సోమంచి వాసుదేవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమంచి వాసుదేవరావు(16 నవంబర్ 1902 - 27 సెప్టెంబర్ 1965)

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నకు చెందిన కవి.

తల్లిదండ్రులు

సోమంచి వాసుదేవరావు కోదండరామయ్య, సూరమ్మ దంపతులకు జన్మించారు. కోదండరామయ్య వేద విద్యా పండితులు, సూరమ్మ గృహిణి. కోదండరామయ్యకు భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి (వరహావెంకటగిరి) సమీపబంధువు.

కుటుంబవిశేషాలు

కోదండరామయ్య సూరమ్మ దంపతులకు ఐదుగురి సంతానంలో మొదటివాడు వెంకటనారాయణ తరువాత సోమంచి వాసుదేవరావు రెండవవాడు. తరువాత ముగ్గురు సోదరులు శివరామమూర్తి, నరసింహమూర్తి, కృష్ణమూర్తి, మరియు ఒక సోదరి పార్వతి.

జన్మస్థలం

కోదండరామయ్య ప్రస్తుత శ్రీకాకుళం నగరం సమీపంలో గల రాగోలు పంచాయతీకి చెందిన గ్రామం రాయపాడుకు చెందినవారు. తరువాత కాలంలో కోదండరామయ్య శ్రీకాకుళంలో కానుకుర్తివారివీధికి నివాసం మారారు. సోమంచి వాసుదేవరావు బాల్యం, యవ్వనం మిగిలిన జీవితమంతా అక్కడే గడిచింది.

వివాహం మరియు సంతానం

సోమంచి వాసుదేవరావు కు శ్రీకాకుళం జిల్లాలోని మురపాక సమీప గ్రామమైన చెల్లాయమ్మ అగ్రహారానికి చెందిన అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటరమణ మూర్తి మరియు శ్రీ వెంకటేశ్వరులు.

రచనలు[మార్చు]

 1. సౌందర్యలహరి, శంకర భగవత్పాదుల విరచితం - ఆంధ్రీకరణ/ తెలుగు అనువాదం : సోమంచి వాసుదేవరావు, ప్రచురణ: శ్రీ కోరంగి ఆయుర్వేదీయ ముద్రాక్షరశాల, జగన్నాధపురం కాకినాడ,1936.
 2. శివానందలహరి , శంకర భగవత్పాదుల విరచితం - ఆంధ్రీకరణ/తెలుగు అనువాదం: సోమంచి వాసుదేవరావు, ప్రచురణ: శ్రీరామకృష్ణ ప్రింటింగ్ వర్క్స్, చికాకోల్ ( ప్రస్తుత శ్రీకాకుళం) వైజాగ్ జిల్లా1936.
 3. స్తుతిరత్నమాలిక, ప్రచురణ: ఉత్తరాంధ్ర ముద్రణాలయం శ్రీకాకుళం శాలివాహన శకం 1883 ప్లవ సంవత్సరం 1961 జూలై.
 4. శ్రీ నిర్వచన సుందరకాండ , ప్రచురణ: శ్రీ కృష్ణా పవర్ ప్రెస్ విజయనగరం - శాలివాహన శకం 1883 నవంబర్ 1961.
 5. సమీర సందేశం, ప్రచురణ: శ్రీ వెంకటరమణ ముద్రణాలయం, శ్రీకాకుళం, శాలివాహన శకం 1884 శుభకృత నామ సంవత్సరం, మార్చి, 1963.
 6. శ్రీ శివస్తుతి నవగ్రహ స్తోత్రములు, ప్రచురణ: విజయలక్ష్మి ప్రింటింగ్ వర్క్స్, శ్రీకాకుళం,1964 - ( తే 21-05-1964 దీన శ్రీకాకుళంలోని నాగావళి నదీతీరాన వెలసియున్న ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి అలయమున ధ్వజస్థంభము మరియు నవగ్రహమండపముల ప్రతిష్ట సందర్భముగా ఆవిష్కరించబడిన గ్రంధము)
 7. శ్రీ వెంకటేశ్వరస్తవము
 8. శ్రీ కిష్కింధకాండము, శ్రీ విజయలక్ష్మి ప్రింటింగ్ వర్క్స్, శ్రీకాకుళం, శాలివాహన శకం, 1887, విశ్వావసు సంవత్సరం, జనవరి 1965.
 9. కర్ణుడు-గాంధారీ నిర్వేదనము[1][2]

పాఠ్యగ్రంథాలుగా రచనలు

వాసుదేవరావు సంస్కృతం నుండి తెలుగు లోకి అనువదించిన శివానందలహరి ని ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు 1934 సంవత్సరంలో పాఠ్యగ్రంధంగా నిర్ణయించారు. ఈయన రచించిన సమీరసందేశంను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి వారు తెలుగు ఉపవాచకంగా 1968 లో నిర్ణయించారు.

మూలాలు[మార్చు]

 1. "పుట:Bhaarati sanputamu 3 sanchika 8 aug 1926.pdf/125 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2019-06-14.
 2. కాశీనాథుని నాగేశ్వరరావు(సం.) (1926). భారతి (మాస పత్రిక) (1926 ఆగస్టు సంచిక).
 3. శివానందలహరి https://ia801607.us.archive.org/22/items/in.ernet.dli.2015.331975/2015.331975.Shivaanandalahari.pdf

వనరులు[మార్చు]

 1. www.gpedia.com/te/m/gpedia లింకులో 41 వ పేరు సౌందర్యలహరి/సోమంచి వాసుదేవరావు
 2. 'నేనే శ్రీకాకుళం' శ్రీకాకుళం జిల్లా స్వర్ణోత్సవ సంచిక, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ, శ్రీకాకుళం, 2000.
 3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఆరుద్ర 11వ సంపుటి.
 4. దేవులపల్లి శేష భార్గవి, 'శతక సాహిత్యం -2' భాష, తేటగీతి ఆన్ లైన్ తెలుగు పత్రిక, http://www.thetageethi.org/s35.html