మాఘమాసము
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది.[1]
మాఘమాస మహాత్మ్యం[మార్చు]
హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది.
పండుగలు[మార్చు]
విశేషాలు[మార్చు]
- రామాయణంలో మాఘశుద్ధ ప్రతిపత్తునాడు అంగద రాయబారము, విదియ మొదలు అష్టమి వరకు యుద్ధము, మాఘశుద్ధనవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, దశమినాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించుటయు వెంటనే నాగపాశములు వదలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదశు లందు ధూమ్రాక్షవధ, త్రయోదశిని అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి మొదలు కృష్ణప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరిమూడు దినములు సంకులయుద్ధము, పంచమిమొదలు అష్టమివరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప నారు దినములలో కుంభకర్ణునివధ, అమావాస్యనాడు శోకమున యుద్ధవిరామము.
- క్రీ.శ. 1894 : విజయ నామ సంవత్సరంలో వేంకటగిరిలో చెలికాని గోపాలరావు తిరుపతి వేంకట కవులు వారిచేత ద్విగుణితాష్టావధానమును చేయించారు.[2]
- క్రీ.శ. 1894 : జయ నామ సంవత్సరంలో బెజవాడలో తిరుపతి వేంకట కవులు అష్టావధానము చెప్పారు.[3]
మూలాలు[మార్చు]
- ↑ భాగవతుల, సుబ్రహ్మణ్యం (2009). ధర్మసింధు. pp. 312–334.
|access-date=
requires|url=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 30. Retrieved 27 June 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 42. Retrieved 27 June 2016. CS1 maint: discouraged parameter (link)