నలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నలుడు
Nala abandon Damayanthi in Forest.jpg
నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
సమాచారం
గుర్తింపుమహాభారతంలోని పాత్ర
దాంపత్యభాగస్వామిదమయంతి

నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపు స్వారీలో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది. అతని బలహీనత జూదం. ఇతనితో కలి పురుషుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నలుడు గొప్ప వంటకాడు. వంటలపై మొట్టమొదటి పుస్తకం పాకదర్పనమ్ రాశాడు. దమయంతి తండ్రి భీముడు.

కథ[మార్చు]

12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో శ్రీహర్షుడు రాసిన నైషాధ చరిత ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.

దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వాలిద్దరిని వేరు చేస్తానని శపథం చేసాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్ళించడానికి కలికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. చెడు ప్రభావానికి గురైన తరువాత, నలుడు తన సోదరుడు పుష్కరతో పాచికల ఆట ఆడి తన సంపదను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యం నుండి వెళ్ళిపోయేముందు దమయంతి తన పిల్లలను రథసారధితో తన తండ్రి రాజ్యానికి పంపించింది. నలదమయంతులకు ఎవరు సహాయం చేసినా వారికి రాజ్య బహిష్కరణ శిక్ష పడుతుందని పుష్కర హెచ్చరించాడు. దమయంతి నిద్రపోతున్నప్పుడు కలి ప్రభావంతో నలుడు ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

అడవిలో కర్కోటకుడు అనే నాగుని నలుడు అగ్ని నుండి రక్షించాడు. కర్కోటకుడు నాగ తన విషాన్ని చిమ్మగా నలుడు బహుకా అనే వికారమైన మరగుజ్జుగా మారాడు. అయోధ్య రాజు రితుపర్ణుడు దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేయమని కర్కోటకుడు, నలుడికి సలహా ఇచ్చాడు. నలుడు తన అసలు రూపాన్ని పొందడం కోసం ఒక మాయ వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. నలుడు, రితుపర్ణుడు వద్దకు వెళ్లి అతనికి రథసారధిగా, వంటవాడిగా పనిచేశాడు. దమయంతి నిద్రనుండి లేచి చూడగా తన భర్త పక్కన లేకపోవడంతో, కన్నీళ్లు పెట్టుకుంటూ అతనిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ దారిలో ఆమెకు పాము ఎదురయింది. మునులను, వ్యాపారులను, ప్రయాణికులను కలుసుకుంది. రాజ్యానికి రాణి అయిన తన అత్తను కలుసుకుంది. చివరికి, తన తండ్రి రాజ్యాన్ని చేరుకుంది. ఎవరైనా తన భర్త జాడను చెప్తే వారికి బహుమతిని ఇస్తానని ప్రకటించింది. ఆమె సేవకులలో ఒకరు వచ్చి సుదూర రాజ్యంలో బహుకా అనే రథసారధి ఉన్న సమాచారం అందించాడు.

నలుడి జాడ తెలుసుకోవడానికి దమయంతి రితుపర్ణకు ఒక వర్తమానాన్ని పంపింది. దమయంతి మరో వివాహం చేసుకోబోతున్నదని విన్న బహుక రితుపర్ణను తీసుకొని రథాన్ని వేగంగా నడుపుతూ అయోధ్య నుండి విదర్భకు బయలుదేరాడు. ఆ ప్రయాణంలో, కలి తన శరీరం నుండి బయటకు వచ్చి భయంతో క్షమించమని కోరాడు. నలుడు అతనిని క్షమించి, కొద్దిగంటల్లో భీముని రాజ్యానికి చేరుకున్నాడు. దమయంతి తన సేవకుడి ద్వారా రథసారధి బహుకాను తన భవనానికి పిలిపించింది. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టగా నలుడు తన అసలు రూపంలోకి వచ్చాడు.

ఇతర వివరాలు[మార్చు]

  1. యదువు మూడవ కొడుకు.
  2. యయాతి పౌత్రుడు. అణువు రెండవ కొడుకు.
  3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపగా ఆవర్తమానము విని కలిపురుషుడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
  4. విశ్వకర్మ వలన పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

మూలాలు[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2978273" నుండి వెలికితీశారు