సూర్యోపనిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యోపనిషత్తు

సూర్యోపనిషత్తు, [1] అథర్వణ వేదం లోనిది. అన్ని ఉపనిషత్తులులో అతి చిన్నది ఇది. ఇందులో ప్రథమముగా ఒక శాంతి మంత్రము, తరువాత ఉపనిషత్ మంత్ర భాగము చివరగా ఫలశ్రుతి చెప్ప బడ్డాయి. ఉన్న అన్ని ఉపనిషత్తులులో ఫలశ్రుతి చెప్పబడ్డ అతి తక్కువ ఉపనిషత్తులులో ఇది ఒకటి.

సూర్యోపనిషత్తు[మార్చు]

ఈ ఉపనిషత్ లోని కొన్ని ప్రధానమైన మంత్రముల యొక్క సాధారణ ఆర్థము భావము తెలియజేసే ప్రయత్నమే ఈ వ్యాసము.

శాంతి మంత్రం:[మార్చు]

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః|
భద్రం పశ్యేమాక్ష భిర్య జత్రాః|
స్థిరైరంగై స్తుష్ఠువాగ్‍ం స స్తనూభిః|
వ్యశే మదేవహితం యదాయుః|
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః|
స్వస్తి నః పూషా విశ్వ వేదాః|
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః|
స్వస్తి నో బృహస్పతిర్దధాతు||

ఆర్థం
ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,
ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక ! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక ! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక ! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక !

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఆర్థం
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు" అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.

ఉపనిషత్ మంత్రం[2][మార్చు]

ఓం అథ సూర్యాధర్వాన్గీరసం వ్యాఖ్యాస్యామః!
భ్రహ్మా ఋషిః!
గాయత్రీ చందః!
ఆదిత్యో దేవతా!
హంసః సో హామగ్ని నారాయణ యుక్తం బీజమ్!
హృల్లెఖా శక్తిః!
వియదాది సర్గ సంయుక్తం కీలకమ్!
చతుర్విధ పురుషార్ధ సిద్ధ్యర్దే జాపే వినియోగః!

ఆర్థం
సాధారణముగా సనాతన ధర్మములో ఉన్న అన్ని మంత్రములకు కొన్ని ముఖ్య లక్షణాలు ఉండాలని పేర్కొన బడినది, అవి, ఆయా మంత్ర ముల ద్రష్ట ఐన ఋషి పేరు, ఆ మంత్రం ఏ చంధస్సు లో ఉన్నది అన్న అంశం, ఈ మంత్రం భాగములో ప్రధానంగా స్తుతించ బడుతున్న దేవతా మూర్తి ఎవరు అన్న వివరము, ఆ దేవతా మూర్తికి సంభందించిన బీజాక్షరాల వివరములు, ఆ మంత్ర భాగము యొక్క శక్తి వివరములు, మత్రార్థము కొరకు కీలకంగా, ఈ మంత్ర భాగాన్ని ఎందు కొరకు (ఆకాంక్షను) జపము జేయుచున్నారు అన్న విషయం ఉంది తీరాలి. మరి కొన్ని మంత్రములకు అంగన్యాస, కరన్యాసాలను కూడా ప్రస్థావన జేయటం జరుగుతుంది. వీటిని సప్తాంగములు అని పిలుస్తారు. అందులో భాగంగానే పైన చెప్ప బడిన మంత్రములో ఈ వివారాలు ఇలా జెప్పటం జరిగినది.
  • ఋషి - భ్రహ్మా
  • ఛందస్సు - గాయత్రీ
  • దేవత - ఆదిత్యుడు
  • బీజం - "హంసః సో హామగ్ని నారాయణ యుక్తం"
  • శక్తి - హృల్లెఖా. హృల్లెఖా[3] అనగా జ్ఞానాన్ని సముపాదించాలి అన్న జిజ్ఞాస, ఉత్సుకత, ఆదుర్దా.
  • కీలకం - "వియదాది సర్గ సంయుక్తం"
  • అర్ధము - "చతుర్విధ పురుషార్ధ సిద్ధి కోసము" - ధర్మ అర్థ కామ మోక్ష ములను చతుర్విధ పురుషార్ధములు అంటారు
  • వినియోగము - శ్రీ సూర్య భగవానుడు యొక్క ప్రసాద సిద్ధి కోసము


షట్ స్వరారూఢేన బీజేన షడంగం రక్తామ్బుజ సంస్థితం
సప్తాశ్వ్రదినం హిరణ్య వర్ణం చతుర్భుజం పద్మద్వయా భయ వరద హస్తం
కాల చక్ర ప్రణేతారం శ్రీ సూర్య నారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః!!

