లవ్ మ్యారేజ్
లవ్ మ్యారేజ్ తెలుగు చలన చిత్రం,1977 మార్చి20 న విడుదల.దర్శకుడు టి.లెనిన్ బాబు పర్యవేక్షణలో వచ్చిన ఈ చిత్రంలో రంగనాథ్, జయచిత్ర, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చలపతిరావు సమకూర్చారు.
లవ్ మ్యారేజ్ (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.లెనిన్ బాబు |
---|---|
తారాగణం | రంగనాథ్, జయచిత్ర |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
చిత్రకథ
[మార్చు]ఎం.బి.ఎ.పట్టాపుచ్చుకున్న ప్రసాదుకు రైలులో సుజాత అనే యువతి తటస్థపడుతుంది. అప్పటి వరకు ఆడపిల్ల అంటే ఆమడదూరంలో ఉండే ప్రసాదుకు హృదయస్పందన ప్రారంభమైంది. ఆఫీసుకు వెళ్ళి తన మిత్రుడు మోహన్‌కు ఈ సంగతి చెబుతాడు. సుజాత కూడా ప్రసాద్ గురించి తన స్నేహితురాలు రాధకు చెబుతుంది. రాధ, మోహన్‌ల ప్రోద్బలంతో సుజాత, ప్రసాద్‌లు చేరువవుతారు. మనసులు కలుస్తాయి. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కాని ప్రసాద్ తండ్రి మాధవయ్య ససేమిరా వీలులేదంటాడు. సుజాతను సినిమాలలో చేర్పించి లక్షలు గడించాలనుకున్న సుజాత మేనమామ వెంకటప్పయ్యకు కూడా ఇష్టం వుండదు. దానితో సుజాత, ప్రసాద్‌లు రిజిస్టర్ మ్యారేజి చేసుకుని వేరు కాపురం పెడతారు. వెంకటప్పయ్య తన నక్క వినయాలతో వారి పంచన చేరతాడు. రాధ పెళ్ళికి వెళ్ళిన సుజాత రాధ భర్త సురేష్ ప్రోద్బలంతో అతని సినిమాలో ఒక చిన్నవేషం వేస్తుంది. ఇంటికి వచ్చాక ఈ విషయం మొగుడికి చెప్పదు. కాని ఆఫీసులోను, బయట ప్రసాదును సినిమాసుజాత మొగుడు అని పిలవడం విన్నాక ప్రసాద్ సుజాతను నిలదీసి అడిగితే ఆమె నిజం చెబుతుంది. ప్రసాద్ సుజాతను ఇంటినుండి తరిమివేస్తాడు. తమ ముద్దుల బాబును తన వద్దే ఉంచుకుంటాడు ప్రసాద్. తరువాత వాళ్ళిద్దరూ తిరిగి ఎలా కలుసుకుంటారనేది మిగిలిన కథ[1].
నటీనటులు
[మార్చు]- జయచిత్ర
- రంగనాథ్
- చంద్రమోహన్
- కర్నాటి లక్ష్మీనరసయ్య
- కె.వి.చలం
- కె.విజయ
- నిర్మలమ్మ
- ఝాన్సీ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు : టి.లెనిన్ బాబు
- నిర్మాత: పి.రాధాకిషన్ రావు
- సంగీతం: టి.చలపతిరావు
- సమర్పణ: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ:రవీంద్ర ఆర్ట్ ఎంటర్ ప్రైజేస్
- సాహిత్యం: వేటూరి, సి నారాయణ రెడ్డి, అప్పాలాచార్య
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, అఖిల,మాధవపెద్ది ,రామకృష్ణ .
పాటలు
[మార్చు]క్రమ సంఖ్య | పల్లవి | గాయనీగాయకులు | సంగీతదర్శకత్వం | గేయ రచయిత |
---|---|---|---|---|
1 | గుండె కొట్టుకుంటుంది గడియారంలా వలపు విచ్చుకుంటుంది | వి.రామకృష్ణ, పి.సుశీల | టి.చలపతిరావు | |
2 | తెలివి తెల్లారిందా వలపు చల్లారిందా ఏమి ఎరగనట్టు జరగనట్టు | పి.సుశీల | టి.చలపతిరావు | వేటూరి |
3 | మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (విషాదం) | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | టి.చలపతిరావు | సినారె |
4 | మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (సంతోషం) | పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | టి.చలపతిరావు | సినారె |
5 | రత్తి నా రత్తి నా మాట వినుకోవే ముద్దుల రత్తి రత్తి | మాధవపెద్ది,అఖిల | టి.చలపతిరావు | అప్పలాచార్య |
6 | రా రా ఇటు రారా రావేమిరా ఈ రేయి గడిచి తెలవారక ముందే | ఎస్.జానకి | టి.చలపతిరావు |
మూలాలు
[మార్చు]- ↑ వి.ఆర్ (16 March 1979). "చిత్రసమీక్ష - లవ్ మ్యారేజ్". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65 సంచిక 338. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 11 December 2017.
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)