తుంబురుడు
తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు.
సంగీత సంప్రదాయంలో
[మార్చు]పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు కళావతి అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది.[1]
విష్ణుభక్తి
[మార్చు]తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు.[2]
సూర్యుని గణంలో
[మార్చు]ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. [3]నాగులు ప్రయాణం చేస్తారు. మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు. [4]
మూలాలు
[మార్చు]- ↑ తుంబుర - నారదులు:వులాపు బాలకేశవులు:ఆంధ్రభూమి:20/10/2013[permanent dead link]
- ↑ తుంబురుడు భార్యకు చెప్పిన మాఘ మాహాత్మ్యం:చింతన(కాలం):ఆంధ్రప్రభ:8-5-2010[permanent dead link]
- ↑ "కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010". Archived from the original on 2014-07-06. Retrieved 2014-03-12.
- ↑ ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం