చర్చ:ఉపనిషత్తు
Jump to navigation
Jump to search
- ఈ వ్యాసాన్ని శుద్ధి చేసే పనిలో సరళంగా ఉన్ననూ సమగ్రమైన విషయం లేనందున కొన్ని వాక్యాలను తొలగించడం జరిగింది. ఆ తొలగించబడిన వాక్యాలకు సంబంధించిన సమాచారం మరింత సమగ్రంగా విపులంగా వ్రాయడం జరిగింది. అయినా ఆయా విషయాలను ఇంకా విశదీకరించవలసిన అవసరం ఉంది - శ్రీహరి
కొన్ని సూచనలు
[మార్చు]- ఈ సూచనలు వేద సాహిత్యంతో అంతగా పరిచయంలేక ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలని ఈ వ్యాసము చదువువారికి మరియు మార్చువారికి మాత్రమే.
- ఈ వ్యాసంలో తెలుపబడిన బ్రహ్మము అనగా పరబ్రహ్మము, పరమాత్మ. అంటే భగవంతుడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మగా అర్థం చేసుకోరాదు. దీనినే ఆంగ్లములో బ్రహ్మన్ (Brahman) అని వ్రాస్తారు. ముందుగా దీనిని ఆంగ్లములో చదివినవారు "బ్రాహ్మణ" గా అర్థం చేసుకోరాదు. బ్రాహ్మణులు చతుర్వర్ణాలలో ఒక వర్గం. ఉపనిషత్తులు పరబ్రహ్మము యొక్క చింతనను, జీవాత్మ-పరమాత్మల యొక్క సంబంధాన్ని మాత్రమే చర్చించాయి.
- బ్రహ్మ, బ్రహ్మము, బ్రాహ్మణ, బ్రాహ్మణము, బ్రాహ్మణకము, బ్రాహ్మణత్వము, బ్రాహ్మణతత్వము, బ్రాహ్మణుడు, బ్రాహ్మణ్యము, బ్రాహ్మణి, బ్రాహ్మణకాలు, మరెన్నో, అన్నీ వేరు వేరని గ్రహించగలరు.
ఇందు ప్రస్తావించిన, ప్రస్తానత్రయం అను చోట ఉపనిషత్తులు అని వ్రాసిన దానిని, దశోపనిషత్తులు గా సరిచేయవలయును.