వెన్నెల

వికీపీడియా నుండి
(చంద్రకాంతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చంద్రుని ఎడమవైపు మామూలుగా కనిపిస్తే; కుడివైపు సూర్యకాంతితో వెలిగిపోతుంది.
వెన్నెలలో ఈ ఛాయాచిత్రాన్ని తీయడానికి ఎక్స్పోజర్ తీసుకున్న సమయం పది నిమిషాలు

వెన్నెల ఎక్కువగా సూర్యకాంతిని కలిగి ఉంటుంది (తక్కువ భూకాంతితో). సూర్యుని కాంతి తాకిన చంద్రుని ఉపరితల భాగాల నుండి ప్రతిబింబిస్తుంది.[1] సూర్యకిరణాలు చంద్రునిపై పడి ప్రతిబింబించే కాంతిని వెన్నెల అంటారు. ఇది చంద్రుడు కనిపించే రాత్రి సమయంలో భూమి యొక్క ఉపరితలంపై ప్రకాశిస్తుంది. చంద్రుని తక్కువ పరావర్తనం కారణంగా చంద్రకాంతి సూర్యకాంతి కంటే చాలా మసకగా ఉంటుంది. రాత్రులందు చంద్రుడు నుంచి వెలువడే చల్లని వెలుగును వెన్నెల అంటారు. వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు. వెన్నెలను ఆంగ్లంలో మూన్ లైట్ అంటారు. పగలు చంద్రుడు వెన్నెల కురిపించినప్పటికి సూర్యుని వెలుతురు ఎక్కువగా ఉండుట వలన చంద్రకాంతిని గుర్తించలేరు, అందువలన చంద్రుడు రాత్రులందు కురిపించే కాంతినే వెన్నెల అంటారు. తెలుగు సినిమా పాటలలో, కవిత్వాలలో వెన్నెలకు విశేష ప్రాముఖ్యముంది. చంద్రుని నుంచి వెలువడే చంద్రకాంతి, శుక్లపక్షంలో రోజు రోజుకు పెరుగుతూ, కృష్ణ పక్షంలో రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు వెన్నెల కురిపించనందున రాత్రులందు చీకటిగా ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా వెన్నెల కురిపిస్తాడు, కావున పౌర్ణమి చంద్రుడిని నిండు చంద్రుడు అని కూడా అంటారు. పౌర్ణమి రోజున వెన్నెల కురిసే చోట రాత్రిలందు కూడా వెలుతురుగా ఉంటుంది. చంద్రకళలలో మార్పులకు కారణం చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాకపోవడమే, సూర్యుని నుంచి పొందిన వెలుతురును బట్టి వెన్నెల హెచ్చు తగ్గుల్లో మార్పులుంటాయి. అమావాస్య తరువాత వచ్చే మొదటి వెన్నెలనిచ్చే చంద్రుడిని నెలపొడుపు అంటారు. సూర్యాస్తమయం తరువాత చంద్రోదయంతో వెన్నెల ప్రారంభమవుతుంది. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా వెన్నెలలో కొద్దిగా మార్పులు ఉంటాయి.

చంద్రకళలలో మార్పులకు కారణం

[మార్చు]

భూమిపై అర్ధగోళములో ఎప్పుడూ సూర్యకాంతి ప్రసిరించినట్లే, చంద్రుని అర్ధగోళముపై సూర్యకాంతి సతతం ప్రసరిస్తునే వుంటుంది, ఒక్క చంద్రగ్రహణం సమయంలో తప్పించి. చంద్రకాంతి హెచ్చు తగ్గులుగా మారుటకు కారణం, భూమి చుట్టూ చంద్రుని భ్రమణకాలం, భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టుకాలం, సూర్యుని చుట్టూ భూమి తిరుగుటకు గల భ్రమణ కాలాల వ్యాత్యాసం వలన చంద్రకళలలో తేడాలు, అమవ్యాస, పూర్ణిమలు ఏర్పడుతాయి. ఉదాహరణకు పున్నమి రోజు సూర్యుడు పడమట వున్నప్పుడు, చంద్రుడు తూర్పున వున్నందున సూర్యకాంతి పడు చంద్రుని అర్ధగోళము సంపూర్ణంగా కనిపిస్తుంది. అమవాస్య రోజున సూర్యచంద్రులు పడమటి దిక్కుననే వుండటం వలన చంద్రకాంతి మనకు కనిపించదు.

భూమిపై వెన్నెలలో సరస్సు దాని పరిసరాలు
గ్రహణం ద్వారా చంద్రుడు ఎర్రగా ఉన్న దృశ్యం

చిత్రకళలో వెన్నెల

[మార్చు]

పాటలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Toomer, G. J. (December 1964). "Review: Ibn al-Haythams Weg ur Physik by Matthias Schramm". Isis. 55 (4): 463–465 [463–4]. doi:10.1086/349914.
"https://te.wikipedia.org/w/index.php?title=వెన్నెల&oldid=3960841" నుండి వెలికితీశారు