సాలగ్రామం

వికీపీడియా నుండి
(సాలిగ్రామం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శిలాజనిర్మిత సాలగ్రామ శిలలు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది.అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజాసమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

సాలిగ్రామాలు అన్నవి నునుపుగా, గుండ్రముగా గానీ కోడిగుడ్డు ఆకారములో కాల్వల్లో, నదీ తీరాల్లో దొరికే రాళ్ళు. వాటి ఆకారం, నునుపుదనం చూసి వాటికి అతి త్వరగా ఆకర్షితులం అవటం చాలా సులభం. వీటిని దైవ స్వరూపాలుగా భావించడం జరుగుతుంది. హిందూ దైవిక పూజల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది కూడా. చాలా పురాతన కాలాల నుండి వీటి ఉనికి ఉంది. సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి.[1] ఇవి సాధారణంగా నదీ తీరాల వెంట దొరుకుతూ ఉంటాయి. పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు - నదుల్లో స్నానాలకి వెళ్ళినపుడు చాలామంది వీటిని ఇంటికి తెచ్చుకొని, పూజామందిరాల్లో పెట్టుకుంటారు. ప్రవహించే నదుల ప్రవాహ ఒరవడికి నదీ జలాలతోటే కొట్టుకవచ్చే చిన్న చిన్న రాళ్ళు ఒకదానితో మరొకటి తగిలి, కాలక్రమాన ఇలా నునుపుగా మారి, ఆకర్షణీయముగా అగుపిస్తాయి. ఆకర్షణీయంగా అగుపించే నున్నటి రాళ్ళన్నీ సాలగ్రామాలు కావు.గండకీ నదిలో దొరికే ఓ ప్రత్యేకమైన శిలలను సాలగ్రామాలుగా పరిగణలోకి తీసుకోవడం కద్దు.

వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. వీటిని గురించి నేను ఒకరి వద్ద తెలుసుకున్నప్పుడు వారి కొన్ని వివరాలతో బాటు ఒక కథ కూడా చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వాటి శక్తి గురించి తెలిసినవారికి ఈ కథని తేలికగా నమ్ముతారు. ఆ కథని మీకోసం అందిస్తున్నాను.

కథ[మార్చు]

లక్ష్మీనరసింహ సాలగ్రామ శిల
శంఖు రూప సాలగ్రామం
దస్త్రం:Shaligram (1) .jpg
సాలగ్రామ శిలలు
సాలగ్రామ శిలలు
సాలగ్రామ శిలలను ఇళ్ళలో ఇలా పూజిస్తుంటారు
సాలగ్రామ రూప మీరాభాయి

పూర్వం ఒక ఊరిలో మాంసం అమ్మే విక్రయదారుడు ఉండేవాడు. ( ఈ చండాలుడి ప్రస్తావన నిజమే - నేను మార్చినది కాదు. సాంప్రదాయ వాళ్ళు మన్నించాలి. ) అతనికి సరియైన బేరాలు లేక ఎప్పుడూ అంతంత మాత్రం ఉండే ఆదాయముతో జీవనాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు అతను నదీస్నానాలకు వెళ్ళినప్పుడు స్నానం చేసిన చోట కొన్ని రాళ్ళు అగుపిస్తాయి. అందులో ఒక రాయి నల్లగా, చాలా నునుపుగా ఉండి, చాలా ఆకర్షించింది. వద్దని అక్కడే వదిలేసి, ఒడ్డుకి వచ్చినా ఆ రాయి అతని మది నుండి దూరం కాలేదు. ఎందుకిలా అవుతున్నది.. అనుకుంటూ మళ్ళీ నదిలోకి దిగి ఆ రాయిని తీసుకొని, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినా అతని దృష్టిపథం నుండి ఆ రాయి తొలగిపోలేదు. ఆరోజు అంతా ఆ రాయి ఆకర్షణలో పడిపోయాడు. కానీ ఆ రాయి ఒక సాలిగ్రామం అని అతనికి తెలీదు.

