Jump to content

మధురకవి

వికీపీడియా నుండి
మధురకవి
జన్మస్థలం తిరుక్కోలూరు
జన్మ నక్షత్రము చిత్ర

మధురకవి 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దముల మధ్య దక్షిణ భారతదేశములో జీవించిన వైష్ణవ సాధువు, కృతికర్త. ఈయన నాలాయిరుమ్ (నాలుగువేల) దివ్యప్రబంధములో తన గురువైన నమ్మాళ్వారును స్తుతిస్తూ 11 పాశురాలను రచించాడు. ఈయన పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడుగా భావిస్తారు. మధురకవి నమ్మాళ్వారు కంటే ముందే పుట్టినందువలన ఈయన్ను నమ్మాళ్వార్ లేవకముందే, సూర్యుడు ఉదయించేముందు స్తుతిస్తారు. సాంప్రదాయ కథలలో ఈయన్ను బాగా చదువుకున్న, సంగీతజ్ఞానమున్న, లోకం తిరిగిన బ్రాహ్మణునిగా చెబుతారు. ఈయన నమ్మాళ్వారు రచనలకు సంగీతాన్ని సమకూర్చాడు.

తొలి జీవితం

[మార్చు]

మధురకవి ఆళ్వారు, ఆళ్వారు తిరునగరి వద్ద తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ దివ్యదేశములో పెరుమాళు వైతమానిధి (అనంత ధనరాశి భండారము) గా వెలశాడు.

మధురకవి ఆళ్వారు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాక తమిళ, సంస్కృత భాషలలో పండితుడు. ఈయన భగవంతుని స్తుతిస్తూ అనేక కీర్తనలు రచించాడు. జీవితములోని ఒక దశలో ఈయన అన్ని సంసారబంధాలను త్యజించి, మోక్షసాధనకై కృషిచేశాడు. ఈ ప్రయత్నములో భాగంగానే ఉత్తరాదిలోని దివ్యదేశాలైన అయోధ్య, మథుర మొదలైన ప్రదేశాలను సందర్శించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Madhurakavi Alvar" (PDF). aranganarumai.googlepages.com.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=మధురకవి&oldid=4010903" నుండి వెలికితీశారు