సచీ
సచీ | |
---|---|
జననం | కూవకట్టు ఆర్. సచిదానందం 25 డిసెంబర్ 1972 |
మరణం | 2020 జూన్ 18 | (వయసు 47)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1991–2020 |
కె.ఆర్. సచిదానందన్ (సచీ) మలయాళ సినీ రచయిత, దర్శకుడు. ఆయన 2007లో విడుదలైన మలయాళ సినిమా ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సహా రచయితగా సినీరంగానికి పరిచయమై 2015లో ‘అనార్కలి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారి 2020లో విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.
సినీ జీవితం
[మార్చు]సచీ 2007లో విడుదలైన మలయాళ సినిమా ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సహా రచయితగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన ఆ తర్వాత సేతుతో కలిసి ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి సినిమాలకు సహా రచయితగా పని చేసి తరువాత సచీ ఒక్కడే ‘రన్ బేబీ రన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ సినిమాలకు కథ రచయితగా పని చేసి, 2015లో ‘అనార్కలి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారి 2020లో విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.
సినీ ప్రస్థానం
[మార్చు]సచీ–సేతు రచయితలుగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు |
---|---|
2007 | చాక్లెట్ |
2009 | రాబిన్‌హుడ్ |
2011 | మేక్‌పమేన్ |
2011 | సీనియర్స్ |
2011 | డబుల్స్ |
రచయితగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | ఇతర |
---|---|---|
2012 | రన్ బేబీ రన్ | |
2012 | చెట్టాయీస్ | నిర్మాతగా |
2015 | అనార్కలి | దర్శకత్వం వహించిన తొలి సినిమా |
2017 | రామ్‌లీలా | |
2017 | షెర్లాక్ టామ్స్ | మాటలు |
2019 | డ్రైవింగ్ లైసెన్స్ | |
2020 | అయ్యప్పనుమ్ కోషియుమ్ | చివరి సినిమా |
దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు |
---|---|
2015 | అనార్కలి |
2020 | అయ్యప్పనుమ్ కోషియుమ్ |
మరణం
[మార్చు]సచీ కి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో గుండెపోటు రావడంతో 2020 జూన్ 16న త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూన్ 18న మరణించాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (20 June 2020). "'అయ్యప్పనుమ్ కోశియుమ్' దర్శకుడు మృతి". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ Sakshi (20 June 2020). "దర్శకుడు సచీ కన్నుమూత". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ Andhra Jyothy (19 June 2020). "'అయ్యప్పన్ కోషియుమ్' దర్శకుడు ఇకలేరు". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ The Times of India (26 February 2022). "Director-scriptwriter Sachy passes away due to cardiac arrest" (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.