Jump to content

శూద్రకుడు

వికీపీడియా నుండి

శూద్రకుడు ఒక భారతీయ రాజు, నాటక రచయిత. [1] మూడు సంస్కృత నాటకాల కర్తృత్వం ఆయనకు ఆపాదించబడింది - మృచ్ఛకటికమ్ (మట్టి బండి), వినావాసవదత్త నాటకాలు, పద్మప్రభృతక అనే ఏకపాత్రాభినయం. [1] [2]

గుర్తింపు

[మార్చు]
కాళిదాసు ఊహా చిత్రం.
అశ్వమేధ యాగ సందర్భంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు - రజ్మ్‌నామా నుండి ఒక దృశ్యం

మృచ్ఛకటికం నాటకం నాందిలో దాని రచయిత "శూద్రకుడు"గా ప్రసిద్ధి చెందిన రాజు అని పేర్కొంది. అతను తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అశ్వమేధ యాగం (గుర్రపు బలి) క్రతువు చేసాడు. తన కొడుకును కొత్త రాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత 110 సంవత్సరాల వయస్సులో ప్రాయోపవేశం చేసాడు. అతడు ఒక తెలివైన వ్యక్తిగా, ఋగ్వేదంలో, సామవేదము, గణితం, కామశాస్త్రాల్లో పరిజ్ఞానం ఉన్నవాడిగానూ, ఏనుగులకు శిక్షణ ఇవ్వడంలో నిష్ణాతుడిగానూ ఆ ప్రవేశిక పేర్కొంది. [3]

చారిత్రక రికార్డులు శూద్రకుడనే రాజు గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు (దీని అర్ధం "సేవకుడు"). మృచ్ఛకటికం లోని మొదటి నాలుగు అంకాలు వాస్తవంగా భాసుడి అసంపూర్ణ నాటకం చారుదత్తం నుండి సంబంధిత అంకాల కాపీయే. మృచ్ఛకటికం కవి భాసుడి అసంపూర్ణ నాటకాన్ని సభక్తికంగా ముగించి, తనను తాను భాసుడి "చిన్న సేవకుడు"గా పేర్కొన్నాడని ఒక సిద్ధాంతం ఉంది. [4]

పద్నాలుగో శతాబ్దం గద్యం ఒకటి, మృచ్ఛకటిక కర్తృత్వాన్ని భర్తృమెంథ, విక్రమార్కుల ద్వయానికి ఆపాదిస్తుంది. మృచకటికం ఉజ్జయిని నేపథ్యంగా చేసిన రచన. భర్తృమెంథ అనే పేరు గల, కాళిదాసుకు సమకాలీనుడైన కవి ఉండేవాడు. విక్రమాదిత్య కూడా ఉజ్జయినిలో నివసించాడు. అయితే, కాలక్రమాన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరిని మృచకాటిక రచయితలుగా గుర్తించడం అసాధ్యం. [5]

ఫార్లే పి. రిచ్‌మండ్ ప్రకారం, శూద్రకుడు కేవలం ఒక మిథ్యా వ్యక్తి. నాటకం యొక్క కర్తృత్వం అనిశ్చితం. [6] సా.శ. మూడవ శతాబ్దం నాటి ఆభీర రాజు - ఇంద్రాణి గుప్తాకు గాని, [7] ఈశ్వరసేనుడి తండ్రి శివదత్తుడికి గానీ కలంపేరు అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. [8]

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Banerjee, Biswanath (1999). Shudraka. Makers of Indian Literature. New Delhi, India: Sahitya Academy. p. 4. ISBN 81-260-0697-8.
  2. Bhattacharji, Sukumari History of Classical Sanskrit Literature, Sangam Books, London, 1993, ISBN 0-86311-242-0, p.93
  3. Farley P. Richmond (1993). Indian Theatre: Traditions of Performance. Motilal Banarsidass. pp. 55–57. ISBN 9788120809819.
  4. Farley P. Richmond (1993). Indian Theatre: Traditions of Performance. Motilal Banarsidass. pp. 55–57. ISBN 9788120809819.
  5. Farley P. Richmond (1993). Indian Theatre: Traditions of Performance. Motilal Banarsidass. pp. 55–57. ISBN 9788120809819.
  6. Farley P. Richmond (1993). Indian Theatre: Traditions of Performance. Motilal Banarsidass. pp. 55–57. ISBN 9788120809819.
  7. Warder, Anthony Kennedy (1990). "Chapter XX: Drama in the +3 ; Śūdraka; Contemporary Lyric Poetry". Indian Kāvya Literature, Volume 3 (second ed.). Delhi: Motilal Banarsidass. p. 3. ISBN 81-208-0448-1.
  8. Banerjee 1999, p. 9 citing Konow, Sten (1920). Das Indische Drama (in German). Berlin: Walter de Gruyter. p. 57.{{cite book}}: CS1 maint: unrecognized language (link)