మరునాడు యధావిధిగా తన మాంసం అమ్మే విక్రయశాలకు వెళ్ళినప్పుడు కూడా వెంట ఆ రాయిని పట్టుకెళ్ళాడు. దాన్ని ఎక్కడ ఉంచాలో తెలీక డబ్బులు ఉంచే గల్లా పెట్టెలో పెడతాడు. మాంసం ముట్టిన చేతులతో, డబ్బులని తీసిస్తున్న సమయాల్లో ఆ రాయికి మాసం వాసన తగిలేది. అలా దానికి నైవేద్యముగా పెట్టినట్లయ్యింది. నిత్యం ఉండే మాంసం విక్రయాల వల్ల ప్రతిరోజూ నైవేద్యం చాలా బాగా అందేది. అలా రాయి ధనాత్మక శక్తిని క్రమక్రమేణా పొందుతూ ఉంది. అలాగే ఆ రాయి వచ్చినప్పటి నుండి ఆ మాంసం విక్రయశాల అమ్మకాలు జోరందుకున్నాయి. అంచలంచలుగా అంతాని వ్యాపారం పెరిగి, బాగా ధనికుడయ్యాడు. ఈ రాయి వల్ల బాగా వృద్ధిలోకి వచ్చాను అనుకున్న ఆ మాంసం కొట్టు విక్రేత దాన్ని అదే గల్లా పెట్టిలోనే అట్టిపెట్టాడు.

అతి త్వరలోనే ఆ కొట్టువాడు గొప్పవాడు అయిన విధానం ఏమిటో చూచాయగా తెలుసుకున్న ఒక పండితుడు ఒక పూజకని ఆ కొట్టు అతని వద్దకి వెళ్ళుతాడు. అప్పుడు ఆ రాయిని గురించి తెలుసుకొని పరిశీలనగా చూసి, అసలైన సాలిగ్రామంగా తెలుసుకొని, ఆ కొట్టువాడు ఏమరుపాటుగా ఉన్న సమయాన ఆ రాయిని కొట్టేసి, ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ సాలిగ్రామానికి ఎన్నో పూజలు చేస్తాడు. ఎన్నెన్నో రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తాడు. కానీ మాంసం నైవేద్యానికి అలవాటు పడ్డ ఆ సాలిగ్రామం ఆకలిగా ఉండిపోయి, తన ధనాత్మక శక్తి స్థానంలో ఋణాత్మక శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు ఆ పండితుడు నానా అగచాట్లకి గురి అయ్యి నాశనం అవుతాడు.

సాలిగ్రామం ఇంతటి శక్తివంతం అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చును.

వైష్ణవ దివ్యక్షేత్రాలు[మార్చు]

108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో శాళక్కిఱామం (సాలగ్రామమ్‌) ఒకటి [1].

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
శ్రీమూర్తి పెరుమాళ్ శ్రీదేవి తాయార్ గండకీ నది, చంద్ర తీర్థము ఉత్తరముఖము నిలచున్న భంగిమ పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కనక విమానము గండకీ అనువేశ్యకు-శివునకు-బ్రహ్మకు

విశేషాలు[మార్చు]

ఇచ్చట మఠములు, రామానుజ కూటములు ఉన్నాయి. ఇకడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని ఇక్కడ టలేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించారని కొందరు పెద్దలు చెప్తుంటారు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు ఉన్నాయి. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు ఉన్నాయి.

స్థలపురాణం[మార్చు]

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్బతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పెనట. ఆపడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు అష్టాదశ పురాణములను వినిపించెను.

స్వయం వ్యక్తక్షేత్రము. నేపాల్ దేశమున గలదు. ఖాట్మండుకు 175 మైళ్ల దూరమున గల ముక్తినాధ్‌క్షేత్రమే సాలగ్రామమని కొందరి అభిప్రాయం. (ఖాట్మండుకు 65 మైళ్ల దూరమున గల దామోదర కుండమే సాలగ్రామమని కొందరి అభిప్రాయము) గండకీనది జన్మస్థానము. ఈనదిలోనే మనము ప్రతినిత్యము ఆరాధన చేయు సాలగ్రామములు లభిస్తాయి.

మార్గము[మార్చు]

లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ. దూరం లోనూ కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలు మార్గంలో నైమిశారణ్యం స్టేషన్ ఉంది. అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. ఇకడ అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి. ఇది నేపాల్ రాజధాని ఖాట్మండుకు 100 కి.మీ.

