Jump to content

పొల్లాచి

వికీపీడియా నుండి
పొళ్ళాచ్చి
Pollachi
పట్టణం
Paalatrankarai Anjaneyar Temple
Paalatrankarai Anjaneyar Temple
దేశం India
రాష్ట్రంతమిళనాడు
RegionKongu Nadu
జిల్లాCoimbatore
జనాభా
 (2011)
 • Total90,180
భాషలు
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్+91-4259
Vehicle registrationTN 41
Websitehttp://www.pollachi.org/

పొళ్ళాచ్చి (ఆంగ్లం: Pollachi) తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలోవున్న ఈ పొళ్ళాచ్చికి పర్యాటక పరంగా వున్న పేరుప్రఖ్యాతులు అన్నీఇన్నీ కాదు. ప్రకృతి సోయగాలకు, దేవాలయయాలకు ప్రసిద్ధి. కోలీవుడ్గ మెుదలుకొని, టాలీవుడ్గ, మల్లువుడ్గ, బాలీవుడ్గ ఇలా ఒకటేమిటీ... భారత దేశంలో ఉన్న దాదాపు అన్ని భాషా చిత్రాల ఇక్కడ షూటింగ్‌ జరుగుతుంటుంది[1].

ప్రత్యకత

[మార్చు]

ఒకటి కాదు రెండు కాదు.... ఇప్పటివరకు 15 వందలకు పైగా చిత్రాలు ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్నాయంటే పొళ్ళాచ్చికి ఉన్న ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వస్తున్న తెలుగు సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు... కనీసం ఒక పాటైనా... పొళ్ళాచ్చిలో షూటింగ్‌ జరుపుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, డ్యాములు, దేవాలయాలతో ప్రకృతి స్వర్గంగా అలరారుతున్న పొళ్ళాచ్చిలో మరి కొన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

ఇందిరాగాంధీ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి అండ్‌ నేషనల్‌ పార్క్‌

[మార్చు]

ఇందిరా గాంధీ వన్యప్రాణి‌ అభయారణ్యం అండ్‌ నేషనల్‌ పార్క్‌... అద్భుతమైన అన్నామలై కొండల నెలకొనివుంది. 1961 లో అప్పటి ప్రధానమంత్రి సందర్శన తర్వాత దీని పేరు మార్చారు. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున ఉంది. సుమారు 958 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వున్న ఈ పార్క్‌లో వివిధ రకాల మొక్కలు, ఎన్నో రకాల వన్య జీవులు ఉన్నాయి. చిరుతలు, లేళ్ళు, పులులు, ఏనుగులతో పాటు ఇక్కడ అనేక రకాల, అరుదైన పక్షులు కూడా మనం చూడవచ్చు. పార్క్‌ పరిసరాలలో ఉన్న అమరావతి రిజర్వాయర్‌లో మొసళ్ళు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతి ఏటా వందలాది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూవుంటారు.

అళగునాచ్చి అమ్మన్‌ గుడి

[మార్చు]

అళగునాచ్చి అమ్మన్‌ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడిన అద్భుత ఆలయం. పొళ్ళాచ్చికి 80 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయాన్ని వళ్ళియరాచల్‌ ప్రాంతానికి చెందినవారు కట్టించారు. ఈ ఆలయంలో అళగునాచ్చి అమ్మవారు వుంటుంది. కొంతమంది వ్యక్తులు ఒక అమ్మవారి విగ్రహంతో అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకొంటుండగా ఆ విగ్రహం అదృశ్యం అయ్యింది. దానితో వారు అక్కడ దేవాలయం నిర్మించారు. అక్కడే వారు స్థిరపడి దేవాలయాన్ని నిర్వహిస్తుండడం విశేషం.

అజియర్‌ డ్యాం

[మార్చు]

అజియర్‌ డ్యాం పొళ్ళాచ్చికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అజియార్‌ నది పై 1959-69 మధ్య కాలంలో సాగు నీటి కొరకు ఈ డ్యాం నిర్మించారు. ఈ డ్యాం 81 మీటర్ల ఎత్తు కలిగి... అద్భుతమైన ఇంజనీరింగ్‌ పనితనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కలిగివుంది. ఇటీవలికాలంలో ఇది ప్రధాన పిక్నిక్‌ స్పాట్‌గా మారింది.

