పిరాట్ల వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిరాట్ల వెంకటేశ్వర్లు
జననంపిరాట్ల వెంకటేశ్వర్లు
(1940-07-16) 1940 జూలై 16
భారతదేశం వెన్నునూతల గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2014 డిసెంబరు 8
హైదరాబాదు
మరణ కారణముఅనారోగ్యం
వృత్తిపత్రికా సంపాదకుడు
మతంహిందూ
భార్య / భర్తసూర్యకుమారి
పిల్లలుకృష్ణకిశోర్

1902లో ప్రారంభమైన కృష్ణా పత్రిక తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. అయితే తదనంతర కాలంలో వివిధ సమస్యల కారణంగా మూతబడింది. 1982లో ఈ పత్రికను పిరాట్ల వెంకటేశ్వర్లు పునరుద్ధరించాడు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పత్రిక పూర్వవైభవానికి తనవంతు కృషి చేశాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ తరఫున పోరాడాడు. ఆనంతరం పత్రికా రంగంలో స్థిరపడ్డాడు. తన జీవితకాలంలో వివిధ సమస్యలపై ఎన్నో పుస్తకాలు రచించాడు. [1], [2]. నక్సలైట్లతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావాలన్న తపనతో అటు ప్రభుత్వానికి, ఇటు నక్సలైట్లకు మధ్య వారధిగా వ్యవహరించిన వారిలో ఇతడు ముఖ్యుడు.

కృష్ణాపత్రిక పూర్వవైభవం[మార్చు]

కృష్ణా పత్రిక ప్రాభవాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఇతడు చేసిన కృషి చెప్పుకో దగింది. చైతన్య వంతమైన సంపాదకీయాలతో ఈ పత్రిక ఇతని ఆధ్వర్యంలో నిర్మొహమాటమైన నిష్పాక్షికమైన పంథాను అవలంబించింది. ఇతని సారథ్యంలో కృష్ణాపత్రిక కార్యాలయం సాహితీవేత్తలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలతో సందడిగా ఉండేది. ఎన్నో చారిత్రక, రాజకీయ, సాహిత్య చర్చలు ఆరోగ్యవంతమైన రీతిలో జరిగేవి. పత్రికా దర్బార్, కాకతీయ విజయం, భువనవిజయం, గోల్కొండ విజయం మొదలైన సాహిత్య రూపకాలు పత్రికా కార్యాలయ ప్రాంగణంలో జరిగేవి. ఓగేటి అచ్యుతరామశాస్త్రి, రాళ్ళబండి కవితాప్రసాద్, జి.ఎం.రామశర్మ, కసిరెడ్డి వెంకటరెడ్డి, అనంతలక్ష్మి వంటి సాహిత్యవేత్తలతో ఇతని ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్యకార్యక్రమాలు జరిగేవి[3].

రచనలు[మార్చు]

 1. రెడ్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా
 2. వందేమాతరం
 3. అజేయ భారత్‌
 4. మార్క్సిజం - మేధావుల మత్తుమందు
 5. ముట్నూరి కృష్ణారావు ISBN 978-81-260-3044-6
 6. ఆంతరంగిక భద్రత - మావోయిస్టులు
 7. సాంస్కృతిక జాతీయవాదం
 8. జనతా జనార్దనుడా! నీ వోటెవరికి?
 9. వందేళ్ళ వందేమాతర ఉద్యమం
 10. కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగేనా?

పురస్కారాలు[మార్చు]

 1. ఇందిరాగాంధీ సద్భావనా అవార్డు
 2. 2013లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం
 3. 2001లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి తాపీధర్మారావు స్మారక ధర్మనిధి పురస్కారం

మూలాలు[మార్చు]

 1. ఎడిటర్ (2014-12-09). "పిరాట్ల మరణవార్త". ఆంధ్రజ్యోతి. మూలం నుండి 9 డిసెంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 20 December 2014.
 2. ఎడిటర్ (2014-12-09). "ప్రముఖ జర్నలిస్టు పిరాట్ల అస్తమయం". సాక్షి. మూలం నుండి 7 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 20 December 2014.
 3. సాధన, నరసింహాచార్య (2015-02-01). "అలుపెరుగని అక్షరయోధుడు - మన పిరాట్ల". మూసీ. 17 (4): 17.

ఇతర లింకులు[మార్చు]