రుద్రాక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రుద్రాక్ష చెట్టు
రిషికేశ్ లోని రుద్రాక్ష చెట్టు
చెట్టుకు కాసిన రుద్రాక్ష కాయ
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
E. ganitrus
Binomial name
Elaeocarpus ganitrus

రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.

రుద్రాక్షలు - రకాలు

[మార్చు]
శ్రీశైలం వీధుల్లో రుద్రాక్షల అమ్మకం
రుద్రాక్షలు

రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు Archived 2011-07-28 at the Wayback Machine పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఒక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

రకాలు

వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదఐదు ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.[1]

  • ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)

అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

  • ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)

దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

  • త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)

దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

  • చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)

నాలుగు వేదాల స్వరూపం

  • పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)

పంచభూత స్వరూపం

  • షట్ముఖి (ఆరు ముఖములు కలది)

కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

  • సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)

కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

  • అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)

విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

  • నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

  • దశముఖి (పది ముఖాలు కలిగినది)

దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ, డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు

తిరుచానూరు అమ్మవారి గుడి ముందు రుద్రాక్ష మాలలు అమ్ముతున్న దృశ్యం

పూజలలో రుద్రాక్షలు

[మార్చు]

రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.

వైద్యంలో రుద్రాక్షలు

[మార్చు]

రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును.

వ్యాపారంలో రుద్రాక్షలు

[మార్చు]

మనదేశంలో ప్రతీ సంవత్సరమూ 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మాట్రిక్స్ అనే సంస్థ 2011 జూలై 7 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుధ్రాక్ష మాలలు ఎర్ర చందనం దుంగలనుండి తయారు చేస్తారు [2][3]

రుద్రాక్ష ధరించడానికి నియమాలు

[మార్చు]

ఈ నియమాలన్నీ శివ పురాణం, పద్మ పురాణం'' మరియు శ్రీమద్ దేవి భాగవతం వంటి వివిధ వేద గ్రంధాల ఆధారంగా లేదా అనేక సంవత్సరాలుగా రుద్రాక్ష ధరించిన వ్యక్తుల అనుభవాలపై ఆధారపడి ఉంటాయి. ఆధారంగా ఉంటాయి. [4] [5] [6] [7]

రుద్రాక్ష ధరించడానికి ఇక్కడ నియమాలు ఉన్నాయి:

1. స్నానం చేసేటప్పుడు తీసివేయండి.

2. మరణ అంత్యక్రియలను సందర్శించేటప్పుడు తీసివేయండి.

3. నిద్రపోతున్నప్పుడు తీసివేయండి.

4. మీ రుద్రాక్షను ఎవరితోనూ పంచుకోవద్దు.

5. నాన్ వెజ్ లేదా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మీరు రుద్రాక్ష ధరించవచ్చు.

6. స్త్రీలు & పిల్లలు రుద్రాక్ష ధరించవచ్చు.

7. మీరు టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు ధరించవచ్చు.

8. ప్రతి 6 నుండి 8 నెలలకు ఒకసారి శుభ్రం చేయండి.

9. శక్తివంతం చేసిన తర్వాత మాత్రమే ధరించండి.

మూలాలు

[మార్చు]
  1. http://archives.eenadu.net/05-18-2014/Magzines/SundaySpecialInner.aspx?qry=features8[permanent dead link]
  2. http://www.tupaki.com/news/view/red-sandalwood-smugglers-on-rudraksha/102378
  3. eenaduindia, Sat, 30th May 2015, 10:42 IST
  4. hi&_x_tr_pto=tc "Shrimad Devi Bhagavatam Book 11 Chapter 3". devi-redjambala-com. {{cite web}}: Check |url= value (help)
  5. "Rules of Wearing Rudraksh". Ekrudraksha.
  6. "अध्याय 20 - The Great Efficacy of Rudraksha: The Story of Mahananda". wisdomlib.
  7. "Significance of Rudraksha and Tulsi". कामकोटी.org.

లంకెలు

[మార్చు]