లోకనాథం నందికేశ్వరరావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లోకనాధం నందికేశ్వరరావు
LOKANADAM NANDIKESWARARAO
200px
లోకనాధం నందికేశ్వరరావు
జననం లోకనాధం నందికేశ్వరరావు
(1952-07-25) 25 జూలై 1952 (వయస్సు: 65  సంవత్సరాలు)
బాదులపేట,కలెక్టరు బంగ్లా దరి
శ్రీకాకుళంపట్టణం,
శ్రీకాకుళం జిల్లా
నివాస ప్రాంతం బాదులపేట,కలెక్టరు బంగ్లా దరి
శ్రీకాకుళంపట్టణం,
శ్రీకాకుళం జిల్లా
ఇతర పేర్లు మిమిక్రీ నందికేశ్వరరావు
వృత్తి చిత్రలేఖనోపాధ్యాయుడు
ఉద్యోగం విశ్రాంత చిత్రలేఖనోపాధ్యాయుడు
ప్రసిద్ధి మిమిక్రీ కళాకారుడు
వెంట్రిలాక్విజం కళాకారుడు
మతం హిందూ
పిల్లలు లేరు
తండ్రి రామలింగేశ్వరస్వామి
తల్లి అన్నపూర్ణ

లోకనాథం నందికేశ్వరరావు ఉత్తారాంధ్ర కు చెందిన మిమిక్రీ కళాకారుడు. [1] సంప్రదాయ కళల్లో మిమిక్రీ ఒకటి. ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి పరవశులను చేసింది ఈ కళ. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించిన మొదటి వ్యక్తి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి శ్రీకాకుళమునకు చెందిన లోకనాథం నందికేశ్వర రావు( Lokanatham Nandikeswararao) .నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు. దేశంలో ఆయన యిప్పటి వరకు సుమారు ఐదు వేల ప్రదర్శనలిచ్చారు. తన విజయాల వెనుక తన భార్య హిమాలయ కుమారి సహకారం ఎంతో ఉందని చెప్పుకునే ఆయన వృత్తి రీత్యా చిత్రలేఖనోపాధ్యాయులు. 1979 లో వీరఘట్టం ఉన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఆయన కింతలి, కోటబొమ్మాళి, లోలుగు, కింతలి, తొగరాం ఉన్నతపాఠశాలలలో పనిచేసి 2009 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూసిపేట నందు పదవీవిరమణ చేసారు.

బాల్యం,విద్యాభ్యాసం '[మార్చు]

పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో లోకనాథం రామలింగేశ్వర స్వామి, అన్నపూర్ణ దంపతులకు(జూలై 25,1952) ప్రముఖ మిమిక్రీ కళాకారులు నందికేశ్వరరావు జన్మించారు. తన తండ్రి నాటక రంగంలో ఉండేవారు. ప్రాథమిక విద్య స్థానిక బాదుల పేటలోను, ఉన్నత విద్య శ్రీకాకుళం మ్యునిసిపల్ ఉన్నత పాఠశాలలోను, బి.కాం డిగ్రీని ఆర్ట్స్ కాలేజినందు అభ్యసించి కాకినాడ నందు డ్రాయింగ్ నందు శిక్షణ పొందారు.

మిమిక్రీ కళాకారునిగా[మార్చు]

దస్త్రం:Nanndikeswararao felicitation by S.P.balasubhramanyam.jpg
ప్రముఖ గాయకుదు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో

