వంజంగి (ఆమదాలవలస)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వంజంగి, శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము. [1] గ్రామీణ వాతావరణానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ గ్రామం రాజకీయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు ఈ గ్రామాన్ని తొలిసారి సందర్శించడం ద్వారా వంజంగికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.

వంజంగి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం ఆముదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,378
 - పురుషుల సంఖ్య 1,210
 - స్త్రీల సంఖ్య 1,168
 - గృహాల సంఖ్య 662
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

వంజంగి గ్రామ కూడలి వద్ద వెంకటేశ్వర దేవాలయం

శ్రీవేంకటేశ్వరస్వామి (ముకుంద తిరుమల) దేవాలయం, రామాలయం, వరలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ దుర్గా దేవాలయం, అభయాంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలోని ఇతర గ్రామాలతో పోల్చిచూస్తే ఈ గ్రామంలో దాదాపు అన్ని కులాల వారు అన్నదమ్ముల్లా కలిసిమెలసి జీవనం సాగించడం కనిపిస్తుంటుంది. ఈ గ్రామానికి చెందిన వారిలో ఎక్కువ శాతం మంది ఆర్మీలో పనిచేస్తుండడం విశేషం. కాళింగ సామాజిక వర్గానిది ఈ గ్రామంలో అగ్రస్థానం అయినప్పటికీ అన్ని కులాల వారూ అన్యోన్యంగా ఉంటారు. బక్థి బావాలకు మారు పేరుగా ఈ గ్రామము అధర్షమ్ గా నీలిఛింధి.

స్థానికంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఇక్కడి నుంచే అనేక మంది ఇతర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో అనేక మంది తిరిగి గ్రామానికి వచ్చి స్థిరపడినప్పటికీ ఇంకా చాలా మంది హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఉంటున్నారు.

అతి చిన్న వయసులోనే పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం జాతీయ స్థాయిలో మీడియా ఏజెన్సీకి సేవలందిస్తున్న పైడి లక్ష్మణరావు ఇదే గ్రామానికి చెందినవారు. జర్నలిస్టులపై జరిగే దాడుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారిక కమిటీలో లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తరపున సభ్యునిగా ప్రాతినిధ్యవహిస్తున్నారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన మరికొందరు కూడా పలు పత్రికల్లో పనిచేస్తున్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,378 - పురుషుల సంఖ్య 1,210 - స్త్రీల సంఖ్య 1,168 - గృహాల సంఖ్య 662

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]