చర్చ:మానవత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • మనసు మంచి 'ముత్యం

బస్టాండ్‌లు.. రైల్వేస్టేషన్‌లు.. చెత్తకుప్పలు... ఆస్పత్రులు.. గుళ్లు.. ఇలా ఎక్కడెక్కడో వదిలేసిన నెలల శిశువులను అక్కున చేర్చుకుంటుందామె. పురిటిబిడ్డలను పొదివిపట్టుకుని పెంచిందామె. లాలపోసింది... బువ్వపెట్టింది... పెద్దయ్యాక విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లిళ్లు చేసే బాధ్యతకూడా తానే స్వీకరించింది. పొత్తిళ్లలో శిశువులుగా ఆమె నీడన చేరిన ఎందరో నేడు పట్టభద్రులయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. అయినా, ఆమెతో అనుబంధాన్ని మాత్రం వీడలేదెవరూ. ఇంతకీ ఈమె ఎవరంటారా! కర్నూలు జిల్లాకు చెందిన ]] . ఇరవై ఎనిమిదేళ్లుగా ఇదే సేవలో తరిస్తోంది. ముత్తులక్ష్మి పెళ్లే చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశమే ఆమెకు కలుగలేదు. మదర్ థెరిస్సానే స్ఫూర్తి అంటుందామె. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ముత్తులక్ష్మి ఆశ్రమం ఉంది. ముత్తులక్ష్మి స్వగ్రామం మంత్రాలయం మండలం ఖగ్గలు . ముంబాయిలో ఉండేవారామె తలిదండ్రులు. అప్పుడే ఆమెలో ఈ సేవాతత్పరతకు బీజం పడింది. 'పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు మా బడికి మదర్ థెరిస్సా వచ్చారు. పిల్లలందరినీ ముద్దాడిన మదర్ నన్ను మాత్రం పట్టించుకోనేలేదు. ఎంతో చిన్నబుచ్చుకున్నాను. బోలెడంత ఏడుపొచ్చింది. కనీసం ఆమె చేతిస్పర్శ భాగ్యం కూడా కలగలేదే.. ఎందుకిలా జరిగిందని నాలో నేనే కుమిలిపోయా. అయితే, మదర్ వీడ్కోలు తీసుకునేముందు నవ్విన నవ్వు మరచిపోలేకపోయాను. ఆమె చూపు నన్ను వెన్నాడుతూనే ఉండేది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. రైల్వేఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు వినపడిన పసిపాప ఆక్రందన నన్ను కదిలించింది. వెతగ్గా ప్లాట్‌ఫారంపై ఎవరో వదిలి వెళ్లిన పసిగుడ్డు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడర్థమైంది. ఇక నుంచి నేనాచరించాల్సిన ధర్మం అదేనని. మదర్ సందేశం కూడా అదేనేమో..' అంటుందామె 28 ఏళ్లనాటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ... తర్వాతే జ్యోతిఆశ్రమం ఏర్పాటైంది. దాని నిర్వహణకోసం ముత్తులక్ష్మి ఎవరి పైనా ఆధారపడాలనుకోలేదు. కూలీ డబ్బులతోనే ఉన్నంతలో అందరికీ భోజనం పెట్టగలిగింది. ధర్మాత్ములందించిన సాయంతో శక్తిమేరకు పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పించింది. తానేదో ఘనకార్యం చేశాననుకోవడం లేదంటుందామె. ఉన్నంతలో ఆర్తులకు సాయపడ్డానన్న సంతృప్తి చాలు అంది . ఉడతాభక్తిన సాటిమానవులకు ఆమె చేస్తున్న సాయం అభినందనీయం కాదంటారా!(ఈనాడు 14.10.2008)

  • మానవత్వానిదే పైచేయి!

