Jump to content

ప్రేమ

వికీపీడియా నుండి

ప్రేమ ఒక బలమైన సానుకూల మానసిక, భావోద్వేగపు స్థితి. ఇది మనుషుల మధ్య ఉన్న లోతైన ఆప్యాయత.[1][2] ఇది వేర్వేరు స్థాయిల్లో వేర్వేరు రకాలుగా ఉంటుంది. కుటుంబ ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఏ ఆకర్షణా లేని స్వచ్ఛమైన ప్రేమ (ప్లేటోనిక్ లవ్), స్వీయ ప్రేమ, భక్తి (భగవంతుడిపై ప్రేమ), ఇలా పలు రకాలుగా ఉంటుంది. ఒక్కో ప్రేమ ఒకలా ఉంటుంది. ఉదాహరణకు, తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమకు, ఆహారంపై ఉన్న ప్రేమకు తేడా ఉంటుంది. ప్రేమ ఉన్నచోట బలమైన ఆకర్షణ, భావోద్వేగంతో కూడుకున్న అనుబంధం ఉంటుంది.[3]

మనుషుల మధ్యనే కాక మనుషులకు వస్తువుల మీద కూడా ప్రేమ ఉండవచ్చు. ఉదాహరణకు నాకు గోంగూర అంటే ఇష్టం లేదా నాకు సేవ చేయడం ఇష్టం అనేవి కూడా ప్రేమ రూపాలే. ఎక్కడైతే ఈ అనుబంధం ఉంటుందో దాని పట్ల అంకిత భావం, అనురాగం ఉంటుంది. వ్యక్తుల మధ్య ప్రేమ కేవలం ఇష్టం అని కాకుండా మరింత బలంగా ఉంటుంది. 20వ శతాబ్దంలో మానసిక శాస్త్రంలో భాగంగా ప్రేమ గురించి అధ్యయనం చేశారు. మానసిక శాస్త్రం ప్రేమను ఒక మేధో, సామాజిక దృగ్విషయంగా చెబుతుంది. జీవ పరిణామంలో భాగంగా మనుషులు ప్రేమను తమ మనుగడకు ముఖ్యమైన కారణంగా పేర్కొంటారు. ఇతర క్షీరదాలతో పోలిస్తే మనుషులు తమ ఎదుగుదలకు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధార పడతారు.

మూలాలు

[మార్చు]
  1. "Definition of love in English". Oxford English Dictionary. Archived from the original on 2 May 2018. Retrieved May 1, 2018.
  2. "Meaning of love in English". Cambridge English Dictionary. Archived from the original on 2 May 2018. Retrieved May 1, 2018.
  3. Oxford Illustrated American Dictionary. Oxford University Press. 1998. p. 485.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమ&oldid=4359392" నుండి వెలికితీశారు