వాసుకి

వాసుకి (ఆంగ్లం: Vasuki) నాగలోకానికి రాజు. ఇతడు హిందూ మరియు బౌద్ధ పురాణాలలో పేర్కొనబడ్డాడు. ఇతని తలపై నాగమణి మెరుస్తుంటుంది. బెంగాళీలు పూజించే మనసాదేవి ఇతని సోదరి. అష్టనాగములు (పాములు)లో మిగిలిన పాములు అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు కుశికుడు, పద్ముడు, మహాపద్ముడు మరియు కర్కోటకుడు. పరమశివుడి కంఠము నందు వాసుకి సర్పము అలంకృతమై ఉంటుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాగులలో వాసుకి తానేనని పేర్కొన్నాడు.
క్షీరసాగర మథనం[మార్చు]
క్షీరసాగర మథనం కోసం మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరము లో వదిలాడు. వాసుకి ని ప్రార్థించి వాసుకి కి అమృతం లో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు.
సూర్యుని గణంలో[మార్చు]
ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.[1] మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు.[2]
మూలాలు[మార్చు]
- ↑ కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010
- ↑ ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం