తొగరాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తొగరాం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం ఆముదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,584
 - పురుషుల సంఖ్య 782
 - స్త్రీల సంఖ్య 802
 - గృహాల సంఖ్య 435
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తొగరాం గ్రామము.[1], ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లలో ఉంది.

గ్రామ విశేషాలు[మార్చు]

ఇది శ్రీకాకుళం (పట్టణం) నకు 15 కి.మీ దూరంలో గలది. ఈ గ్రామము.[1] నాగావళి నది తీరంలో గలదు. [1] ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుర్వేద ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఈ గ్రామము.[1]లో వెనుకబడిన తరగతుల వసతి గృహం ఉంది. ఈ గ్రామము.[1] నకు చెందిన ప్రముఖ వ్యక్తి శ్రీ తమ్మినేని శ్రీరామమూర్తి గారు. ఈయన సోదరుడు పాపారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యులుగా ప్రజల గూర్చి అనేక త్యాగాలను చేసిన వ్యక్తి. శ్రీరామమూర్తి యొక్క కుమారులు అయిన తమ్మినేని విజయవర్థనరావు,తమ్మినేని శ్యామలరావు మరియు తమ్మినేని సీతారాంలు శ్రీకాకుళం జిల్లాలో ఖ్యాతి పొందారు. తమ్మినేని సీతారాం గారు తెలుగు దేశం పార్టీలో అనేక శాసన సభ్యులుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంతిగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేసిన వ్యక్తి.

తమ్మినేని సీతారాం గారి పెదనాన్న తమ్మినేని పాపారావు నాలుగు సార్లు ఎమ్ ఎల్ ఏ అయ్యారు.ఆయన తమ్ముడు శ్రీరామమూర్తి మూడో కొడుకైన సీతారాం ఐదు సార్లు ఎమ్ ఎల్ ఏ అయ్యారు.పలు శాఖల మంత్రిగా పదేళ్ళపాటు టిడిపిలో ఎన్ టి ఆర్, బాబు సర్కార్లలో పనిచేసారు.శ్రీరామమూర్తి కుమార్తె యొక్క కొడుకే ప్రభుత్వ విప్ కూన రవికుమార్.

తమ్మినేని పాపారావు ఒకమారు ఇండిపెండెంటుగా, రెండుమార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికకాగా, పైడి శ్రీరామమూర్తి ఒకసారి ఇండిపెండెంటుగా గెలిచారు.

గ్రామంలో ప్రముఖులు[మార్చు]

తమ్మినేని పాపారావు[మార్చు]

ఆయన శ్రీకాకుళం జిల్లా నగరికటకం అసెంబ్లీ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 1955 లో గెలుపొందారు.ఆయన ఏప్రిల్ 16 1916 న జన్మించారు. ఆయన గాంధీ హరిజన సేవా సంఘ సభ్యునిగా పనిచేసారు. 1934లో జిల్లా కాంగ్రెస్ సభ్యునిగా చేరారు. 1950లో జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షులైనారు. 1953-54లో జిల్లా కాంగ్రెస్ సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. శ్రీకాకుళం జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు,ఆంధ్రా స్టేట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులకు డైరక్టరుగా పనిచేసారు. ఈయన రైతు సమస్యలపై విశేషంగా కృషిచేసి జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలను పొందారు.[2] నాలుగు సార్లు ఎమ్ ఎల్ ఏ అయ్యారు.

తమ్మినేని శ్రీరామమూర్తి[మార్చు]

తమ్మినేని శ్రీరామ్మూర్తి కాంట్రాక్టరుగా, గ్రామ నాయకునిగా పనిచేశారు. శ్రీరామ్మూర్తి ఆనాటి శాసన సభ్యులు తమ్మినేని పాపారావుకు, జెడ్పీ వైస్ చైర్మన్ చిరంజీవికి సోదరునిగా ఈ నియోజకవర్గంలో సుపరిచితుడు.ఈయన భార్య ఇందుమతి. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు తమ్మినేని విజయవర్ధనరావు గ్రామసర్పంచ్‌గా, రెండవ కుమారుడు తమ్మినేని శ్యామలరావు జెడ్పీటిసిగాను పనిచేశారు. మూడో కుమారుడు సీతారాం వైకాపాలో కొనసాగుతున్నారు.[3]

తమ్మినేని శ్యామలరావు[మార్చు]

తమ్మినేని శ్యామలరావు గారు శ్రీరామమూర్తి,ఇందుమతి దంపతుల రెండవ కుమారుడు. ఆయన ఆమదాలవలస సుగర్స్ చైర్మన్ గా పనిచేసారు. ఆయన కుమార్తె తమ్మినేసి సుజాత[4].

తమ్మినేని సీతారాం[మార్చు]

తమ్మినేసి సీతారాం శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 1980లో తన 18వ యేటనే ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ డైరక్టర్ గా పనిచేసారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఆ పార్టీలో చేరి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనారు. తొమ్మిదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసారు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ విప్ గా ఐదేళ్ళు, శాప్ డైరక్టరుగా మూడేళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేసారు.[5]

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావముతో తమ్మినేని సీతారాం ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ' పిలుపు బాగానే పని చేస్తోంది. గత ఎన్నికల్లో తెదేపాకు గుడ్‌బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఈ జాబితాలో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూడా ప్రజారాజ్యం పార్టీకి గుడ్‌బై చెప్పారు. 15 ఆగస్టు 2009 వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టారు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం నిప్పులు చెరిగారు. బాబు వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించారు.ఆయన ఆగస్టు 29 2013 న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు[6]. 2014 ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి వై.ఎస్.అర్ పార్టీ తరుపున పోటీ చేశారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,584 - పురుషుల సంఖ్య 782 - స్త్రీల సంఖ్య 802 - గృహాల సంఖ్య 435

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=తొగరాం&oldid=1985891" నుండి వెలికితీశారు