మానవత్వం
Appearance
సృష్టిలో మానవత్వాన్ని (Humanity) మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు .
- మానవత్వం అంటే
- కరుణ (బాధితులపట్ల కనికరం చూపటం)
- ప్రేమ (కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం),
- దయ ( ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం)
- అహింస ( హింసకు పాల్పడకపోవటం)
- మానవ ప్రేమే మానవ ఆదర్శం
- ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న
- వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి
- మానవతావాదం సాంప్రదాయిక మతసిద్ధాంతాలకు విరుద్ధమైనది
- మానవతావాదం పరిణామ సూత్రంగా అన్ని అవరోధాల్ని అధిగమిస్తుంది
మానవతావాద కవితలు
[మార్చు]- మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్ఠం గానూ చూస్తావేల బేలా? దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా? కన్ను తెరచిన కానబడడో? మనిషి మాతృడియందు లేడో? యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?--గురజాడ
- మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా? సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా-- (శ్రీశ్రీ)
- మానవతా మందిరాన మంటలు రగిలించకూడదు -- గంగినేని
- 'ఏ కులము వెన్నెలది? తెమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి అట్టిదే కద మానవత్వము అన్నిటికి ఎత్త్తెన సత్వము -- సి.నారాయణరెడ్డి
- మీ ధ్వంస మనస్తత్వం లోంచే మిమ్ము సర్వనాశనం చేసే మహోగ్ర మానవతా విప్లవ శక్తి జనిస్తుంది' --దేవిప్రియ
- మానవత్వం మాత్రం ప్రతిరోజూ ప్రతిక్షణం పుట్టిచచ్చే వెలుగుకిరణం మానవత లేని లోకాన్ని స్తుతింపలేను మానవునిగా శిరసెత్తుకు తిరగలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను..'--చెరబండరాజు'