తోటాడ (ఆమదాలవలస)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

తోటాడ, శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము. [1]

తోటాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం ఆముదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,947
 - పురుషుల సంఖ్య 966
 - స్త్రీల సంఖ్య 981
 - గృహాల సంఖ్య 546
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చారిత్రకంగా తోటాడ గ్రామానికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలేమీ లేకపోయినా కానీ ఈ గ్రామం కనీసం 16వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. నాగావళి నది పరీవాహక ప్రాంతానికి చెందినదీ గ్రామం.

సుమారుగా 2,000 మంది ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం ఈ గ్రామ ప్రజల జీవనాధారం. ఇవి కాక కులవృత్తులూ ఇక్కడ కొనసాగుతున్నాయి. పారిశ్రామికంగా ఇక్కడ వనరులు తక్కువనే చెప్పుకోవాలి. ఈ మధ్యనే పునరుధ్ధరించిన డంకన్ స్టీల్ ఈ పరిసర ప్రాంతంలోని దూసి గ్రామంలో ఉండటంతో కొద్దిమంది గ్రామ వాసులకు అక్కడ ఉద్యోగం లభించింది. ఎక్కువగా ఆర్థికాభివృధ్ధి వ్యవయసాయం వలనే జరుగుతుందనేది మాత్రం నిజం.

ప్రధానంగా వరి, మినప, పెసర పంటలు పండిస్తున్నారు. తక్కువ మొత్తంలో కూరగాయల సాగు, ఆయిల్ పామ్ సాగు కూడా ఉన్నాయి. ఇక్కడ చెరకు ముఖ్య వ్యాపార పంట. కొబ్బరి, మామిడి, జీడి తోటల పెంపకం కూడా అధికంగా ఉంది. చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో చక్కనైన గ్రామం ఇది. వ్యవసాయం మీదే అభివృధ్ధి ఆధారపడటంతో ఆర్థికాభివృధ్ధి రేటు పెద్దగా మారటం లేదు. వ్యవసాయ అధికారులు రైతులకు తగిన సూచనలను అందించి, కొత్త పధ్ధతులను వ్యవసాయంలో అనుసరింపచేస్తే అభివృధ్ధి కావటానికి అవసరమైన నీటి వనరులు, చక్కని వాతావరణం తోడ్పాటు ఉంటుంది కాబట్టి మంచి ఫలాలను ఆశించవచ్చు. పారిశ్రామికంగా కూడా ప్రభుత్వం దృష్టిసారిస్తే ఆశ్చర్యకరమైన మార్పులను, అభివృధ్ధినీ చూడొచ్చు.తోటాడకు రైల్వేస్టేషన్ లేదు. తోటాడ రైల్వేస్టేషన్ 4 కిలోమీటర్ల దూరంలో దూసి గ్రామంలో ఉంది.

"తోటాడ", "అక్కివరం" మరియు "గోపినగరం "లను కలిపి తోటాడ గ్రామంగా పిలుస్తారు. తోటాడకు పడమరవైపు ఉన్న నాగావళి నది పక్కన "సింగూరు", "కింతలి" అనే గ్రామాలు ఉన్నాయి. తోటాడతో వీరికి మంచి అభినాభావ సంబంధాలు ఉన్నాయి.

దర్శనీయ ప్రదేశాలు:

ఇక్కడి ముఖ్యమయిన దర్శనీయ ప్రదేశం శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవస్థానం. ఈ దేవాలయంలోని విగ్రహం 16వ శతాబ్దంలో నాగావళి నదిలో దొరికిందనేది ఇక్కడి పూర్వీకుల నమ్మకం. పాత దేవాలయం శిథిలావస్థకు చేరుకోవటంతో ఆగమ శాస్త్ర పండితుల సూచన ప్రకారం నూతన ఆలయాన్ని నిర్మించుకున్నారు ఈ గ్రామస్థులు. ప్రతి రోజూ అర్చనలూ, కార్తీక మాసం నుంచి, మాఘ మాసం వరకూ సాయంత్రాలు అక్కడ ప్రత్యేక పూజలూ నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

నాగావళి నదీ తీరం - సాయంత్రం వేళలో తీరంలోని ఇసుక మేటలలో కూర్చుంటే ఉండే ఆ హాయిని మాటల్లో వర్ణించలేము.

రాజకీయ నాయకులు: శ్రీమతి. తాండ్ర కళావతి - ప్రస్తుత గ్రామ సర్పంచ్; శ్రీ తాండ్ర అప్పారావు (కర్ణం) - తహశీల్దారు; తాండ్ర అప్పారావు మరియు కళావతి భార్యా భర్తలు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,947 - పురుషుల సంఖ్య 966 - స్త్రీల సంఖ్య 981 - గృహాల సంఖ్య 546

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]