నిత్యశ్రీ మహదేవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిత్యశ్రీ మహదేవన్
వ్యక్తిగత సమాచారం
జననం (1973-08-25) 1973 ఆగస్టు 25 (వయసు 51)
మూలంతిరువాయూరు,తమిళనాడు,ఇండియా
సంగీత శైలికర్ణాటక సంగీతం- భారతీయ శాస్త్రీయ సంగీతం, ప్లేబ్యాక్ సింగర్
వృత్తిగాయకురాలు
క్రియాశీల కాలం1987 – ప్రస్తుతం
లేబుళ్ళుHMV, EMI, RPG, AVM Audio, Inreco, Vani, Amutham Music, Charsur Digital Workshop, Carnatica, Rajalakshmi Audio etc.

నిత్యశ్రీ మహదేవన్ (జ. 1973 ఆగష్టు 25) (ఎస్.నిత్యశ్రీగా సుపరిచితులు) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతీయ సినిమా ప్లేబ్యాక్ సింగర్. ఆమె భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా తన సంగీత ప్రదర్శనలనిచ్చింది. ఆమె అనేక అవార్డులు, గౌరవసత్కారాలు పొందింది. ఆమె 500కి పైగా ఆల్బమ్స్ విడుదల చేసింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్ మనుమరాలైన నిత్యశ్రీ ప్రఖ్యాత గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

ఆమె ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచిన తమిళ చిత్రం "జీన్స్"లో ప్లేబ్యాక్ సాంగ్ పాడడం ద్వరా గుర్తింపు పొందారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె ఆగష్టు 25 1973 న లలితాశివకుమార్, శివకుమార్ దంపతులకు జన్మించింది. శివకుమార్ యొక్క తల్లి డి.కె.పట్టమ్మాళ్ ప్రముఖ సంగీత విద్వాంసురాలు[2]. ఈమె మొదటి గురువు తన తల్లి, సంగీత విద్వాంసురాలైన లలితా శివకుమార్. నిత్యశ్రీ కుటుంబం సంగీతజ్ఞుల కుటుంబం. తన తల్లి లలితా శివకుమార్, నాయనమ్మ డి.కె.పట్టమ్మాళ్, నాయనమ్మ సోదరుడు ‎డి.కె.జయరామన్[3]లు సంగీత విద్వాంసులు. ఆమె తల్లి యొక్క తండ్రి (తాతగారు) మృదంగ విద్వాంసులు పాల్గాట్ మణి అయ్యర్[4]

నిత్యశ్రీ మొట్టమొదట సంగీతాన్ని తన తల్లి లలితా శివకుమార్ వద్ద నేర్చుకుంది.[3][5] నిత్యశ్రీ తన నాయనమ్మ డి.కె.పట్టమ్మాళ్ యొక్క శిష్యురాలు.[6] ఆమె తండ్రి కూడా ప్రముఖ మృదంగ విద్వాంసుడు, తన తాతగారైన పాల్గాట్ మణి అయ్యర్ యొక్క శిష్యులు. వీరి ప్రోత్సాహంతో ఆమె కర్ణాటక సంగీతాన్ని అభ్యసించింది.[7] నిత్యశ్రీ తన మేనకోడలు, శిష్యురాలు అయిన లావణ్యా సుందరరామన్తో కలసి కొన్ని కచేరీలను చేసింది.[8][9]

ఆమె వి.మహదేవన్ అనే మకానికల్ ఇంజనీరుని వివాహమాడారు. ఆయన 2012 లో మరణించారు.[10] ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారు తనుజశ్రీ, తేజశ్రీ.[4][11] వారు కూడా తన తల్లితో కలసి కచేరీలలో పాల్గొంటున్నారు.[12] వారు మొదటి ప్రదర్శనను టెలివిజన్ షో అయిన "ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ జూనియర్"లో అతిథి పాత్రలో యిచ్చారు.