ముష్కరులు నిప్పెట్టిన ఇంట్లోకి ధైర్యంతో ముందడుగు-ముస్లిం కుటుంబానికి రక్షణ-భైంసాలో హిందూ వృద్ధురాలి ఔదార్యం ఆదిలాబాద్, న్యూస్‌టుడే: ఆదిలాబాద్ జిల్లాభైంసా లో దుర్గామాత ఉత్సవాలు.. అందరూ సంతోషంగా, ఉత్సాహంగా చూస్తున్నారు. పంజేషాచౌక్ వద్దకు రాగానే ఏం జరిగిందో ఏమో! ఒక్కసారిగా రాళ్ల వర్షం మొదలైంది. అల్లరిమూకలు ఇళ్లపైబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. తలుపులు పగులగొట్టి లోపలికి వస్తున్నాయి. జనమంతా భయభ్రాంతులయ్యారు. ముష్కరుల స్వైరవిహారాన్ని తలుపు సందుల్లోంచి చూస్తున్నారు. ఇంతలో తమకు తెలిసిన ఒక కుటుంబం.. తమ ఇంటి ఎదురుగానే అల్లరిమూకల కంట పడింది. దుండగులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. వారు మంటల్లో చిక్కుకొన్నారు. అందరూ ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో తలదూర్చితే ఏమైనా జరిగే ముప్పు! దీనికి ఆ 65 ఏళ్ల మహిళ భయపడలేదు. మానవత్వంతో ముందుకు కదిలారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపైకి వచ్చారు. తమతో కలిసిమెలిసి ఉండే ఆ ముస్లిం కుటుంబాన్ని అగ్నికీలల నుంచి రక్షించి తన ఇంటికి తెచ్చుకొని ఆశ్రయమిచ్చారు. ఆ హిందూ మహిళే తుల్జాబాయి . చాలా మంది అనుకొంటున్నట్టు భైంసా ప్రజలు రెండుగా విడిపోలేదు. అందుకు మానవత్వం తో తుల్జాబాయి చేసిన సాహసమే తాజా నిదర్శనం. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భైంసాలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. పంజేషాచౌక్ వద్ద మసీదు దాటిన తరువాత చిన్నపాటి కిరాణా దుకాణం ఉంది. అక్కడే తన కొడుకులు, కోడళ్లు, మనువళ్లు, మనుమరాళ్లతో తుల్జాబాయి ఉంటున్నారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం మొదలై అల్లరిమూకలు స్వైరవిహారం చేస్తుంటే.. అక్కడి జనమంతా ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు మూసుకొన్నారు. తుల్జాబాయి కుటుంబానిదీ అదే పరిస్థితి. కిటీకీ సందుల్లోంచి బయటకు భయంభయంగా చూస్తున్నారు. వారి ఇంటికి ఎదురుగా ఉండే సయ్యద్ ఉస్మాన్ ఇంట్లోకి అల్లరిమూకలు ప్రవేశించాయి. ఉస్మాన్ రిక్షా నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంఘటన సమయంలో ఆయన ఇంట్లో లేరు. దుకాణానికి వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య నసీమా, నలుగురు పిల్లలు ఉన్నారు. ముష్కరులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ పరిణామంతో హతాశురాలైన తుల్జాబాయి హృదయం తల్లడిల్లిపోయింది. ఘోరం ఆపేందుకు వెంటనే తలుపులు తెరిచి కొడుకులు, మనుమలను తీసుకుని ఉస్మాన్ ఇంటిలోకి ప్రవేశించారు. తమ వెంట బిందెలతో తెచ్చిన నీళ్ళు మంటలపై చల్లి నసీమా, నలుగురు పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల సాయంతో రాత్రి 7.30 అప్పుడు ఉస్మాన్ ఘటనాస్థలానికి చేరుకుని తన కుటుంబం గురించి ఆరాతీశారు. తుల్జాబాయి నివాసంలో సురక్షితంగా ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకొన్నారు. జరిగిన సంఘటన నుంచి తేరుకోవడానికి కట్టుబట్టలతో బాధిత కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. తుల్జాబాయి కి చంద్రబాబు ప్రశంస వర్గాల మధ్య ఘర్షణల్లో తుల్జాబాయి చూపిన తెగువను, మానవత్వాన్ని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రశంసించినప్పుడు ఈ విషయం తెలిసింది. నాటి ఘటన కళ్ల ముందు కదలుతోందని ఆమె 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. అల్లరిమూకల చేతిలో కత్తులు, కటార్లున్నాయి. విచక్షణరహితంగా ప్రవరిస్తూ ఇళ్లకు నిప్పుపెట్టాయి. దుండగులు ఇక్కడి వారు కాదు. వారు బయటి నుంచి వచ్చినట్టుగానే ఉంది అని ఆమె తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తామందరం కలిసిమెలిసి ఉంటున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఘర్షణ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.(ఈనాడు 14.10.2008) మానవత్వాన్ని కాపాడిన అమ్మవు నీవు అంటూ గద్దర్ తుల్జాబాయికి పాదాభివందనం చేశారు.(ఈనాడు 15.10.2008)

  • మద్యంలో కలిసిన మానవత్వం

రాజమండ్రి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు దుర్మరణం చెంది మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రమాదానికి గురైన లారీలోని బీరు సీసాల కోసం మందుబాబులు ఎగబడ్డారు. రాజమండ్రి నగరం మోరంపూడి సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున మద్యం సీసాల లారీ ఎదురుగా వెళుతున్న ట్రాలర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మద్యం సీసాల లారీ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ధ్వంసమైన లారీ క్యాబిన్ శిథిలాల్లో ఇరుక్కున్న అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ఒక పక్క నానా హైరానా పడుతుంటే వారికి సహాయపడాల్సింది పోయి కొందరు బీరుసీసాలు అపహరించుకుపోయేందుకు పాకులాడారు.(ఈనాడు15.10.2008)

  • ముస్లిం యువకుని ఔదార్యం

భైంసా నిర్మల్ పట్టణాలలో మతఘర్షణలకు పాల్పడిన వారికి ఇది కనువిప్పు.హిందూ కుటుంబానికి చెందిన నరసింహరావు వర్మ కూతురు నిమిషా కు 11 నెలల పాపకు ముస్లిం యువకుడు అసద్ బిన్ సలామ్ రక్తదానమిచ్చి ప్రాణాలు కాపాడి మత సామరస్యాన్ని చాటాడు.ఇరువర్గాలూ మతవిద్వేషాలతో రగిలిపోతున్న సమయంలో మతోన్మాదులకు తన మానవత్వంతో కనువిప్పు కలిగించాడు.(సాక్షి 15.10.2008)