ఆర్థం
ఆరు స్వరములు కలిగిన సూర్య బీజ మంత్రము కల్గి, ఆరు అంగములతో ఎఱ్ఱని వర్ణము గల పుష్పము (తామర పువ్వు)ను అధిష్టించి, బంగారు వర్ణముగల మేని ఛాయతో, ఏడూ మేలైన గుఱ్ఱములు గల రధమును ఎక్కి, రెండు హస్తములలో పద్మము ధరించి అభయ హస్త ముద్రను ధరించి కాల చక్రమును ముందుకు నడుపు నది శ్రీ సూర్యనారాయణుడే ఇదియే వేదము అని తెలిసిన వాడే అసలు బ్రాహ్మణుడు.

ఓం భూర్భువః సువః! తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి!
ధియో యోనః ప్రచోదయాత్!
సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ! సూర్యా ద్వై ఖల్విమాని భూతాని జాయన్తే!
సుర్యాధ్యజ్ఞః పర్జన్యో న్నమాత్మా!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

నమస్తే ఆదిత్య!
త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి!
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి!
త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి!
త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి!
త్వమేవ ప్రత్యక్షం ఋగసి!
త్వమేవ ప్రత్యక్షం యజురసి!
త్వమేవ ప్రత్యక్షం సామాసి!
త్వమేవ ప్రత్యక్ష మధర్వాసి!
త్వమేవ సర్వం చన్దోసి!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

ఆదిత్యాద్వాయుర్జాయతే!
ఆదిత్యాద్భూమిర్జాయతే!
ఆదిత్యాదాపోజాయన్తే!
ఆదిత్యా జ్జ్యోతిర్జాయతే!
ఆదిత్యాద్ వ్యోమ దిశో జాయన్తే!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

ఆదిత్యాద్ దేవా జాయన్తే!
ఆదిత్యాద్ వేదా జాయన్తే!
ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి!
అసావాదిత్యో బ్రహ్మా!

ఆదిత్యోన్తఃకరణ మనో బుద్ధి చిత్తా హంకారాః!
ఆదిత్యో వై వ్యానస్సమానోదానోపానః ప్రాణః!
ఆదిత్యో వై శ్రోత్ర త్వక్ చక్షురసన ద్రాణాః!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

ఆదిత్యో వై వాక్పాణి పాద పాయూ పస్థాః!
ఆదిత్యో వై శబ్ద స్పర్శ రూప రస గంధా!
ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గా నన్దాః!
ఆనన్దమయో విజ్ఞాన మయో విజ్ఞానఘన ఆదిత్యః!
నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి!
బ్రాజిష్ణవే విశ్వహేతవే నమః!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు!
సూర్యే లయం ప్రాప్నువన్తి యః సూర్యః సోహమేవచ!
చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః!
చక్షుర్దాతా దధాతు నః!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి!
తన్నః సూర్యః ప్రచోదయాత్!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

సవితా పురస్తాత్ సవితా పశ్చాత్తాత్ సవితోత్త రాత్తాత్ సవితా ధరాత్తాత్!
సవితా నః సువతు సర్వతాతి సవితా నొ రాసతాం దీర్ఘ మాయుః!

ఆర్థం
ఈ శ్లోకము ఆర్థము.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మా!
ఘ్రుణిరితి ద్వే అక్షరే!
సూర్య ఇత్యక్షర ద్వయమ్!
ఆదిత్య ఇతి త్రిణ్యక్షరాణి!
ఏత స్త్యేవ సూర్య స్త్యాష్టాక్షరో మనుః!

ఆర్థం

ఈ శ్లోకము అర్థము:

ఓం అనే ఒక అక్షరము (బ్రహ్మం)
ఘ్రుణి అనే రెండక్షరాలు (కిరణం)
సూర్య అనే రెండక్షరాలు (తేజస్సు)
ఆదిత్య అనే మూడక్షరాలు (అదితి పుత్రుడు)
ఈ ఎనిమిది అక్షరాలు సూర్య మంత్రము

అదే అష్టాక్షరీ మంత్రం = “ఓం నమో నారాయణాయ”

ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మ స్వరూపం

ఉపనిషత్ ఫలశ్రుతి[మార్చు]

యః సదా హర హార్ జపతి!
స వై బ్రాహ్మణో భవతి!
స వై బ్రాహ్మణో భవతి!
సూర్యాభి ముఖో జప్త్వా మహా వ్యాధి భయాత్ ప్రముచ్యతే!
అలక్ష్మిర్నశ్యతి!
అభక్ష్య భాక్షణాత్ పూతో భవతి!
అగమ్యా గమనాత్ పూతో భవతి!
పతిత సంభాషణాత్ పూతో భవతి!
అసత్ సంభాషణాత్ పూతో భవతి!

