వివాహబంధం (1964 సినిమా)
వివాహబంధం (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
---|---|
రచన | అట్లూరి పిచ్చేశ్వరరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, పి.భానుమతి, సూర్యకాంతం, చిత్తూరు నాగయ్య, పి.హేమలత |
సంగీతం | ఎం.బి.శ్రీనివాస్ |
గీతరచన | సినారె |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
వివాహబంధం 1964లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. ఈ చిత్రాన్ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రకథకు ఆధారం బెంగాలీ రచయిత అషుతోష్ ముఖర్జీ బెంగాలీ రచన. భానుమతి, ఎన్.టి.ఆర్ ముఖ్య తారాగణం. హరనాథ్, బాలయ్య అతిథి పాత్రలను పోషించారు.[1]
సంక్షిప్త చిత్రకథ
[మార్చు](స్పాయిలర్లు కలవు) కాలేజీ విద్యార్థిని భారతి (భానుమతి) లెక్చరర్ గా పనిచేసే చంద్రశేఖరానికి (ఎన్.టి.ఆర్) కు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. చంద్రశేఖరం తమ అంతస్తుకు తూగడని ఇందుకు భారతి తల్లి (సూర్యకాంతం) అనుమతించదు. అయితే, ఆమె తండ్రి (నాగయ్య) మనస్ఫూర్తిగా అంగీకరించడంతో ఈ పెళ్ళి జరుగుతుంది. క్రమంగా భారతీ-చంద్రశేఖరాల మధ్య అపార్థాలు పొడచూపి, వారిద్దరూ విడిగా ఉండడం మొదలుపెడతారు. భారతి మళ్ళీ చదువుకుని, వేరే ఊరిలో ఉద్యోగానికి వెళ్తుంది. అయితే, తన గతం అక్కడ కూడా తనని వెంటాడుతోందని గ్రహిస్తుంది. చెల్లెలి పెళ్ళికని తమ ఊరు వచ్చిన భారతి తిరిగి చంద్రశేఖరాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో, చంద్రశేఖరం కూడా భారతిని కలుస్తాడు. ఇద్దరూ పశ్చాత్తాపంతో, మనస్పర్ధలు మరిచి, కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు.
పాటలు
[మార్చు]- విన్నావా, ఓ విన్నావా - పి.భానుమతి, రచన: సి నారాయణ రెడ్డి
- నీటిలోనా, నింగిలోనా - పి.భానుమతి, పి.బి.శ్రీనివాస్, రచన: సి నారాయణ రెడ్డి
- నగుమోము గనలేని - పి.భానుమతి, రచన: సి నారాయణ రెడ్డి
- నుదుట బాసికము తీసినంతనే - పి.భానుమతి , రచన: సి నారాయణ రెడ్డి.
వనరులు
[మార్చు]వివాహబంధం చిత్ర వీసీడీ, ఆదిత్య వీడియోస్, హైదరాబాదు.
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (25 October 1966). "వివాహబంధం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 13 October 2017.[permanent dead link]