సంగీత ప్రస్థానం

[మార్చు]

మొదటి ప్రదర్శన

[మార్చు]

నిత్యశ్రీ మొదటి కర్ణాటక సంగీత కచేరీ ప్రదర్శన తన 14 వ యేట జరిగింది.[5] ఆమె సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల వరకు కచేరీని ఆగష్టు 10 1987లో యూత్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ ఆధ్వర్యంలో చేసారు. ఆ కచేరీలో డి.కె.పట్టమ్మాళ్, డి.కె.జయరామన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.[13]

ఇతివృత్త ప్రదర్శనలు

[మార్చు]

ఆమె భారత 50 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాలతో కూడుకొని ఉన్న సంగీత కచేరీలను యిచ్చారు. డి.కె.జయరామన్, డి.కె.పట్టమ్మాళ్ లు తమ గురువు అయిన పాపనాశం శివన్ యొక్క కూర్పులతో ప్రాచుర్యంలోకి వచ్చారు. నిత్యశ్రీ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది.

బిరుదులు, అవార్డులు, యితర గుర్తింపులు

[మార్చు]

నిత్యశ్రీ ఆకాశవాణిలో టాప్ ర్యాంకు గ్రేడు ఆర్టిస్టు.[5] and All India Radio, Chennai.[6] ఆమె మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుండి 6 సంవత్సరాలకు "బెస్టు కన్‌సెర్ట్ అవార్డు" పొందారు.[5] ఆమె కలామమని అవార్డును తమిళనాడు ప్రభుత్వం నుండి పొందారు. అనేక బిరుదులు అవార్డులను పొందారు.

