భాసుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భాసుడు అత్యంత ప్రతిభావంతుడు.భాసుడు ప్రసిద్ధమైన కథలనే ఇతివ్రత్తాలుగా బంగారు పంటలు పండించాడు.

ప్రాంతం[మార్చు]

భాసుడు ఏ ప్రాంతానికి చెందినవాడన్న విషయంలో ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టం.ఈ భాసుడు ఏ కాలంవాడు?భాసుడి నాటకాలలో ఎక్కడా 'సొంత ఘోష వినిపించదు,కనిపించదు.అసలు భాసుడి పేరే కనిపించదు.ఇక ఆయన ఎక్కడివాడో,ఎప్పటివాడో,ఎవరి పోషణలో ఉన్నాడో తెలిసే దెక్కడ? మరో విశేషం ఏమిటంటే,భాసుడు గౌతమ బుద్దుడి రచనలలో హైందవ ధర్మం,వర్ణాశ్రమ వ్యవస్ధ పట్ల గౌరవం పదే పదే కనిపిస్తాయి.కానీ బౌద్దం ఊసే కనబడదు.

నాటకాలు[మార్చు]

ఉత్తమశ్రేణి కవిగా భాసుడికి అనంతర కవులు మరెందరో కూడా పేర్కొన్నారు. క్రీ.శ. ఏడో శతాబ్దంలో బాణభట్టు,ప్రణాళికా బద్ధమై,బహుభూమికలు కలిగి,సూత్రధారుడి ప్రవేశంతో ఆరంభమయ్యే భాస నాటకాలను కొనియాడాడు.తొమ్మిదో శతాబ్దంలో రాజశేఖరుడు భాసుడి నాటకాలన్నిటినీ కలిపి 'భాసనాటక చక్రం'గా అభివర్ణించాడు.పదో శతాబ్దంలో అభినవగుప్తుడూ,పదకొండో శతాబ్దంలో భోజుడూ,పన్నెండో శతాబ్దంలో జయదేవుడూ మొదలైన అలంకారికులందరూ భాసుడి రచనలలో పరిచితులే,భాసుడిని సాదరంగా స్మరించినవారే.పెద్దన్న(16వ శతాబ్దారంభం) భాసుడిని స్తుతించాడు.భాసుడు నాటకాలు చదవగానే భావాలు హృదయంలో సూటిగా ప్రవేశించి అనుభూతులు రేపుతాయి. భాసుడు తన నాటకాలలో విధి విలాసాన్ని చాలా చక్కగా చిత్రిస్తాడు. నాటకాల జాబితా:

 • దూతవాక్యం
 • కర్ణభారం
 • దూత ఘటోత్కచ0
 • ఊరుభ0గ0
 • మధ్యమవ్యాయోగ0
 • పంచరాత్రం
 • అభిషేక0
 • బాలచరిత్ర
 • అవిమారక0
 • ప్రతిమ
 • ప్రతిజ్ఞ యౌగ0ధరాయణ0
 • స్వప్నవాసవదత్త
 • చారుదత్త
 • యజ్ఞఫల0

ఈ పద్నాలుగు నాటకాలను భాస నాటక చక్ర0 అంటారు.

ప్రతిభ[మార్చు]

భాసుడి రచన నిరాడంబరంగా,ప్రసన్నంగా,సరళంగా ఉంటుంది.ఇది మహాకవుల లక్షణమే కదా!భాసుడి వర్ణనలూ,సంభాషణాలూ క్లుప్రంగా,పొందికగా ఉంటాయి.అతని రచనలన్నీ ప్రదర్శనకు వీలుగా ఉండేవే.కాళిదాసంతటి ప్రతిభావంతుడు భాసుని రచనా సంవిధానానికి పరవశుడయ్యాడు.అతని మహా ప్రతిభకు ముగ్ధుడై జేజేలు పలికాడు.

కళ[మార్చు]

ఈ విధంగా భానుడు తన అపూర్వ నాటక కళా చాతుర్య0తో ,కథా కల్పనా నైపుణ్య0తో తరువాతి కవులను ప్రభావిత0 చేశాడు.

"http://te.wikipedia.org/w/index.php?title=భాసుడు&oldid=1060933" నుండి వెలికితీశారు