పాఠశాల వయస్సు నుండే నందికేశ్వర రావుకు మిమిక్రీ పట్ల ఆసక్తి కలిగింది. రక్తకన్నీరు నాటకంలో ప్రముఖ నటుడు నాగభూషణం డైలాగులను అనుకరించటం ద్వారా తన కళాప్రస్థానాన్ని ప్రారంభించారు. పాఠశాలలో పక్షులు, జంతువులు, వాహనాల శబ్దాలను అనుకరిస్తూ ఉపాద్యాయుల మన్ననలు పొందారు. 1971 లో విశాఖకు చెందిన గణపతి రాజు రామరాజు సలహా మేరకు ఆయన మిమిక్రీ కళపై పూర్తి స్థాయి దృష్టి సారించారు. సినిమా థియేటర్లకు వెళ్ళి డైలాగులు వినటం, అనుకరించటం అలవాటుగా మార్చుకున్నారు. తెలుగు భాషపై పట్టు ఉంటే మరింత రాణించవచ్చనే మిత్రుల సలహా మేరకు ఆయన తెలుగు భాషపై పట్టు సాధించారు. అలాగే వెంట్రిలాక్విజం నేర్చుకొని కృష్ణా జిల్లావరకు ప్రదర్శనలిచ్చారు. రచయితగా, నటుడిగా, చిత్రకళోపాధ్యాయునిగా, ప్రసిద్ధ ధ్వన్యనుకరణ కళాకారునిగా పేరు పొందిన నందికేశ్వర రావు డా.నేరెళ్ళ వేణుమాధవ్ స్ఫూర్తితో స్వర మాంత్రికుని ఏకలవ్య శిష్యునిగా పదిహేనేళ్ళ ప్రాయంలోనే ధ్వనులను అనుకరించటం ప్రారంభించారు. పాత శ్రీకాకుళంలో తన యింటి దరి చెట్లపై పొద్దున్నే పక్షుల కిలకిల రావాలను పరిశీలన చేసేవారు. నిరంతర సాధనతో మిమిక్రీ కళాకారునిగా పేరుపొంది ఎందరో శిష్యులను తయారు చేసారు. ఆయనకు మిమిక్రీ శ్రీనివాస్, సూర్యారావు లతో బాటు అనేక మంది శిష్యులున్నారు.

సాధించిన విజయాలు, సన్మానాలు, సత్కారాలు[మార్చు]

 • 1984 లో తొలిసారి జాతీయ కళాకారునిగా గుర్తింపు పొందారు.
 • సిమ్లాలో ప్రదర్శన నిస్తుండగా అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతీయ కల్చరల్ అసోషియేషన్ సభ్యునిగా నియమించారు.
 • ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు, రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు అందుకున్నారు.
 • మిమిక్రీ కళను క్యాసెట్ల ద్వారా ప్రజలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఆయన. 22 క్యాసెట్లను వివిధ ప్రక్రియలలో చేసి విడుదల చేసారు.
 • ఆంధ్ర, ఒడిషా, తమిళనాడు, కేరళ, భూపాల్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హిమాచల ప్రదేశ్ లలో తన ప్రదర్శనలిచ్చారు.
 • మాజీ ముఖ్య మంత్రి.ఎన్.టి.రామారావు చే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర కళాకారునిగా సత్కారం పొందారు.
 • జిల్లాలో పలు సంస్థలు ఆయనకు అనేక సార్లు అవార్డులనిచ్చి సత్కరించాయి.
 • ఆలిండియా రేడియోలో అనేక ప్రదర్శనలిచ్చారు.
 • క్లియోపాత్రా నాటకంలోని ఏంటొని స్పీచ్ ను తన అనుకరణ ద్వారా ప్రేక్షకులకు వినిపించటమే కాక క్యాసేట్ కూడా తయారు చేసారు.
 • పలు సాంఘిక నాటకాలలో నటించి తన ప్రతిభను చాటుకున్నారు.
 • ఎనిమిదవ తరగతి లో ఉండగానే 'విముక్తులు ' అనే నాటకంలో నటించి ఉత్తమ బాల నటుని అవార్డును స్వతం చేసుకున్నారు.
 • ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు, నారా చంద్రబాబునాయుడుల ద్వారా అనేక సార్లు సన్మానించ బడ్డారు.
 • అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముదబెన్ జోషి చేతుల మీదుగా సన్మానించ బడ్డారు.
 • అప్పటి కేంద్ర మంత్రి కె.యర్రంనాయుదు చెతుల మీదుగా సన్మానించ బడ్డారు.
 • అనకాపల్లి, రాజమండ్రి, పొద్దుటూరు, హైదరాబాద్ సభలలో ఆయనకు బంగారు పతకాలు వచ్చాయి.
 • తన ప్రదర్శనలలో జాతర, ట్రిపుల్ మ్యూజిక్, ఓంకారం, రుద్రవీణ, రామాయణ మహాభారత యుద్దాల ప్రక్రియలు అనేక అవార్డులు తెచ్చి పెట్టాయి.
 • ఆయన 'నవ్వుల పల్లకి ' అనే టెలిఫిలిం ను రచించి, నిర్మించి నటించారు. ఇది స్థానిక సిటి కేబుల్ ద్వారా ప్రదర్శించ బడింది.
 • ఆయన రచించిన ' అక్షరం శరణం గచ్చామి" అనే టెలి ఫిలిం డి.డి.1 ద్వరా ప్రదర్శించబడింది.
 • ఆయన నిర్మించిన 'ప్రగతికి పంచ సూత్రాలు ' అనే టెలిఫిలిం స్థానిక సిటి కేబుల్ ద్వారా ప్రదర్శించ బడింది.
 • ఆయనకు పిల్లలంటే ఎంతో యిష్టం. ఆ మమకారంతోనే పిల్లలను నవ్వించి వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి 2003 లో స్థానిక రివర్ వ్యూ పార్క్ వద్ద చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ ను ఏర్పాటు చేసారు.
 • 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉగాది పురస్కారం.[2]

