చైత్రమాసము

వికీపీడియా నుండి
(చైత్రమాసం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ‌ ప్రాంతంలో చాలా‌ చెట్లు కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. ఇంకా ఈ‌ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

విశేషాలు

[మార్చు]

చైత్రము పండుగలు

[మార్చు]
చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది శ్వేతవరాహకల్పం ప్రారంభం ఆర్యసమాజం స్థాపన
చైత్ర శుద్ధ విదియ అరుంధతీవ్రతము సౌభాగ్య గౌరీ వ్రతము
చైత్ర శుద్ధ తదియ శివడోలోత్సవము మత్స్య జయంతి
చైత్ర శుద్ధ చతుర్థి గణేశ దమనపూజ
చైత్ర శుద్ధ పంచమి శాఇహోత్రపంచమి వసంతపంచమి కూర్మకల్పం ప్రారంభం
చైత్ర శుద్ధ షష్ఠి స్కంద దమనపూజ
చైత్ర శుద్ధ సప్తమి సూర్య దమనపూజ
చైత్ర శుద్ధ అష్ఠమి భవానీ అష్ఠమి,
అశోకాష్టమి
చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి

సమర్థ రామదాసు జయంతి

చైత్ర శుద్ధ దశమి ధర్మరాజదశమి
చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి రుక్మిణీపూజ
చైత్ర శుద్ధ ద్వాదశి భాతృప్రాప్తివ్రతము
చైత్ర శుద్ధ త్రయోదశి మదనత్రయోదశి
చైత్ర శుద్ధ చతుర్దశి శైవచతుర్దశి
చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి
చైత్ర బహుళ పాడ్యమి పాతాళవ్రతం
చైత్ర బహుళ విదియ *
చైత్ర బహుళ తదియ *
చైత్ర బహుళ చవితి *
చైత్ర బహుళ పంచమి మత్స్య జయంతి
చైత్ర బహుళ షష్ఠి *
చైత్ర బహుళ సప్తమి *
చైత్ర బహుళ అష్ఠమి *
చైత్ర బహుళ నవమి *
చైత్ర బహుళ దశమి *
చైత్ర బహుళ ఏకాదశి వరూధినిఏకాదశి
చైత్ర బహుళ ద్వాదశి *
చైత్ర బహుళ త్రయోదశి వరాహజయంతి
చైత్ర బహుళ చతుర్దశి మాసశివరాత్రి
చైత్ర బహుళ అమావాస్య మేష సంక్రాంతి

మూలాలు

[మార్చు]
  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]