మగటపల్లి వెంకటరమణమూర్తి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
శ్రీకాకుళం పట్టణానికి చెందిన మగటపల్లి వెంకటరమణమూర్తి వ్యాపారి. భార్య శాంతకుమారి, కుమారుడు కళ్యాణ్ మృతి చెందాక ఒంటరిగా ఉంటూ తనకున్న ఆస్తి అనాథలకు ఉపయోగపడాలన్నఅభిమతంతో రెడ్ క్రాస్కు దానాలు చేసిన సేవా తత్పరుడు.
రెడ్ క్రాస్ కు దానాలు
[మార్చు]పొట్టిశ్రీరాములు కూడలిలోని రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయం మేడపై రూ. 11 లక్షల వ్యయంతో కుమారుని పేరిట కళ్యాణ్ మగటపల్లి జ్ఞాపకార్థం నేత్ర సేకరణ నిధి ఏర్పాటు చేశారు.తన స్వగృహంలో భార్య పేరున కుట్టుశిక్షణ కేంద్ర నిర్వహిస్తున్నారు. నిరుపేద మహిళలకు శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నారు. అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు చిన్నబజారులో రూ. 50 లక్షల విలువ చేసే ఇంటిని రెడ్‌క్రాస్‌కు దానం చేశారు. పెద్దపాడులో గల 15 సెంట్ల స్థలాన్ని రెడ్‌క్రాస్‌కు అందజేశారు. రెడ్ క్రాస్ డెంటల్ ఆసుపత్రికి రూ. లక్ష విరాళం అందజేశారు. పట్టణంలో ఎవరైనా మృతి చెందితే శవాలను నిలువ ఉంచేందుకు అవసరమయ్యే రూ. లక్ష విలువ చేసే ఫ్రీజర్ ఉచితంగా అందజేశారు.