అరివు తిరుకోయిల్‌

[మార్చు]

అరివు తిరుకొయిల్‌ ఆడాలి అమ్మన్‌ కోయిల్‌ సమీపంలో ఉంది. పొళ్ళాచ్చికి 25 కి.మీ.ల దూరంలో వున్న ఈ ఆలయాన్ని ‘మనస్సాక్షి టెంపుల్‌’ అంటారు. దీనిని యోగిరాజ్‌ వేదాద్రి మహాతిరి మహర్షి ఒక ధ్యానం కేంద్రంగా నిర్మించారు. ఇక్కడ ధ్యానం, ఆధ్యాత్మిక పుస్తకాలు, విరివిగా లభిస్తాయి.

చిన్నార్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి

[మార్చు]

ఈ వన్యప్రాణి‌ అభయారణ్యం పొల్లాచికి 65 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇక్కడ వివిధ రకాల జంతువులు... ప్రత్యేకించి మెరుపులు కల అతి పెద్ద ఉడుత ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. తూవనం వాటర్‌ ఫాల్స్‌, వాచ్‌ టవర్‌లు ఈ ప్రాంత అందాలను మరింత రెట్టింపు చేస్తాయి.

మారియమ్మన్‌ టెంపుల్‌

[మార్చు]

టౌన్‌ మధ్య భాగంలో ఈ మరియమ్మన్‌ (మారెమ్మ) గుడి ఉంది. ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల కిందటిదిగా చెబుతారు. ఈ దేవాలయంలో మాసి (మాఘ) రథోత్సవం ప్రధాన వేడుక. ప్రతి రోజూ పూజలు ఉ. 6 గం నుండి రాత్రి 8 గం. వరకు నిర్వహిస్తారు.

మాసాని అమ్మన్‌ తిరుకోయిల్‌

[మార్చు]

ఈ గుడిలో మాసాని అమ్మన్‌ ప్రధాన దేవత. ఈ దేవత సర్ప శరీరం కలిగి వుంటుంది. ఈ గుడి పొళ్ళాచ్చికి 24 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు దేవుడు సరిగ్గా మూడు వారాలలో తమ కోరికలు విని తీరుస్తాడనే నమ్మకం ప్రబలంగా ఉంది. మంగళ, శుక్ర వారాలు ప్రధానం. ఆలయం మధ్య భాగంలో మాసాని అమ్మన్‌ పెయింటింగ్‌ వుంటుంది. ఈ టెంపుల్‌, రాజు మాసాన్‌కు చెందిన ఒక మామిడి చెట్టు నుండి ఒక మామిడి పండు తిన్న ఒక బాలిక పేరు పై నిర్మించబడింది. స్థానికులు తర్వాత ఆ బాలికను మాసాని అమ్మన్‌గా పూజించారు. ఇతిహాసం మేరకు శ్రీరాముడు సీత కొరకు అన్వేషించేటపుడు ఈ గుడిని సందర్శించాడని అక్కడ ధ్యానం చేసాడని చెపుతారు.

ఉడుమాల్‌ పేట

[మార్చు]

ఈ ప్రదేశం పొళ్ళాచ్చికి 24 కిలోమీటర్ల దూరంలో కల దు. ఉడుమాల్‌ పేట పొళ్ళాచ్చికి జంట నగరం. ప్రకృతి అందాలు, అనేక గుళ్ళు... అనగా ప్రసన్న వినాయకుని గుడి, మరియమ్మ టెంపుల్‌, కామాక్షి అమ్మవారి గుడి మొదలైన వాటితో పాటు తిరుమూర్తి ఆనకట్ట, అమరావాతి ఆనకట్ట, కాదంబరి ఆనకట్ట వంటి ఆనకట్టలతో ఈ ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పొల్లాచి&oldid=3572313" నుండి వెలికితీశారు