మణిపురి (నృత్యం)
స్వరూపం
మణిపురి (నృత్యం) ఈశాన్య భారత దేశానికి చెందిన మణిపురి అనే ప్రాంతానికి చెందినది. ఇతర భారతీయ నృత్య రీతులకన్నా ఇది చాలా విభాగాల్లో విభిన్నమైనది. ఇందులో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ క్రమంగా ఆ కదలికలు చేతుల నుంచి వేళ్ళ దాకా ప్రవహిస్తాయి. 18వ శతాబ్దంలో వైష్ణవ తత్వం ప్రాభల్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి మూలం ప్రాచీనమైన వైదిక నృత్యమే. విష్ణు పురాణం, భాగవత పురాణం, గీతా గోవిందం లనుంచి ఎక్కువగా రూపకాలను ప్రదర్శిస్తారు.
ఈ నృత్య ప్రదర్శనలో వచ్చే సంగీతం మణిపురి సాంప్రదాయాన్ని ప్రతిబింబింప జేస్తుంది. [1]
విశేషాలు
[మార్చు]- నాట్యం చేసే స్థలాన్ని చాలా పవిత్రంగా భావించాలి. ఎక్కడంటే అక్కడ నర్తించడం కుదరదు.
- ఈ నృత్యాన్ని వినోదం కోసం కాక అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శిస్తారు. చూసేవారికి కూడా భక్తి భావం కలగాలని దీని ముఖ్యోద్దేశం.
- కళాకారుల వస్త్రధారణలో ఎటువంటి అసభ్యతకూ తావులేకుండా జాగ్రత్త వహిస్తారు.
- నాట్యం చేసేటప్పుడు కళాకారులు ఇతర కళాకారుల వైపు కానీ ప్రేక్షకుల వైపు గానీ దృష్టి సారించరు. కళాకారులు బాహ్య ప్రపంచ మాయలను వదలి భగవంతుని శ్రద్ధ చూపుతారనడానికి ఇది నిదర్శనంగా భావిస్తారు,[2]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-20. Retrieved 2008-09-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-26. Retrieved 2008-09-23.