జెమినీ గణేశన్
Appearance
(జెమిని గణేశన్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జెమినీ గణేశన్ | |
---|---|
జననం | గణేశన్ 1920 నవంబరు 17 |
మరణం | 2005 మార్చి 22 | (వయసు 84)
ఇతర పేర్లు | కదళ్ మన్నాన్, సాంబార్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1947 - 2005 |
జీవిత భాగస్వామి | అలమేలు, సావిత్రి, పుష్పవల్లి |
జెమినీ గణేషన్ (నవంబర్ 17, 1920 - మార్చి 22, 2005) తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి సావిత్రి భర్త. ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్ గా వ్యవహరిస్తారు. ఇతను సైన్సు గ్రాడ్యుయేట్. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్ అనేక హిట్ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు[1]. మొదటిభార్య అలిమేలు. రెండో భార్య నటీమణి పుష్పవల్లి నటి రేఖ తల్లి. మూడో భార్య నటి సావిత్రి. తన 79వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు.
నటించిన తెలుగుసినిమాలు
[మార్చు]- సౌభాగ్యవతి (1959)
- మావూరి అమ్మాయి (1960)
- పవిత్ర ప్రేమ (1962)
- పతివ్రత (1964)
- శృంగార లీల (1976)
- రుద్రవీణ (1988)
- ఉన్నాల్ ముడియుం తంబి (1988)
- భామనే సత్యభామనే (1996)