మా బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా బాబు
దర్శకత్వంటి.ప్రకాశరావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1960
దేశంభారతదేశాం
భాషతెలుగు

మా బాబు 1960, డిసెంబర్ 22న తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు తాతినేని చలపతిరావు సంగీతం సమకూర్చాడు.

క్ర.సం పాట గేయ రచయిత గాయకులు నిడివి
1 "ఎంత కాలం ఎంత దూరం" శ్రీశ్రీ ఘంటసాల 4:51
2 "బాబూ నిద్దురపోరా మా బాబూ నిద్దురపోరా తేలిపోదువు తీయని స్వప్న జగానా" సముద్రాల జూ. పి.సుశీల 4:34
3 "ఛల్ ఛల్" సముద్రాల జూ. పి.సుశీల 4:23
4 "ఓ దారిన పోయే చిన్నవాడా" సముద్రాల జూ. ఘంటసాల, ఎస్.జానకి 5:10
5 "విరిసే ఝుమ్‌ ఝుమ్‌" సముద్రాల జూ. కె.జమునారాణి 4:09
6 "ఏడమ్మా నీ రాజు" సముద్రాల జూ. పి.లీల 4:16
7 "శ్రీమతిగారు" కొసరాజు మాధవపెద్ది సత్యం 2:06

ఆనంద్ అశోక్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న పేరుగల డాక్టరు. ఆ నమ్మకం కొద్దీ ఒక భాగ్యవంతురాలు గర్భిణీగా ఉన్నప్పుడు భర్త పోయిన తన కోడలు రత్నను కానుపుకు డాక్టర్ ఆనంద్ వద్దకు తీసుకు పోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ భార్య మగబిడ్డను ప్రసవించి మరణిస్తుంది. ఆ ఒక్క బిడ్డే తన జీవితాధారమని నమ్మిన రత్న తన బిడ్డ మరణించినదని తెలిస్తే ఇక బ్రతకదని గుర్తించి ఆనంద్ తన కన్నబిడ్డను ఆమె బిడ్డ అని చెప్పి ఇచ్చేస్తాడు. తనకు కలిగిన దుఃఖం కొద్దీ ఆనంద్ నాలుగేళ్ళపాటు మనశ్శాంతి కోసం అటూఇటూ తిరిగి మళ్ళీ నర్సింగ్ హోంలో చేర్తాడు. మమకారం కొద్దీ రాజు (బిడ్డ)ను చూడటానికి తరచూ రత్న ఇంటికి రావటంతో లోకాపవాదానికి వెరచి రత్న అత్తగారు డాక్టర్‌ను తమ ఇంటికి రావడాన్ని నిషేధిస్తుంది. నర్సింగ్ హోమ్‌లో కొత్తగా చేరిన నర్సు మాయ ఆనంద్‌ను పెళ్ళి చేసుకోవాలని వల పన్ని తప్పని స్థితి కల్పించి జయిస్తుంది. కానీ దాంపత్యం సుఖంగా ఉండటం లేదు. ఆమెకు సంతాన యోగ్యతా లేదు. తాను వద్దన్న అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడన్న కోపంతో ఆనంద్ వాళ్ళ నాన్న తన ఆస్తికి వారసుడిగా మనవణ్ణి నియమిస్తూ విల్లు వ్రాస్తాడు. మాయ ఆస్తిమీద మమకారం కొద్దీ రాజు ఆరా తీయించి కోర్టులో దావావేసి రాజును రత్న నుండి వేరు చేసి ఇంటికి తెస్తుంది. కానీ రాజు పారిపోతాడు. అతడిని వెదుక్కుంటూ వెన్నాడి తారుపీపాల మీద ఎక్కి పీపాలు దొర్లి మాయ మరణిస్తుంది. ఆనంద్ రాజును రత్నకు అప్పగించడంతో కథ ముగుస్తుంది[1].

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు. "చిత్ర సమీక్ష: మాబాబు". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 25 అక్టోబరు 2020. Retrieved 11 August 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మా_బాబు&oldid=4207295" నుండి వెలికితీశారు