Year సత్కారం అందజేసినవారు మూలం
1987 బెస్టు మైన్ ఆర్టిస్టు అవార్డు YACM
1989 పాపనాశం శివన్ తంబురా ప్రైజ్ [14]
1990 ఎ.ఐ.ఆర్ మ్యూజిక్ పోటీలో మొదటి బహుమతి ఆల్ ఇండియా రేడియో
1990 "బెస్టు ప్రోమిసింగ్ ఆర్టిస్టె" మోహనం మహారాజపురం సంతానం ట్రస్టు
1994 "యువ కళా భారతి" భారత్ కలచార్ [6]
1994 "ఇన్నిసాయి మమని" తెమిళనాడు గుడ్‌విల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ [6]
నేషనల్ యూనిటీ సెంటర్ అవార్డు [14]
బెస్టు పల్లవి మ్యూజిక్ రిసైటర్ అవార్దు [14]
1996 ఎం.ఎల్.వసంతకుమారి మెమోరియల్ అవార్డు మైలాపూర్ అకాడమీ
1999 "నాదభూషణం" షణ్ముఖానంద సంగీత సభ (న్యూఢిల్లీ)
1999 "ఉగాది పురస్కారం" మద్రాసు తెలుగు అకాడమీ
1999 "సునధవినోధిని" స్వామీ ఓంకారానంద
1999 "బాలరత్న" బాల త్రిపుర సుందరి ట్రస్టు నెమిలి
1999 "గానామృతవాణి" ఆల్ సెలూన్ హిందూ కాంగ్రెస్ (కొలంబో)
1999 కన్నదాసన్ అవార్డు [14]
1999 కలాయిగ్నర్ అవార్డు [14]
2000 కళామమని తమిళనాడు ప్రభుత్వం [15]
2000 మెల్విన్ జోన్స్ అవార్డు లయన్స్ క్లబ్, చెన్నై
2000 "సంగీత శిఖామణి" మద్రాసు తెలుగు అసోసియేషన్
2001 "ఇసై పెరోలి", అవార్దు కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ [16]
2001 వాణీ కళా సుధాకర అవార్డు శ్రీ త్యాగబ్రహ్మ గాన సభ, 2001 డిసెంబరు 10 [17]
2001 దేశీయ ఓరుమైపాడు మైయం అవార్డు
2001 "నవరస గాన నాయకి " తమిళ ఆన్మీగ పెరవై
2002 "ఉధవం ఓలీ" వసంత మెమోరియల్ ట్రస్టు కోయంబత్తురు
2002 శివాజీ అవార్డు
2002 "సంగీత ప్రరబ్రహ్మ రత్న" కంచి కామకోటి పీఠం [14]
2003 షణ్ముఖ శిఖామణీ అవార్డు షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ (ముంబయి)
2003 ఎక్స్‌లెన్స్ అవార్డు రోటరీ క్లబ్
2004 "Isai Mani Makutam" Rajalakshmi Fine Arts Coimbatore
2004 "పద్మసాధన" (Title) పద్మ సారంగపాణి కల్చరల్ అసోసియేషన్.చెన్నై [18]
2006 "Tamil Isai Vani" Dubai Tamil Kudumbam
2006 "Isai Kalai Tharakai" Canberra Music Association
2006 "Naadha Kovidha" (Title) Naadhabrahmam (conferred by Madras High Court judge, Justice M. Chockalingam on 26 December 2006 in Chennai) [19]
2008 Jayarathna Virudhu Award Jayadhaarini Trust (conferred on 22 October 2008 in Chennai) [20]
2008 Honorary Doctorate of Literature Sathyabama Autonomous University on 19 April 2008 [21]
2008 "Sangeetha Kala Shironmani" Nungambakkam Cultural Academy
2010 "Gaana Padmam" Award (and Title) Brahma Gana Sabha, presented on 3 December 2010 in Chennai [22][23]
2010 "Sangeetha Kalasarathy" Award (and Title) Parthasarathy Swami Sabha, presented on 15 December 2010 in Chennai [24]
2010 Acharya Award Naradha Gana sabha (Celebrating Teachers Day)
2011 Sangeetha Hamsa Award Hamsavinodhini, presented on 1 December 2011 at Arulmigu Kasi Viswanathar Temple, West Mambalam. [25]
2011 "Isai Mamani" Award Shri Rama Bhaktha Jana Samaj, presented on 20 December 2011 [26]
2011 P. Obul Reddy Award of Excellence Bharathiya Vidya Bhavan, Chennai
2012 "M. S. Subbulakshmi Puraskar" Visakha Music Academy, presented on 12 January 2012 [27]
2012 Award Of Proficiency Tamil Nadu Brahmins Association (TAMBRAS)
2013 "Sangeetha Ulagin Naayaki" Aadhi Shankarar Aanmeega Peravai at Kutthalam
2013 "Sivan Isai Selvi" (Title) Papanasam Sivan Rasigar Manram (conferred by vocalist P. S. Narayanaswamy in September 2013 at Narada Gana Sabha in Chennai) [28]
2014 Isai Selvam Award Presented by Karunanidhi under the banner of Muthamizh Peravai on 24 January 2014 in Chennai [29]