ఆర్థం
ఈ సూర్యోపనిషత్ ను క్రమం తప్పకుండా ఎల్ల వేళలా ఎవరైతే పూర్తి భక్తి శ్రద్ధలతో చదువుతారో వారు బ్రాహ్మణులుగా వ్యవహరింప బడుదురు అట్టి వారే బ్రాహ్మణులుగా వ్యవహరింప బడుదురు. ఎవరైతే సూర్య బింబమునకు అభిముఖముగా ధర్భాసనము మీద కూర్చుని చదువుతారో (జపము చేస్తారో) వారికి మహా వ్యాధి భయముల నుంచి విముక్తి కలుగు తుంది. దారిద్యము, పేదరికము నివారింప బడతాయి. తినకూడనివి తిన్న దోషములు, గమ్యము లేని ప్రయాణము చేసిన దోషములు, అపవిత్రులతోను, పతితలతోను చేసిన సంభాషణ వల్ల కలిగిన దోషములు, అసత్యం ఆడుట వల్ల కలిగిన దోషములు, అబద్ధం చెప్పుట ద్వారా కలిగిన దోషములు ఇలా అనేక రకాల దోషముల నుంచి, ఈ సూర్యోపనిషత్ చదివిన వారికి నివృత్తి లభిస్తుంది అని జెప్ప బడినది.


మధ్యాహ్నే సుర్యాభిముఖః పఠెత్!
సద్యోత్పన్న పంచ మహా పాత కాత్ ప్రముచ్యతే!
సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మై చిత్ప్ర శంసయేత్!

ఆర్థం
ఈ సూర్యోపనిషత్ ను క్రమం తప్పకుండా ఎవరైతే మధ్యాన్న వేళలయందు పూర్తి భక్తి శ్రద్ధలతో చదువుతారో (జపమాచరణ చేస్తారో) వారు ఇతః పూర్వము చేసిన పంచ మహా పాతకములు నుంచి విముక్తులు కాబడతారు. పంచ మహా పాతకములు[4] అనగా ఐదు మహా పాపములు అని అర్థము, అవి స్త్రీ హత్య, శిశు హత్య, గొ హత్య, బ్రహ్మ హత్య, స్వర్ణ చౌర్యము (దొంగతనము). అలాగే మరోచోట[5] మద్య పానము, గురు పత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము వంటివి అని కూడా చెప్ప బడినది. ఇట్టి పాపములకు నిష్కృతి లేదు అని వాటిని అనుభవించక తప్పాదు అని బ్రహ్మ పురాణములో వేదవ్యాసుడు అభివర్ణించారు. కానీ సూర్యోపనిషత్ జపము ఆచరణ చేసినవారికి నిష్కృతి లభిస్తుంది అని జెప్ప బడినది. అట్టి వారికి అన్ని విద్యా బుద్ధులు అబ్బుతాయి.


య ఏతాం మహా భాగః ప్రాతః పఠతి, స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి!
వేదార్థం లభతే!

ఆర్థం
ఈ సూర్యోపనిషత్ ను క్రమం తప్పకుండా ఎవరైతే ప్రాతః కాల వేళ పూర్తి భక్తి శ్రద్ధలతో చదువుతారో (జపమాచరణ చేస్తారో) వారు భాగ్య వంతులు అవుతారు, వారికి పశు సంపద లభిస్తుంది, వారు వేదముల వేదాంతముల యొక్క అంతరార్థము తెలుసుకొ గలుగుతారు.


త్రికాలమేతజప్త్వా క్రతు శత ఫల మవాప్నోతి!
హస్తా దిత్యే జపతి,
స మహా మృత్యుం తరతి స మహామృత్యుం తరతి

ఆర్థం
ఈ సూర్యోపనిషత్ ను క్రమం తప్పకుండా ఎవరైతే మూడు కాలముల యందు పూర్తి భక్తి శ్రద్ధలతో చదువుతారో (జపమాచరణ చేస్తారో) వారికి వంద క్రతువులు, యజ్ఞ, యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆదివారం నాడు హస్తానక్షత్రం ఉన్న రోజున సూర్యోపనిషత్ ను పూర్తి భక్తి శ్రద్ధలతో జపమాచరణ చేస్తారో వారికి మహా మృత్యు భయం ఉండదు, అట్టి వారికి అకాల మృత్యు భయం కూడా ఉండదు.


య ఏవం వేద! ఇత్యుపనిషత్!!!

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఆర్థం
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు" అను ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.


సారాంశం[మార్చు]

ఈ సృష్టి మొత్తానికి ఆధార భూతమై ప్రత్యక్ష దైవముగా అంతరీక్షములో వెలుగు తున్న సూర్య భగవానుడు మనకు ఆరాధ్యుడు. ఈ సూర్యుడే బ్రహ్మ, విష్ణు రుద్ర స్వరూపుడని. ఈయనే అన్ని వేదములకు ఆద్యుడని.

ఇది కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

  1. "సూర్యోపనిషత్తు". Archived from the original on 2017-01-13. Retrieved 2017-02-23.
  2. "ఈ ఉపనిషత్ ఆర్థము". Archived from the original on 2017-02-14. Retrieved 2017-02-24.
  3. హృల్లెఖా[permanent dead link]
  4. "పంచ మహా పాతకములు". Archived from the original on 2016-11-27. Retrieved 2017-02-23.
  5. పంచ మహా పాతకములు 2[permanent dead link]