దత్తపుత్రుడు
దత్తపుత్రుడు (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.లెనిన్ బాబు |
---|---|
నిర్మాణం | తమ్మారెడ్డి కృష్ణమూర్తి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , వాణిశ్రీ, జి. రామకృష్ణ, నాగభూషణం, బి.పద్మనాభం |
సంగీతం | టి.చలపతిరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య |
కూర్పు | అక్కినేని సంజీవి |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
దత్తపుత్రుడు ఒక తమిళ చిత్రకథ ఆధారంగా నిర్మించబడిన తెలుగు సినిమా.[1] దీనికి తమ్మారెడ్డి లెనిన్ బాబు దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా ఆర్ధికంగా లాభించలేదు. ఈ సినిమా 1972, జూన్ 15వ తేదీన విడుదలయ్యింది.[2]
కథ
[మార్చు]ధర్మయ్య, పార్వతమ్మలకు సంతానం లేకపోవడంతో రామన్నను దత్తత తీసుకుంటారు. ఆ దత్తత పార్వతమ్మ అన్న శేషయ్యకు ఇష్టం ఉండదు. రామన్న వచ్చిన వేళావిశేషం వల్ల పార్వతమ్మ గర్భం ధరిస్తుంది. ఉక్రోషం పట్టలేని శేషయ్య పసుపు కుంకుమల క్రింద తాము ఇచ్చిన పొలం తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఘర్షణలో దురదృష్టవశాత్తూ శేషయ్య పాలేరు చనిపోగా ఆ హత్య ధర్మయ్య చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించి ధర్మయ్యను జైలు పాలు చేస్తాడు శేషయ్య. రామన్న శ్రమించి తన తల్లిని, చెల్లెలు సరోజను పోషిస్తూ ఉంటాడు. తాను చదువుకోక పోయినా తన చెల్లెలిని పెద్ద చదువుల కోసం పట్నం పంపిస్తాడు. ఆ పట్నంలోనే చదువుకొంటున్న శేషయ్య కొడుకు రాజు, సరోజ పరస్పరం ప్రేమించుకుంటారు. గ్రామంలోని మరో మోతుబరి రైతు భూషయ్య ఆకతాయి కూతురు రంగమ్మకు రామన్నతో పరిచయం ఏర్పడి పరస్పరాకర్షణకు దారి తీస్తుంది. సెలవులకు పట్నం నుండి ఇంటికి వస్తున్న రాజు, సరోజలను ఆహ్వానించడానికి రైల్వే స్టేషనుకు వచ్చిన శేషయ్య, రామన్నలు వారిద్దరూ ఒకే కంపార్టుమెంటు నుండి దిగడం చూసి మండిపడతారు. రోజు రోజూ తమ కుటుంబాల మధ్య కలతలు పెరగడం పట్ల రాజు, సరోజలు బాధపడతారు. రంగమ్మ సహకారంతో ఒక నాటకం ఆడి శేషయ్య మనసును మారుస్తాడు రామన్న. సరోజ, రాజుల వివాహంతో కథ సుఖాంతమవుతుంది.[3]
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు - రామన్న
- వాణిశ్రీ - రంగమ్మ
- జి. రామకృష్ణ - రాజు, శేషయ్య కొడుకు
- శాంతకుమారి - పార్వతమ్మ
- నాగభూషణం - శేషయ్య
- వెన్నిరాడై నిర్మల - సరోజ, రామన్న చెల్లెలు
- బి. పద్మనాభం
- అల్లు రామలింగయ్య - శేషయ్య గుమాస్తా
- కైకాల సత్యనారాయణ - రౌడీ జగ్గడు
- సూర్యకాంతం
- రమాప్రభ - సూర్యకాంతం కూతురు
- వల్లూరి బాలకృష్ణ
- రావి కొండలరావు
- వల్లం నరసింహారావు
- జగ్గారావు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: వి.కె.రామస్వామి
- స్క్రీన్ ప్లే: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
- మాటలు: పినిశెట్టి
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు
- సంగీతం: తాతినేని చలపతిరావు
- ఛాయాగ్రహణం: ఎన్.వెంకటరత్నం
- కళ: జి.వి.సుబ్బారావు
- కూర్పు: అక్కినేని సంజీవి
- నృత్యం: చిన్ని - సంపత్
పాటలు
[మార్చు]- అందానికి అందానివై ఏనాటికి నాదానివై నా ముందర నిలిచిన దానా నాదానా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల- రచన:దాశరథి
- గంపా నెత్తిన పెట్టి గట్టుమీద పోతుంటే గుండె ఝల్లుమన్నాదే రంగమ్మా - ఘంటసాల, పి.సుశీల - రచన: సినారె
- గౌరమ్మతల్లికి బోనాలు దుర్గమ్మ తల్లికి జేజేలు - ఘంటసాల, సుశీల బృందం - రచన:సినారె
- చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే మెరుపల్లే మెరిసాడే తొలకరి వానల్లే కురిశాడే - పి.సుశీల బృందం - రచన:సినారె
- పిల్లోయి జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త మళ్ళీ మళ్ళీ పేలితే చెవులు పిండి చేతికిస్తా- ఘంటసాల, పి.సుశీల - రచన: సినారె
- మా చేను బంగారం పండిందిలే మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
- మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా సిగ్గుపడే ఓ చిలకమ్మా కంది చేనుంది పోదామా- ఘంటసాల, పి.సుశీల - రచన: సినారె
- రావమ్మ రావమ్మ రతనాల బొమ్మా నీవల్ల ఈ పల్లె వెలుగొందునమ్మా - పి.సుశీల - రచన: సినారె
- చూడనీ ఆహా చూడనీ బాగా చూడనీ నీ సూపుల్లో సూపు కలిపి సూడనీ - మాధవపెద్ది సత్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ నేనూ నా జ్ఞాపకాలు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ed.). హైదరాబాదు: తమ్మారెడ్డి కృష్ణమూర్తి. అక్టోబరు 2008. p. 45.
- ↑ వెబ్ మాస్టర్. "Datta Puthrudu (Thammareddy Lenin Babu) 1972". ఇండియన్ సినిమా. Retrieved 9 January 2023.
- ↑ భరద్వాజ (18 June 1972). "చిత్రసమీక్ష: దత్తపుత్రుడు" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 9 జనవరి 2023. Retrieved 9 January 2023.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)