వెన్నూతల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వెన్నూతల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఉంగుటూరు
ప్రభుత్వము
 - సర్పంచ్ నల్ల లక్ష్మి
 - ZPTC గద్దె అనురధ జిల్లాపరిషత్ చైర్మన్
 - MPTC తెల్లకుల లక్షణస్వామి
 - శాసన సభ్యులు శ్రీ వల్లభనేని వంశీ మోహన్
పిన్ కోడ్ 521 312
ఎస్.టి.డి కోడ్ 08676
గ్రామంలోని పురాతన శివాలయం. 2006-2007లో పునరుద్ధరించబడినది
ఊరికి వెళ్ళే రోడ్డుపై జనంతో క్రిక్కిరిసిన ఆటో - చాలా గ్రామాలలో సామాన్య జన ప్రయాణాలకు వాడే విధంగా
దీనిని రామయ్యగారి పొలమంటారు (ఆసామీ ఎవరైనా పేరు మాత్రం అదే. 20వ శతాబ్దం ఆరంభంలో రామయ్య గారు ఇక్కడ ఒక పెద్ద భూస్వామి)
గ్రామంలోని ఒక పురాతన గృహం శిథిలాలు. వంద యేళ్ళ పైబడిన ఈ ఇంటి శిథిలాలలో అప్పటి నిర్మాణ శైలిని గమనించవచ్చును.

వెన్నూతల (Vennutala), కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 312.

ఉనికి[మార్చు]

ఈ గ్రామము విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ జనాభా సుమారు 2000-నుండి 3000 వరకు ఉండవఛ్ఛును. ఈ గ్రామము గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయము మరియు వ్యవసాయ సంబంధ వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడి వ్యవసాయ కుటుంబాల వారు దాదాపు 3-4 తరాల వెనుక తూర్పు జిల్లాల నుండి వలస వచ్చారని పెద్దలు చెబుతుంటారు.

గ్రామములో రాజకీయాలు[మార్చు]

1902లో ప్రారంభమైన కృష్ణా పత్రిక తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. అయితే తదనంతర కాలంలో వివిధ సమస్యల కారణంగా మూతబడింది. 1982లో ఈ పత్రికను పిరాట్ల వెంకటేశ్వర్లు పునరుద్ధరించాడు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పత్రిక పూర్వవైభవానికి తనవంతు కృషి చేశాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ తరఫున పోరాడాడు. ఆనంతరం పత్రికా రంగంలో స్థిరపడ్డాడు. తన జీవితకాలంలో వివిధ సమస్యలపై ఎన్నో పుస్తకాలు రచించాడు. వీరు ఈ గ్రామములోనె జన్మించారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 25 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, విజయవాడ, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గన్నవరం, నందివాడ, పెదపారుపూడి, గుడివాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, తరిగొప్పుల, పెదఆవుటపల్లి జయరామ విజ్ఞాన హైస్కూల్, ఉంగుటూరు

ప్రయాణ సదుపాయాలు[మార్చు]

  • ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల (విజయవాడ-మచిలీపట్నం మార్గము)
  • గన్నవరమునుండి (4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి, విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా (గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. (అధికంగా బస్సులు).
  • విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు) నడుస్తున్నది.
  • రైల్వేస్టేషన్: విజయవాడ 31 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) -మొత్తం 528 -పురుషులు 251 -పురుషులు 251 -స్త్రీలు 277 -గృహాలు 136 -హెక్టార్లు 295

వ్యవసాయం[మార్చు]

ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. ప్రధానమైన పంట వరి.

నీటి వనరులు[మార్చు]

వ్యవసాయం కొరకు, కృష్ణా నది నుండి ఈ గ్రామము మీదుగా ఒక కాలువ ఉంది.

గ్రామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శివాలయం[మార్చు]

ఈ ఊరిలో ఒక పురాతనమైన శివాలయం ఉంది. అది దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. 2006-07లో ఈ ఆలయమును పునరుద్ధరించారు. ఆ సమయములో జరిగిన తవ్వకాలలో లభ్యమయిన ఆధారాల ప్రకారము ఈ ఆలయమును 1880 ప్రాంతములో నిర్మించి ఉంటారని తెలుస్తున్నది. ఈ ఆలయమును కప్పగంతు మరియు లోల్లా వారి కుటుంబముల వారు నిర్మించినారని పెద్దలు ఛెప్తారు. ఈ ఆలయము ముందు ఒక పెద్ద కోనేరు (చెరువు) ఉంది.ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున ఆలయం ధర్మకర్తలైన లోల్లా వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కల్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారి కల్యాణం చూసి ఆనందిస్తుంటారు. ఆలయ ధర్మకర్తలైన లోల్లా కుటుంబీకులని సంప్రదించాలంటే - లోల్లా వెంకట్ సతీష్ కి మెయిల్ పంపించవచ్చు - మెయిల్ - venkat004@gmail.com .ఇటీవల ఊరిలో ఉన్న పురాతనమైన రామాలయాన్ని కూడా పునరుద్ధరించారు. ఈ ఆలయం కూడా కోనేరుని ఆనుకొని ఉంది.

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

దాతలు, గ్రామస్థుల విరాళాలతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు పాల్గొన్నారు. అనంతరం మద్యాహ్నం 500 మందికిపైగ భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1]

ఇతర సదుపాయాలు[మార్చు]

కప్పగంతు అచ్యుతరామయ్య గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉన్న కాలములో ఈ గ్రామమునకు రహదారి ఏర్పడింది. కప్పగంతు వెంకట లక్ష్మినరసింహం రహదారి కొరకు తన పొలమును ప్రభుత్వమునకు ఇచ్చుటకు ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమయ్యింది. రహదారి 1967-69లో పూర్తయ్యింది.

గ్రామానికి సంబంధించిన మరికొన్ని చిత్రాల మాలిక[మార్చు]

సూచికలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Unguturu/Velinuthala". Retrieved 23 June 2016.  External link in |title= (help)

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015, జూన్-12; 4వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=వెన్నూతల&oldid=2139563" నుండి వెలికితీశారు