పాంచజన్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పై చేతిలో పాంచజన్యం ధరించిన విష్ణువు

పాంచజన్యం శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధములలో ఒకటి. మహావిష్ణువు ధరించే శంఖమును పాంచజన్యము అని అంటారు[1].

విశేషాలు[మార్చు]

శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. ద్వాపర యుగంలో బలరాముడు, కృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసిన సమయంలో ఒక సారి సాందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేయుచుండగా కెరటాల ఉధృతి వలన సముద్రము లోకి కొట్టుకు పోయెను . ఆతడిని పంచజనుడు అను రాక్షసుడు మింగివేసాడు. గురు పుత్రుడు ఆ రాక్షసుని శరీరము నందున్న శంఖము లోకి ప్రవేశించెను. బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణగా అతని పుత్రుడుని తీసుకు రావాలని తలచి, గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా సముద్రుడు పంచజనుడు గురు పుత్రుడిని మింగెనని చెప్పెను. అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును ఉదేను. ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీ కృష్ణుని చూసి వచ్చినపని తెలుపమని కోరగా శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను అప్పుడు యముడు గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించెను . శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించెను . పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించెను.[2]

మూలాలు[మార్చు]

  1. "*📖 మన ఇతిహాసాలు 📓* *పాంచజన్యము అంటే ఏమిటి?* ప - ధర్మ సందేహాలు". mymandir. Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-11.
  2. "latelugu.com - పాంచజన్యం". www.latelugu.com. Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-11.

బాహ్య లంకెలు[మార్చు]