Jump to content

ఆర్యభట్ట II

వికీపీడియా నుండి
ఆర్యభట్ట II
జాతీయతభారతీయుడు
ఆర్యభట్ట II

ఆర్యభట్ట II (c.920 - c.1000) భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త, మహా సిద్ధాంతం రచయిత. ఇతని కంటే పూర్వుడు, మరింత ప్రసిద్ధుడూ ఐన ఆర్యభట్ట I నుండి వేరు చేయడానికి ఇతనిని రెండవ ఆర్యభట్టు అంటారు.[1]

మహా సిద్ధాంతం

[మార్చు]

ఆర్యభట్ట II రచించిన ప్రసిద్ధ గ్రంథం మహా సిద్ధాంతం. ఇది పద్దెనిమిది అధ్యాయాలు కలిగిన సంస్కృతం శ్లోకాల గ్రంథం. మొదటి పన్నెండు అధ్యాయాలలో గణిత, ఖగోళ సంబంధిత విషయాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ కాలపు భారతీయ గణిత శాస్త్రజ్ఞులు అప్పటివరకు చేసిన విషయాలను వివరిస్తుంది. ఈ పన్నెండు అధ్యాయాలలో చేర్చబడిన వివిధ విషయాలు: గ్రహాల రేఖాంశాలు, సూర్య, చంద్ర గ్రహణాల అంచనాలు, చంద్రవంక పెరుగుదల, గ్రహాల అమరిక, ప్రతి గ్రహాంతర సంబంధాలు, గ్రహాల నక్షత్రాల సంబంధాలు.

తరువాతి ఆరు అధ్యాయాల్లో గ్రహాల రేఖాంశాలను లెక్కించేందుకు అవసరమైన జ్యామితి, భౌగోళిక, బీజగణితం వంటి విషయాలు ఉన్నాయి. గ్రంథంలో ఇరవై శ్లోకాలు అనిర్దిష్ట సమీకరణం పరిష్కరించడానికి విస్తృతమైన నియమాలను ఇస్తాయి. ఈ నియమాలు వివిధ స్థితులలో వర్తించబడ్డాయి. ఉదాహరణకి, భాగహారలబ్ధము సంఖ్య సరి సంఖ్య ఉన్నప్పుడు, భాగహారలబ్ధము సంఖ్య బేసి సంఖ్య ఉన్నప్పుడు, వగైరా.

ఇతర రచనలు

[మార్చు]

ఆర్యభట్ట II ఒక సంఖ్య యొక్క ఘన మూలాన్ని (క్యూబ్ రూట్) లెక్కించేందుకు ఒక పద్ధతిని సాధించాడు. అయితే ఈ పద్ధతిని అంతకు ముందే ఆర్యభట్ట-I సూత్రీకరించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Aryabhata II". islamsci.mcgill.ca. Retrieved 2020-01-25.