పాల్ఘాట్ మణి అయ్యర్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పాల్గాట్ టి.ఎస్.మణి అయ్యర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1912 పలక్కాడ్,కేరళ,భారతదేశం |
మూలం | భారతదేశము |
మరణం | 1981 (వయస్సు 69) |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | మృదంగ కళాకారుడు |
వాయిద్యాలు | మృదంగం |
పాల్గాట్ టి.ఎస్.మణి అయ్యర్ (1912–1981) కర్ణాటక రంగ క్షేత్రంలో ప్రఖ్యాత మృదంగ కళాకారుడు. భారత ప్రభుత్వం నుండి సంగీత కళానిథి, పద్మభూషణ అవార్డులను పొందిన మొదటి మృదంగ కళాకారుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ కి చెందిన కల్పతి గ్రామంలో 1912 లో జన్మించారు. ప్రారంభంలో ఆయన పాల్గాట్ సుబ్బయ్యర్, కల్పతి విశ్వనాథ అయ్యర్, తంజావూరు వైద్యనాథ అయ్యర్ ల వద్ద విద్యాభ్యాసం చేసారు. ఆయన మద్రాసులో "చెంబై వైద్యనాథ భాగవతార్" యొక్క కచేరీలో పాల్గొని సంగీత కచేరీల ప్రస్థానాన్ని ప్రారంభించారు.
వృత్తి
[మార్చు]మణి అయ్యర్ ఈ ప్రాంతంలో ప్రసిద్ధ సంగీత స్వర కళాకారుడు. ఆయన అనేక మంది మృదంగ విద్వాంసులైన కీ.శే పాల్గాట్ ఆర్.రఘు, కీ.శే మావెల్లిక్కర వేలుకుట్టి నాయర్, ఉమయాల్పురం కె.శివరామన్, కమలాకర రావు, పాల్గాట్ సురేశ్, ఆనంద్ సుబ్రహ్మణ్యం లకు గురువు. ఆయన జిడ్డు కృష్ణమూర్తి చే ప్రారంభించబడిన ఋషి వ్యాలీ స్కూల్ లో విద్యార్థులకు మృదంగ పాఠాలు బోధించేవారు.
ఆయన కళాకారునిగా ప్రవేశం చేయని కాలంలో ముగ్గురు మృదంగ కళాకారులు "నాగర్‌కోయిల్ ఎస్.గణేశ అయ్యర్", "అలగంబి పిళ్ళై", "దక్షిణామూర్తి పిళ్ళై"లు కళపై ఆధిపత్యం వహించేవారు. మణి అయ్యర్ ప్రవేశం తరువాత ఆయన చేసిన నూతన ప్రక్రియల ములంగా మృదంగ వాద్య శైలి మారింది.
మణి అయ్యర్ యొక్క శిష్యుడు పాల్గాట్ ఆర్.రఘు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన ప్రముఖ సంగీత విద్వాంసురాలు లలితా శివకుమార్‌కు తండ్రి, ప్రసిద్ధ గాయని నిత్యశ్రీ మహదేవన్‌కు తాతగారు.
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1912 జననాలు
- 1981 మరణాలు
- మృదంగ వాద్య కళాకారులు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు