జష్పూర్ జిల్లా
జశ్‌పూర్ జిల్లా
जशपुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | జశ్‌పూర్ నగర్ |
మండలాలు | 8 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,838 కి.మీ2 (2,254 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 8,51,669 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82% |
• లింగ నిష్పత్తి | 1000:1005 |
ప్రధాన రహదార్లు | 1(NH-43) |
Website | అధికారిక జాలస్థలి |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో జశ్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా జశ్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా సరిహద్దులలో జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.[1] జాస్‌పుర్ పట్టణంలో ప్రముఖ సేవాసంస్థ, అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమ కేంద్ర కార్యాలయాన్ని స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా అనేక శాఖలతో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తోంది.
చరిత్ర
[మార్చు]బ్రిటిష్ రాజ్ పాలనా సమయంలో " ఈస్టర్న్ స్టేట్ ఏజంసీకి " జశ్‌పూర్ పట్టణం జశ్‌పూర్ రాజసంస్థానానికి రాజధానిగా ఉండేది.[2]
భౌగోళికం
[మార్చు]జిల్లా ఉత్తర దక్షిణాల పొడవు 150 కి.మీ. అలాగే తూర్పు, పడమర వెడల్పు 85 కి.మీ. జిల్లా వైశాల్యం 6,205చ.కి.మీ. జిల్లా 22° 17′, 23° 15′ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83° 30′, 84° 24′ తూర్పు రేఖాంశంలో ఉంది.
- జశ్‌పూర్ 2 విభాగాలుగా విభజించబడింది : ఉత్తర పర్వత ప్రాంతం, నీచ్‌ఘాట్ అని పిలువబడే దక్షిణ భూభాగం.ఉత్తర భూభాగం లోరోఘాట్‌లో మొదలై కస్తురా, నారాయణపూర్, సుర్గుజా సరిహద్దులో ఉన్న బగీచా వరకు సాగుతుంది. ఈ ప్రాంతం సంరక్షిత అరణ్యాలుగా నిర్ణయించిన అరణ్యాలతో నిండి ఉంటుంది. సన్నా, బగీచా, నారాయణపూర్ అరణ్యాలతో నిండి ఉంది. సముద్రమట్టానికి 1200 ఎత్తున ఉన్న ఎగువభూభాగ పీఠభూమి వైశాల్యం 1384 చ.కి.మీ. ఇది దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. ఈ పీఠభూమిని పాత్ అంటారు. ఎగువభూములను లోరోఘాట్ నుండి పైకి పోతూఉంది. లోరోఘాట్ 3 టర్నిగ్ పాయింట్లతో 4కి.మీ పొడవు ఉంటుంది. నీచ్ఘాట్ సాధారణంగా చదరంగా ఉంటుంది. అయినా ఈ భూభాగంలో ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. జశ్‌పూర్, రాయ్‌పూర్ రహదారిలో వద్ద ఉన్న 2 ఘాట్ రోడ్లలో ఒకటి కంసబెల్ ముందున్న జండాఘాట్ అలాగే మరొకటి కంసబెల్ తర్వాత ఉన్న బాలాఘాట్.
పట్టణాలు
[మార్చు]జాతీయరహదారి 78లో జిల్లాలోని ప్రధాన పట్టణాలు (ఎగువ భూములలో లోడం, ఘోలెంగ్, జశ్‌పూర్, కుంకురి, బందర్చువాన్, కంసబెల్, లడెగ్, పత్తలగొయన్) ఉన్నాయి.
- జశ్‌పూర్ నుండి పోతున్న రహదార్లు :
- జష్పూర్ రాంచీ. మనోరా, కుస్మి (170) ద్వారా
- జష్పూర్ అంబికాపూర్ . సన్న బగీచా (కిమీ 170 & ఎన్.బి.ఎస్.పి ) ద్వారా
- జష్పూర్ అంబికాపూర్. ఈ 2, 3 వాతావరణ రోడ్డు కాదు. కుంకురి, పత్తల్గొయన్ ద్వారా
- జష్పూర్ అంబికాపూర్ (200 కిమీ). నారాయణపూర్, బగీచా ద్వారా
- జష్పూర్ అంబికాపూర్.
చరిత్ర
[మార్చు]జిల్లా లోని నిచ్ఘత్ ప్రాంతంలోని కున్‌కురి అత్యంత వేడి ప్రదేశం. అలాగే ఎగువ పర్వతభూభాగంలో ఉన్న పంద్రపతి జిల్లాలో అత్యంత చల్లని ప్రదేశం. ఇది అరణ్యప్రాంతంలో ఉంది. రాయ్‌ఘర్, అంబికాపూర్‌ల లేక జశ్‌పూర్ మధ్య ఇది కూడలి ప్రాంతం.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 852,043, [3] |
ఇది దాదాపు. | క్వతార్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 473వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 146 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.65%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1004:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.6%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Qatar 848,016 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
South Dakota 814,180
వెలుపలి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్సైటు
- [1] List of places in Jashpur
- Tribes of Jashpur District Archived 2007-10-30 at the Wayback Machine
- Tourism in Jashpur District Archived 2007-09-28 at the Wayback Machine