చిన్నప్పటి నుండే[మార్చు]

పాఠశాల వయస్సు నుండే నందికేశ్వరరావుకు మిమిక్రీ కళపై ఆసక్తి కలిగింది. రక్తకన్నీరు నాటకంలో నటుడు నాగభూషణం డైలాగులను అనుకరించడం ద్వారా తన కళా ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాలలో పక్షులు,జంతువులు,వాహనాల శబ్దాలను అనుకరిస్తూ ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. 1971 లో విశాఖకు చెందిన గణపతిరాజు రామరాజు సలహా మేరకు ఆయన మిమిక్రీ పై పూర్తి స్థాయి దృష్టి సారించారు. సినిమా ధియేటర్లకు వెళ్ళి డైలాగులు వినడం వాటిని అనుకరించడం అలవాటుగా మార్చుకున్నారు. తెలుగు భాషపై పట్టుంటే మరింత రాణించ వచ్చునన్న సూచన మేరకు భాష నేర్చుకున్నారు. అలాగే వెంట్రిలాక్విజం నేర్చుకొని కృష్ణా జిల్లా వరకు ప్రదర్శన లిచ్చారు. రచయితగా,నటుడిగా,చిత్రకళోపాధ్యాయునిగా,ప్రసిద్ధ ధ్వన్యనుకరణ కళాకారునిగా పేరుపొందిన నందికేశ్వరరావు డా.నేరెళ్ళ వేణుమాధవ్ స్ఫూర్తితో స్వర మాంత్రికుని ఏకలవ్య శిష్యునిగా పదిహెనేళ్ళ ప్రాయంలోనే ద్వనులను అనుకరించడం ప్రారంభించారు.పాత శ్రీకాకుళంలో తన ఇంటి దరి చెట్లపై పొద్దున్నే పక్షుల కిలకిల రావాలను పరిశిలన చేసేవారు.నిరంతర సాధనతో మిమిక్రీ కళాకారునిగా పేరు పొంది ఎందరో శిష్యులను తయారు చేసారు. మిమిక్రీ శ్రీనివాస్,సూర్యారావుతో బాటు అనేక శిష్యులున్నారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]