శీతాకోక చిలుకలు, 150 జాతుల పక్షులు ఉన్నాయి. మదయిపరా అతిథులలో పెద్ద తరహా శీతాకోక చిలుకలో ఒకటైన అట్లాస్ శీతాకోక చిలుక ఒకటి.

వ్యవసాయం[మార్చు]

1905లో " డిస్ట్రిక్ అగ్రికల్చరల్ ఫాం " (కన్నురు) స్థాపించబడింది. ఇది దక్షిణ భారతదేశంలోని అతి పురాతన వ్యవసాయక్షేత్రంగా గుర్తించబడుతుంది. ఇది కన్నురుకు 20 కి.మీ దూరంలో ఈ వ్యవసాయక్షేత్రాన్ని సర్ చార్లెస్ ఆల్ఫర్డ్ స్థాపించాడు. 1880లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామైన్ కమిషన్ రికమెండేషన్‌తో ఈ వ్యవసయక్షేత్రం స్థాపించబడింది.

వ్రేలాడే వంతన (తూక్కు పాలెం) - పెరలస్సేరి[మార్చు]

పెరలస్సేరిలో ఉన్న వ్రేలాడే వంతన (తూక్కు పాలెం) కన్నురు జిల్లాలోని వ్రేలాడే వంతెనలలో ఒకటి. ఇది పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది.

కంజరకొల్లి వాటర్‌ఫాల్స్ (పయ్యవూరు)[మార్చు]

Kanjirakkolly Waterfalls

కన్నూరుకు 55కి.మీ దూరంలో కంజరకొల్లి వాటర్‌ఫాల్స్ (పయ్యవూరు) ఉంది. ఉత్తర కన్నూరు జిల్లాలో పలు అందమైన జలపాతాలు ఉన్నాయి. జలపాతం సమీపంలో 1 కి.మీ దూరంలో శసిప్పరా వ్యూపాయింటు ఉంది.

ఆధ్యాత్మిక ప్రదేశాలు[మార్చు]

కన్నూరు జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. కన్నూరు జిల్లాలో పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి.

ప్రముఖులు[మార్చు]

1803లో మొదటిసారిగా పళ్సిరాజా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు. పళిసి రాజా పాలించిన పళసి రాజ్యమే ప్రస్తుత కన్నూరు జిల్లా. పలురాజకీయ నాయకులకు కన్నురు కేంద్రంగా ఉంది. మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎ.కె.గోపాలన్, మూడు మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కె.కరుణాకరన్, కాంగ్రెస్ నాయకుడు ఎ.అహమ్మద్, రాష్ట్ర రైల్వే మంత్రి ఎం.వి. రాఘవ, గత ఆరోగ్యశాఖ మంత్రి పి.కె శ్రీమతి, గత మంత్రి పినరాయ్ విజయన్ కన్నూరు జిల్లాకు చెందినవారే. ఇతర ప్రముఖులలో చలనచిత్ర నటీనటులు శ్రీనివాసన్, వినీత్, సంవృతసునీల్, మంజు వారియర్, రచయితలు టి.పద్మనాభన్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు వి.పి. సత్యన్, జిమ్మీ జార్జ్ (వాలీబాల్), ఫైటర్ ఫైలెట్ మూర్‌కోత్ రామున్ని జిల్లకు చెందినవారే. ప్రముఖ కళాకారుడు, దర్శకుడు కె.టి అరుణ్ స్వస్థలం కన్నురు జిల్లా.లీలా గ్రూప్ హోటల్స్ స్థాపకుడు, వాణిజ్యవేత్త సి.పి. కృష్ణన్ నాయర్ పుట్టిపెరిగింది కన్నూరులోనే.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Only Centre can end Kannur violence: High Court". Chennai, India: The Hindu. 12 March 2008. Archived from the original on 15 మార్చి 2008. Retrieved 30 జూన్ 2014.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551
  5. 5.0 5.1 Indian Census
  6. [1]

వెలుపలి లింకులు[మార్చు]

Note: Mahe district, Puducherry is completely surrounded by Kannur district.

మూస:కేరళలోని జిల్లాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కన్నూరు&oldid=3937970" నుండి వెలికితీశారు