మూలాలు

[మార్చు]
  1. Methil Renuka (2000). "Keeping tune with times". India Today. 25. Thomson Living Media India Limited: 292.
  2. "The Hindu : Tamil Nadu / Coimbatore News : D.K. Pattammal's biography to be released". The Hindu. 20 November 2007. Archived from the original on 1 డిసెంబరు 2007. Retrieved 6 May 2010.
  3. 3.0 3.1 Aruna Chandaraju (20 May 2005). "The Hindu : Entertainment Bangalore / Music : Proud pedigree is not all". The Hindu. Archived from the original on 16 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014.
  4. 4.0 4.1 "Singer Nithyasree's husband ends life by jumping in river – The Times of India". Times of India. 21 December 2012. Retrieved 18 April 2014.
  5. 5.0 5.1 5.2 5.3 M.K.Balagopal (6 November 2003). "The Hindu : A masterly performance". The Hindu. Archived from the original on 31 డిసెంబరు 2003. Retrieved 21 April 2014.
  6. 6.0 6.1 6.2 6.3 "The Hindu : Retail Plus Hyderabad : Audio Release". The Hindu. 17 October 2008. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 16 April 2014.
  7. Rayan Rozario (30 June 2003). "The Hindu : Singing soothing notes". The Hindu. Archived from the original on 11 ఆగస్టు 2010. Retrieved 16 April 2014.
  8. Bhanu Kumar (23 July 2011). "Blooming bud – Mumbai Mirror". Mumbai Mirror. Retrieved 20 March 2015.
  9. "The Hindu: An Evening of Melody". The Hindu. 20 March 2009. Retrieved 16 April 2014.
  10. "A big shock to music lovers – The Hindu". The Hindu. 21 December 2012. Retrieved 16 April 2014. {{cite news}}: Cite uses deprecated parameter |authors= (help)
  11. Rajagopalan Venkataraman (21 December 2012). "Pall of gloom descends on Kotturpuram – The New Indian Express". New Indian Express. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 16 April 2014.
  12. B. Ramadevi (21 December 2012). "The Hindu : Friday Review Chennai / Music : Deluge of ragas and songs". The Hindu. Archived from the original on 22 ఆగస్టు 2010. Retrieved 16 April 2014.
  13. "Jaya TV's Margazhi Mahautsavam". season 2007. 31 December 2007. Jaya TV. Maximum Media. 
  14. 14.0 14.1 14.2 14.3 14.4 14.5 Sarath Malalasekera (24 August 2002). "Online Edition of Daily News". The Associated Newspapers of Ceylon Ltd. Retrieved 28 December 2014.
  15. SVK (4 February 2000). "The Hindu : An atmosphere of tranquillity". The Hindu. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 18 April 2014.
  16. "The Hindu : Nithyashree awarded 'Isai Peroli'". The Hindu. 2 December 2001. Archived from the original on 21 ఏప్రిల్ 2014. Retrieved 20 April 2014.
  17. "Nithyashree honoured again". Kutcheri Buzz. 11 December 2001. Retrieved 26 March 2003.
  18. "The Hindu : 'Padma Sadhana' conferred on Nithyasree". The Hindu. 4 January 2004. Archived from the original on 16 జనవరి 2004. Retrieved 18 April 2014.
  19. "Title conferred on Nithyasree – The Hindu". The Hindu. 27 December 2006. Retrieved 18 April 2014.
  20. "JAYADHARINI TRUST". Jayarathna Awardees. Jayadharini Trust. Archived from the original on 9 అక్టోబరు 2013. Retrieved 18 April 2014.
  21. "Awards". Sathyabama University. Archived from the original on 30 మార్చి 2014. Retrieved 21 April 2014.
  22. "Award for Nithyashri Mahadevan". Lakshman Shruthi. 4 December 2010. Archived from the original on 21 ఏప్రిల్ 2014. Retrieved 21 April 2014.
  23. Chennai December Season 2010 : Brahma Gana Sabha opens its new 'season'
  24. "The Hindu : Tamil Nadu / Chennai News : Awards humble me, says Nithyasree Mahadevan". The Hindu. 18 December 2010. Archived from the original on 21 డిసెంబరు 2010. Retrieved 21 April 2014.
  25. "Hamsavinodhini Award for Nithyasree" (PDF). Mambalam Times. 26 November 2011. p. 3. Retrieved 18 April 2014.
  26. "Music Season 2010–2011 – Sri Rama Bhaktha Jana Samaj". Indian Heritage – December Madras (Chennai) Music Season. Saigan Connection. Retrieved 18 April 2014.
  27. Sruti, india's premier music and dance magazine (329): 49. February 2012.
  28. B. Vijayalakshmi (19 September 2013). "Nithyasree 'blessed' by saint-composer". Deccan Chronicle. Archived from the original on 18 ఏప్రిల్ 2014. Retrieved 18 April 2014.
  29. "Navigating party through tempests: Karunanidhi – The Hindu". The Hindu. 24 February 2014. Retrieved 21 April 2014.

ఇతర లింకులు

[మార్చు]