సాహిత్యం[మార్చు]

శ్లో. గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||

పాశురాలు[మార్చు]

పా. కలై యుమ్‌ కరియుమ్‌ పరిమావుమ్; తిరియుమ్‌ కానమ్‌ కడన్దుపోయ్,
   శిలై యుమ్‌ కణై యుమ్‌ తుణై యాగ; చెన్ఱాన్ వెన్ఱిచ్చెరుక్కళత్తు;
   మలై కొణ్డలై నీరణై కట్టి; మదిళ్ నీరిలజ్గై వాళరక్కర్
   తలై వన్, తరై పత్తుఱత్తుగన్దాన్; శాళక్కిరామ మడై నె--.
           తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 1-5-1

మంచిమాట[మార్చు]

ఒకనాడు ఒక శ్రీవైష్ణవులు నంబిళ్ల గారిని ఇట్లు అడిగిరి. "కాకాసురుడు పాదములపైబడి శరణువేడినను శ్రీరామచంద్రమూర్తి ఆతని కంటి నొకదానిని పోగొట్టెను గదా! కావున శరణాగతుడైనను పూర్వకర్మను అనుభవించియే తీరవలెనా? "సాధ్య భక్తి స్తు:సాహన్త్రీ ప్త్రారబ్ధస్యాపి భూయసీ" అనునట్లు సాధ్య భక్తి ప్రారబ్ధమును కూడా పోగొట్ట వలదా! అందుకు నంబిళ్లైగారి సమాధానము, "నిజమే, కానీ అంతటి అపరాధియైన కాకాసురుని క్షమించి విడిచిన దానికి గుర్తుగా అట్లు చేరి. అంతేకాదు రెండు కళ్లతో చేయు పనిని ఒక్కకంటితోనే చేయగల ఉపకారమును సైతము చేసిరి కావున అది దండించుటయు కాదు."

పంచాయతనం[మార్చు]

పంచాయతనంలో ఉండే ఐదు మూర్తులు:

  • ఆదిత్యం - స్ఫటికం
  • అంబికాం - లోహం
  • విష్ణుం - సాలగ్రామం
  • గణనాథం - ఎర్రరాయి
  • మహేశ్వరం - బాణం

ఈ ఐదింటికీ పూజ చేయడాన్ని పంచాయతన పూజ అంటారు. వీటిలో ఏది మధ్యలో ఉంటే ఆ పంచాయతనం అంటారు. సాలగ్రామాన్ని మధ్యలో ఉంచితే 'ఆదివిష్ణు పంచాయతనం' అంటారు.

సతీ తులసి కథ[మార్చు]

పూర్వం జలంధరుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. మునులు, దేవతలు తమను రక్షించమని విష్ణువుతో మొరపెట్టుకున్నారు. జలంధరుడి భార్య వృందాదేవి చేసే పూజల ఫలం రక్షణ మూలంగా జలంధరున్ని చంపడం శివుడి వల్ల కూడా కాలేదు. దాంతో విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. వెంటనే శివుడు జలంధరున్ని సంహరించాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి కఠినశిలవైపొమ్మంటూ విష్ణువును శపించింది. విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి అనుగ్రహించగా తులసి మొక్కగా మారింది. విష్ణువు సాలగ్రామ రూపు ధరించాడు.

గండకీనదిలో లభించే సాలగ్రామాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి లక్ష్మీనారాయణుడు, లక్ష్మీజనార్ధనము, రఘునాధము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రారాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము. ప్రతిరోజూ సాలగ్రామము, తులసి, శంఖాలను పూజించేవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణకథనం.

మరికొన్ని విశేషాలు[మార్చు]

Balaji in Pearl coat and with a garland of 108 Saligrama Silas
  • సాలగ్రామాల రంగు, వాటిమీద ఉండే ముద్రలను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అలాంటి 12 రకాల సాలగ్రామాలు ఉండి పూజింపబడే ఇల్లు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలతో సమానం అని అంటారు.
  • సాలగ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి నిత్యం అభిషేకం, నైవేద్యం చేయాలి. అలా చేయలేనివారు వాటిని వేరెవరికైనా దానమివ్వడం మంచిది. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు. దానిని జలవాసం అంటారు. ఏదైనా ఆలయంలో దానిని ఉంచవచ్చును.
  • సాలగ్రామాలను కొనరాదు. ఇవి వంశపారంపర్యంగా రావాల్సిందే. అందుకే సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అన్నారు.
  • మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఈనాడు వ్యాసం ఆధారంగా...

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-10. Retrieved 2016-02-22.