విజయ (సంవత్సరం)
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
విజయ తెలుగు సంవత్సరాలలో 27వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం నందన, తర్వాత సంవత్సరం జయ. దీని అర్థం విశేషమైన జయం కలిగినది. శత్రువులను హరించును. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1893-1894, 1953-1954లో వచ్చిన తెలుగు సంవత్సరానికి విజయ అని పేరు.
2013 : విజయ నామ సంవత్సరం 11 ఏప్రిల్ 2013 గురువారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 31 మార్చి 2014 సోమవారం జయ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "విజయ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 27 | విజయ | 33-34 | 93-94 | 153-154 | 213-214 | 273-274 | 333-334 | 393-394 | 453-454 | 513-514 | 573-574 | 633-634 | 693-694 | 753-754 | 813-814 | 873-874 | 933-934 | 993-994 | 1053-1054 | 1113-1114 | 1173-1174 | 1233-1234 | 1293-1294 | 1353-1354 | 1413-1414 | 1473-1474 | 1533-1534 | 1593-1594 | 1653-1654 | 1713-1714 | 1773-1774 | 1833-1834 | 1893-1894 | 1953-1954 | 2013-2014 | 2073-2074 | 2133-2134 | 2193-2194 | 2253-2254 | 2313-2314 | 2373-2374 | 2433-2434 | 2493-2494 | 2553-2554 | 2613-2614 | 2673-2674 | 2733-2734 | 2793-2794 |
సంఘటనలు
[మార్చు]- 1713-1714: ఆశ్వయుజ శుద్ధ దశమి: విజయనగరం కోట నిర్మించబడింది.
- సా.శ. 1893 : ఆషాఢమాసములో తిరుపతి వేంకట కవులు ఏలూరు పట్టణంలో శతావధానము నిర్వహించారు.[3] అదే సంవత్సరం శ్రావణ భాద్రపద మాసములలో బందరులో అనేక శతావధాన అష్టావధానములు నిర్వహించారు.[4] మార్గశిరమాసములో చెన్నపట్టణములోని అడయారులో అనిబిసెంట్ సమక్షంలో అష్టావధానము నిర్వహించారు.
- సా.శ. 1894 : పుష్యమాసములో నెల్లూరులో అష్టావధానము చేశారు.[5] మాఘమాసములో వేంకటగిరిలో చెలికాని గోపాలరావుగారి వీరిచేత ద్విగుణితాష్టావధానమును చేయించారు.
జననాలు
[మార్చు]- 1893 ఆషాఢ శుద్ధ ఏకాదశి : చల్లా పిచ్చయ్యశాస్త్రి - శతావధాని, సంగీత విద్వాంసుడు. (మ.1959) [6]
- 1894 ఫాల్గుణ బహుళ త్రయోదశి:ఒద్దిరాజు రాఘవ రంగారావు - ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. (మ.1973)
- 1952 కార్తీక బహుళ త్రయోదశి : మద్దూరి రామమూర్తి - అవధాని, ఆశుకవి.[7]
- 1953 ఆషాఢ శుద్ధ సప్తమి: పణుతుల రామేశ్వరశర్మ - అవధాని, ఉపన్యాసకుడు, పరిశోధకుడు, కవి, రచయిత.[8]
మరణాలు
[మార్చు]- 1833-34 - తూము లక్ష్మీనరసింహదాసు, వరద రామదాసు, రామభక్తులు.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 12. Retrieved 26 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 15. Retrieved 26 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 25. Retrieved 27 June 2016.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 203.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 634.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 640.