Jump to content

దీవెన

వికీపీడియా నుండి
క్రీస్తు ఆశీర్వదించడం
హిందూ వివాహ ఆశీర్వాదం

పవిత్రత్వము, ఆధ్యాత్మిక విముక్తి, దైవ సంకల్పం, లేదా ఒక ఆశ లేదా ఒకరి ఆమోదముతో ఎంతో కొంత ప్రేరేపించబడటాన్ని దీవెన అంటారు. వ్యక్తులు, దీవెన అదృష్టాన్నిచ్చే మార్గం అనుకుంటారు. కొన్నిసార్లు మతాచారులు దేవుడు వారిని మంచిగా చూడాలని కోరుకుంటారు, లేదా ప్రజలే దేవుడిని మంచిగా దీవించమని కోరుకుంటారు. పూజారులు మతమరమైన వస్తువులను పవిత్రమైనవిగా మార్చేందుకు కూడా ఆశీర్వదిస్తారు.దీవెనను ఆశీర్వాదం అని కూడా అంటారు. దీవెనను ఆంగ్లంలో బ్లెసింగ్ అంటారు.

బ్లెసింగ్ పద చరిత్ర

[మార్చు]

ఆధునిక ఆంగ్ల భాషా పదం బ్లెస్ పాత ఇంగ్లీష్ పదం బ్లెసెన్ (సా.శ.950 నాటి నార్తంబ్రియన్ మాండలికంలో భద్రపరచబడిన) నుండి ఉద్భవించింది. ఈ పదం ఇంకా 830 ముందు ప్రోటో జర్మానిక్ వారు ఉపయోగించిన బ్లెడ్ సియన్ పదం నుండి, 725, 1000 నాటి ఆంగ్లో సాక్సాన్ అన్యమత, జెర్మేనిక్ అన్యమతత్వ కాలంలో ఉపయోగించిన బ్లెట్ సియన్ నుండి ఉద్భవించింది. మొత్తం మీద వీటి అర్థం పవిత్రమైనదిగా లేదా పరిశుద్ధమైనదిగా చేయడానికి ఒక ఆచారములా త్యాగం చేయడం. ఈ పదం బ్లడ్ (రక్తం) అనే పదంతో సంబంధం కలిగి ఉంటుంది.క్రైస్తవీకరణ అనువాద ప్రక్రియలో బైబిల్ యొక్క అనువాదాన్ని పాత ఇంగ్లీషులోకి మార్చు సమయంలో లాటిన్ పదం మంచిపలుకు పలకడం ద్వారా మంచి ఫలితం అని అర్థానిచ్చే బెనిడిసిరే అనే పదం నేటి పదం యొక్క ఆధునిక అర్థంగా ప్రభావితమై ఉండవచ్చు.

దీవెనలు

[మార్చు]
  1. అవిఘ్నమస్తు
  2. కళ్యాణమస్తు
  3. తథాస్తు
  4. విజయోస్తు
  5. శ్రీరస్తు
  6. శుభమస్తు
  7. దీర్ఘాయుష్మాన్భవ
  8. ఆయురారోగ్యప్రాప్తిరస్థు
  9. అష్టైశ్వర్యాభివృధిరస్థు
  10. విళంబి నామ ఉగాది (2018) వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి భద్రాద్రి వేద పండితుల ఆశీర్వాదం
    సుపుత్రప్రాప్తిరస్థు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దీవెన&oldid=4354746" నుండి వెలికితీశారు